అనాధ

బిడ్డ రోదన

బిడ్డ రోదన

అమ్మలేని ఇల్లు చీకటి సామ్రాజ్యం
ఆకలి వేస్తే అన్నం పెట్టే అమృతం లేదు
దెబ్బ తగిలితే అమ్మ అని ఏడిస్తే
బుజ్జగించే తల్లి రూపం లేదు
కన్నీళ్లు తుడ్చే కన్నతల్లి లేక

కన్నీటి జలపాతాల్లో తేలుతున్నాడు ఈ పిల్లవాడు
జోలపాట పాడి నిద్రపూచే అమ్మ లేక
రాత్రంతా ఏడుస్తున్నాడు చిన్నారి బాబు
అమ్మ పడిపోతే ఏమి చేయలేక
ఏడుస్తూ అమ్మ మీద పడే

నువ్వు లేని లోకంలో అమ్మ
నేను ఉండలేను నేను వస్తాను అని ఏడ్చే
ఏడుస్తుంటే ఓదార్చే వారు ఎవరు లేరు
నువ్వు లేని ఈ ఒంటరితనాన్ని భరించలేను
నీవు ఎక్కడికి వెళ్ళిపోయావు అమ్మ

నీ ఒడిలో తల పెట్టి పడుకోవాలని ఉంది
నాకు అన్నీ నీవే అమ్మ
ఒక్కసారి కళ్ళు తెరువు అమ్మ
నీ కౌగిలిలో నన్ను దాచుకో అమ్మ
నువ్వు లేని ఈ లోకం నాకు వద్దని గుండె పగిలి ఏడ్చే…

డా. సరికొండ రమాదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *