బాషా- పువ్వులు

బాషా ఒక్కసారి చెప్తే ఒక్కసారే చెప్పినట్టు అని చెప్పను కదా సో మన బాషా కు వయసు చిన్నదే కానీ అనుభవం పెద్దది అయితే వాడికి లాభం లేనిదే ఏమి చేయడు , అంటే వాడి దృష్టి లో ప్రతి దాన్ని డబ్బు తో కంపేర్ చేస్తాడు అందుకే వాడు దేన్నీ అయినా అలాగే చూస్తాడు , ఇక పోతే వాడు డబ్బు కు, తనతో పని ఉన్న వారికీ ఎలా ముడి పెడతాడో చూద్దామా .. అమ్మా పువులమ్మా  పువ్వులు రండమ్మ రండి అంటూ ఆ కాలని లోకి వచ్చాడు బాషా సైకిల్ పై వాడి బెల్లు కు అందరూ కాకున్నా కొందరు మాత్రం బయటకు వచ్చారు ప్రోద్దటి పూజకు కావాల్సిన పువ్వుల కోసం  అందరూ వాడిని చుట్టూ మూగారు. అయితే వారిలో దాదాపు అందరూ ఆడవాళ్లే ఉన్నారు కానీ దూరంగా ఉన్న గేటు ఇంటి ఓనర్ మాత్రం వాడినే చూస్తూ ఏదేదో సైగలు చేస్తూ ఉన్నాడు . అది గమనించిన బాషా వారందర్నీ గబగబా పంపేసి ఆ ఇంటి ఒనర్ దగ్గరికి వచ్చాడు.

ఏంటి సర్ ఏంటి ఎదో దిగులుగా ఉన్నారు అంటూ వచ్చి అటూ ఇటూ చూసాడు ఆ తర్వాత వాడు ప్యాంటుజేబు లోంచి ఒక బుడ్డి తీసి అతనికి ఇచ్చాడు ,అది తీసుకున్న అతను ఇది గో అంటూ అయిదువందల నోటు ఇచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి అతను వెళ్ళడం చూసి బాషా కూడా వచ్చింది కూడా తెలియంత వేగంగా వెళ్ళిపోయాడు సైకిల్ దగ్గరికి ఆ తర్వాత మాములే మళ్ళి అరవడం మొదలు పెట్టాడు.

    ఇంతకి ఆ గేటు అతను ఎవరు అతను వెళ్లి తెచ్చుకోకుండా వీడితో తెప్పించడం ఏంటి అంటారా అదే చెప్పబోతున్న వినండి మరి ..అతను ఎవరు అంటే ఆ కాలనీ లోని ముఖ్యమైన పూజారి మరియు కమిటి మెంబెర్ కూడా అయితే అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఈ పూజారి మాత్రం మందు లేకుండా ఒక్క అయిదు నిముషాలు కూడా ఉండలేడు ,పాపం అది అతని తప్పు కాదు అతనికి అలవాటు చేసిన అతని స్నేహితులది మరి పూజారి కదా అంటారా అది వేరే విషయం ఇక సరే నేను ఇక్కడ ఎవర్ని కించపరచడానికి చెప్పడం లేదు . దయచేసి దిన్ని పెద్దగా చేయవద్దు.

ఇక పోతే అతనికి పాపం వాళ్ళ స్నేహితుల వల్ల అలవాటు అవ్వడం ,అది కూడా తాగకుండా ఉండకుండా ఉండలేని స్థితి లో ఇలా తెప్పించుకుంటూ ఉంటాడు. ఈ విషయం ఇంట్లో వారికీ కానీ ఆ కాలనీ వారికీ కానీ తెలిదు పాపం అతనికి ఇంట్లో ఉండాల్సిన కోటా అయిపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది ఇక పోతే ఇప్పుడు అతని జుట్టు బాషా చేతికి చిక్కింది సో అతన్నో అట ఆడుకోవాలని అనుకున్నాడు మనసులోనే ఎందుకంటే అతను పాపం మొదటే అయిదు వందలు ఇచ్చాడు మరి తన జుట్టు వాడి చేతిలో ఉంటె ఇక డబ్బే డబ్బు అనుకుని ఒక పని చేసాడు అదేంటంటే…

క్యా రే హోగయా కాం అన్నాడు రఫీ తో బాషా హ హోగయా అన్నా అన్నాడు పదేళ్ళ రఫీ తెలుగు హిందీ కలిపి మాట్లాడుతూ వాడి దగ్గరి నుండి ఫోన్ తీసుకుని తన జేబు లో వేసుకుని వాడికి ఒక యాబై రూపాయల నోటు నీ ఇచ్చి వెళ్లి పోయాడు విజిల్ వేస్తూ, రఫీ ఆ కాలనీ లోనే ఉంటాడు వాడికి తండ్రి లేడు.ఇలా బాషా అప్పుడప్పుడు ఫోన్ ఇచ్చి చాటు గా వీడియో తీయ్యమని అంటాడు. దానికి వాడికి పదో పరకో ఇస్తాడు. పాపం పదేళ్ళ రఫీ అవి తీసుకుని తన చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు…. మరి బాషా ఆ ఫోన్ తో ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను అయితే ఒకటి దీనికి నేను నంబర్స్ వేయడం లేదు సో మీరే గుర్తు పెట్టుకోవాలి మరి ఉంటాను ..      

Related Posts