బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్

బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్

శ్రీనివాస్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఒక ఇల్లు కట్టడానికి మేస్త్రి , కూలీ  మనుషులను పెట్టి పని చెప్పిస్తాడు. శ్రీనివాస్ ఇంటికి కొంత దూరంలో ఒకరిది ఇల్లు కట్టడానికి ఒప్పుకున్నాడు.

“ఒక నెల రోజుల తర్వాత మీ పనిని మొదలు పెడతాను” అని శ్రీనివాస్ చెప్తాడు.

“దానికి ఆ ఇంటి యజమాని రాహుల్ ఒప్పుకుంటాడు.”

నెలరోజుల తర్వాత రాహుల్ పని మొదలపెట్టాడు  శ్రీనివాస్.
పని బాగానే చేపిస్తున్నాడు ఎక్కడ ఏది రావాలి అని చెప్తూ ఉంటే అన్ని నోట్ చేసుకుంటున్నాడు శ్రీనివాస్ రాహుల్ చేసినట్టుగానే అన్ని పని వాళ్ళ చేత చేపిస్తున్నాడు శ్రీనివాస్.

“వారం తర్వాత డబ్బులు అడిగి కూలి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలని” చెప్పాడు శ్రీనివాస్.

అలాగే రెండు మూడు వారాలు తప్పకుండా రాహుల్ డబ్బులు ఇచ్చేసేవాడు.
ఇంక నాలుగు రోజులు తర్వాత పని పూర్తయిపోతుంది అనగా…బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్
ఒక వారం తర్వాత ,
“రాహుల్ దగ్గరికి వెళ్లి పేమెంట్ డబ్బులు” అడిగాడు శ్రీనివాస్.

“ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు ఈవారం మళ్లీ వారం కలిపి డబ్బులు ఇస్తాను” అని చెప్పాడు రాహుల్.

“అది కాదు సార్ డబ్బులు వారంలో ఇవ్వకపోతే వాళ్లు నన్ను అడుగుతారు. వాళ్లకి కూడా కొన్ని ఖర్చులు , అవసరాలు ఉంటాయి కదా సార్ అని , కొంచెం డబ్బులైన ఇవ్వండి సర్ వాళ్ళకి సర్ది చెప్తాను” అని అడిగాడు శ్రీనివాస్.

“నా దగ్గర పూర్తిగా డబ్బులు లేవు ఈ రోజు ఆదివారం కాబట్టి , రేపు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకువచ్చి నీకు ఇస్తాను” అని చెప్పాడు రాహుల్.
అలా మరో వారం కూడా గడిచింది.
రాహుల్ డబ్బులు ఇవ్వలేదు ఆదివారం తర్వాత ఇంకా పని చేయడం మానేశారు.

“మీరు డబ్బులు ఇస్తేనే మేము పని మొదలు పెడతాం సార్” అని శ్రీనివాస్ చెప్పాడు.
అలా రాహుల్ డబ్బులు ఇవ్వకపోయేసరికి పని వాళ్ళందరూ శ్రీనివాస్ ని డబ్బులు అడగడం మొదలుపెట్టారు.బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్
తప్పని పరిస్థితుల్లో ఇంట్లో బంగారం అని వాళ్లకి డబ్బులు ఇచ్చాడు శ్రీనివాస్.
రాహుల్ ని రెండు మూడు సార్లు గట్టిగా నేను ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని పొగరుగా సమాధానం చెప్పేసాడు.
దాంతో ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఆ డబ్బులతో తనకున్న అప్పులని తీర్చి డబ్బు సంపాదించడానికి తమిళనాడు వెళ్తాడు శ్రీనివాస్.
ఈ లోపు బ్యాంకు వాళ్లు లోన్ కట్టలేదు అని ఒక రెండు నెలలు టైం ఇచ్చారు.
ఆ టైంలో డబ్బులు కట్టకపోతే ఇల్లుని జప్తు చేస్తామని హెచ్చరించి వెళ్లారు.
ఎక్కడ ప్రయత్నించిన డబ్బులు దొరకపోయేసరికి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా రెండు నెలలు గడిచిపోయింది.
రెండు నెలల తర్వాత బ్యాంకు వాళ్ళు వచ్చి శ్రీనివాస్ ఇంటి దగ్గరే వేలం వేయడం మొదలుపెట్టారు.
శ్రీనివాస్ భార్య ఎంత బతిమిలాడిన కూడా బ్యాంకు వాళ్లు
“మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఈ ఇల్లు బ్యాంకు వాళ్ళది ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు” అని చెప్తారు.
అలా ఏడుస్తూ ఉండగా ,
“ఆపండి మీకు కావాల్సిన డబ్బులు నేను తీసుకువచ్చాను” కానీ ఒక గొంతు వినిపిస్తుంది.
అటువైపు చూడగా శ్రీనివాస్ కనిపిస్తాడు.
ఎంత ఆనందంతో శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది తన భార్య.
జరిగిందంతా చెప్పితే శ్రీనివాస్ డబ్బులు బ్యాంకు వాళ్ళు కట్టేస్తాడు.
పోతుంది అని అనుకున్న వాళ్ళ ఇల్లు ని తిరిగి సంపాదించుకున్నందుకు చాలా ఆనందపడుతుంది శ్రీనివాస్ తన భార్య.
బిల్లింగ్ కన్స్ట్రక్షన్ చేయడం మానేసి చిన్నచిన్న కూలి పనులకు శ్రీనివాస్ తన భార్యను తీసుకొని వెళుతూ ఉండేవాడు.బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్
అలా వాళ్ల జీవితం అలా మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడికే రావడంతో కొంచెం బాధగా ఉన్నా మళ్ళీ ఆ పనినే కొత్తగా నేర్చుకోవచ్చు అని అనుకున్నాడు శ్రీనివాస్.
ఈ జీవన వేదంలో ఎవరైనా పైకి ఎదగొచ్చు ఎవరైనా కిందకి దిగిపోవచ్చు అది చెప్పలేము అలాంటి వాళ్లలో శ్రీనివాస్ కూడా ఒకరు.

మాధవి కాళ్ల

బిల్డింగ్ కన్స్ట్రక్షన్ శ్రీనివాస్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *