బుజ్జిగాడు

అక్షర కొరకు
అంశం – చిత్రకవిత
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – బుజ్జిగాడు

చిందరవందర జుట్టుతోనే
చిలిపి చూపుల విందుతోనే
నాలుక బయట పెట్టి మరీ
నవ్వులు పూయించే అల్లరివాడు!

బుడిబుడి అడుగుల వయసులో
బోలెడు అల్లరి మనసులో
కోపమొచ్చినా క్షణకాలమే
మరుక్షణమే నవ్వుల జలపాతమే!

బాల్యం అంటే ఓ అందమైన లోకం
బాధలెరుగని ఓ మధుర కావ్యం
చిన్న చిన్న చిలిపి చేష్టలతో
ఇంటినంతా చేసే సందడిమయం!

కల్మషమెరుగని ఆ పసి హృదయం
కలతలెరుగని ఆ చిరునవ్వు
ఎన్ని సంపదలున్నా కొనలేనిది
ఈ పసితనంలోని మధురానుభూతి!

కాలం కదిలినా మారనిది
జ్ఞాపకాల్లో నిలిచిపోయేది
బాల్యమనే ఆ మధుర ఘట్టం
జీవితానికే ఓ అందమైన బహుమానం!

ఇది నా స్వీయ రచన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *