బాషా – పువ్వులు 4

బాషా ఈ విడియో తో ఏం చేయబోతున్నాడో తెలుసుకుందాం ఇక పదండి కథ లోకి ఏంట్రా చాలా హుషారుగా ఉన్నావు అంటూ అడిగాడు పాన్ షాప్ అన్వర్ అదేం లేదన్నా ఈ రోజు పువ్వులు బాగా అమ్ముడు అయ్యాయి అందుకే జర కుషీగా ఉన్నా అంటూ కాయిన్ బాక్స్ దగ్గరికి నడిచాడు బాషా ..

అదేంటి నీకు ఫోన్ ఉంది కదరా మళ్ళి ఎవరికీ అని అడిగాడు ఆన్వర్  అదేం లేదన్న దోస్తుకు ఫోన్ చేయాలే అన్నాడు బాషా అయితే నీ ఫోన్ నుంచి చెయ్యలేవా అని మళ్ళి ఎదో ఆలోచిస్తూ ఓరే పిల్లగా ఫోన్ గందుకేనా కాయిన్ బాక్స్ నుండి చేస్తున్నావు బిడ్డా దోర్కొద్దు అనేనా రా అని కుతూహలంగా అడిగాడు అన్వర్ పాపం తనకి లవ్ మారేజీ చేసుకోవాలని చాలా ఉండేది కానీ పదహారు ఏళ్ళ కే తల్లి దండ్రులు మేన మామ కూతుర్ని ఇచ్చి చేయడం తో ఇదిగో ఇలా ఎవరైనా ఫోన్ చేస్తే చాలు వారి లవ్ మాటలు వింటూ ఉంటాడు వారికీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు..

 బాషాకు ఏం చెప్పాలో అర్ధం కాక  లవర్ అంటే తమ మాటల్ని వినద్దు అన్నా  ఏదోటి చెప్పాలి అని అవునన్నా  మస్తు సిగ్గు తనకు అందుకే కాయిన్ బాక్స్ నుండి చేయిమన్నది అన్నాడు ముందు జాగ్రత్త గా సరే పో రా మాట్లాడు అన్నాడు అన్వర్ ఫోన్ బట్ట తో తుడిచి ఇస్తూ, ఎంతో కష్టపడి పెట్టుకున్న ఈ కాయిన్ బాక్స్ను తిసేయ్యలేక లవర్స్ కి హెల్ప్ చేస్తున్న అన్వర్  దాంతో సరే అంటూ తన ఫోన్ లో నుండి నెంబర్ తీయగానే కాయిన్ ఇచ్చి షాప్ లోంచి బయటకు వెళ్ళాడు అన్వర్ వాళ్ళ మాటల్ని వినకూడదు అనే కామన్ సెన్స్ తో , అతను వెళ్ళగానే తను నెంబర్ తీసి డయల్ చేసి అన్వర్ వైపు వీపు పెట్టి  జేబులోంచి కర్చిపు తీసి ఫోన్ పై పెట్టి రెడీ గా నిలబడ్డాడు ..

అవతల ఫోన్ రింగ్ అయ్యి, లిఫ్ట్ చేయగానే ఏం సర్ మందు ఎలా ఉంది అని అడిగాడు బాషా. దానికి అవతలి వైపు నుండి సమాధానం గా ఫోన్ కట్ అయింది మళ్ళి మళ్ళి అలాగే చేసి చివరికి ఎవరు నువ్వు అని అడిగారు పూజారి గారు. నేను ఎవరైతే ఏంటి కానీ మీకో వీడియో వస్తుంది చుడండి అని వీడియో పంపాడు తన మొబైల్ నుండి అది చూసిన పూజారి గారు ఏం కావాలి అని అడిగారు డైరెక్ట్ గా అయితే అంత సడెన్గా అడిగే సరికి బాషా కి ఏం చెప్పాలో అర్ధం కాక కాసేపు అయ్యాక చేస్తా అన్నాడు ఫోన్ పెట్టేస్తూ ..

అయితే ఈ ఫోన్ వచ్చే ముందే అక్కడికి కాలనీ వాచ్మెన్ రాములు అక్కడే జాతకం చూపించుకోవడానికి వచ్చాడు. పూజారి గారు తన ఫోన్ లో పడిన నెంబర్ నీ పెన్ తో కాగితం మిద రాసి పెట్టడం చూసి అతనికి అదో అలవాటు లెండి అది చూసిన రాములు ఇది మన అన్వర్ డబ్బా నెంబర్ అని చెప్పాడు ఫోన్ పెట్టగానే అంటే ఇది తెలిసిన వాడి పనే అని అర్ధం అయిన పూజారి గారు తన సంగతి మొత్తం తెలిసిన రాములుకు విషయం అంతా చెప్పి కాలని వాళ్ళను అక్కడికి పిలుచుకుని రమ్మని వాడిని అక్కడే పట్టుకోవాలని అనుకున్నారు.

ఇలా అందరూ వాడిని పట్టుకోవాలని అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి అవేంటో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుని ఇక ముగిద్దాం ఒకే నా .. మరి బై    

Related Posts

2 Comments

  1. ఈ భాగం తో మీరు ఆసక్తిని రేకెత్తించారు. ఇక తరువాత ఏమిటి అని పరుగులు పెట్టించడానికి.

  2. తర్వాత ఏమవుతుంది? చదవాలి

Comments are closed.