బాషా- పువ్వులు

బాషా అంటే ఎవరికీ తెలియదేమో కానీ పువ్వుల అబ్బాయి అంటే మాత్రం 

తెలియని వారు ఎవరు ఉండరు మా కాలని లో అంత పేరు ఉంది వాడికి 

పాపం చాలా కష్టపడతాడు ,అందుకే మాకు వాడంటే అదో రకమైన జాలి 

అందులోనూ వాడి తెలివి తేటలు అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే 

పదేళ్ళ వయసుకే అన్ని నేర్చుకున్నాడు మరి , ఎవరి తో ఎలా మాట్లాడాలో ,ఎవరితో 

పనులు ఎలా చేయించుకోవాలో , ఎవరికీ ఎక్కడ నొక్కితే ఏమవుతుందో ,

ఎవరితో ఏం మాట్లాడాలో , ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరో.. ఇలా ఒకటేమిటి 

వాడి దగ్గర చాలా విద్యలు ఉన్నాయి .. మరి వాడు కొన్ని చిలిపి పనులు కూడా చేసేవాడు 

అవి వాడికి కాస్త డబ్బు తెచ్చి పెట్టినా వాడికి ఒక్కోసారి సమస్యల్లో నెట్టాయి .. 

మరి అవేంటో వాడిని నేను ఇంతగా ఎందుకు పొగడాల్సి వచ్చిందో తెలియాలి అంటే 

మాత్రo  మళ్ళి వారం  తెలుసుకుందాం ..

 బాషా ఒక్కసారి చెప్తే ఒక్క సారి చెప్పినట్టే …   

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *