భయం1

ఏంటే  ఏంటి ఆ తినడం అంతగా తింటుంటే పొట్ట వచ్చి వికారంగా తయారు అవుతావు లేనిపోని సమస్యలు వచ్చి నీ ఆరోగ్యం పాడవుతుంది అయినా ఎందుకు అలా తింటున్నావు  అని విచిత్రoగా తన స్నేహితురాలిని చూస్తూ అడిగింది పల్లవి.

తినాలే ఎంత తింటే అంత మంచిది.ఇప్పుడు తింటేనే కదా మనం ఎప్పటికి బాగుంటాం బలంగా ఉంటాం అంటూ చిప్స్ నోట్లో కుక్కుకుంటూ చెప్పింది అంజలి.

ఏంటో దీని వేషాలు నిన్నటి వరకు ఎక్కువ తింటున్నా అని నన్ను చూసి తిట్టేది అలాంటిది ఇప్పుడు తనే ఎక్కువగా తింటుంది అని గతంలోకి జారింది పల్లవి.

అంజలి, పల్లవి ఇద్దరి కుటుంబాలు పక్క పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళు అయితే చిన్నప్పటి నుండి అంజలి తిండి దగ్గర తల్లిని చాలా సతాయించేది.

అంజలి చాలా తక్కువ తినేది వాళ్ళ అమ్మ ఎంతో బ్రతిమాలుతూ తిండిని తినిపించేది పెద్దమనిషి అయినప్పుడు కూడా ఎన్నో రకాలు ఎందఱో చేసిపెట్టినా కూడా అసలు వాటిని ముట్టకుండానే ఉండేది.

ఎక్కువ తింటున్న తనని చూస్తూ వెక్కిరించేది తిండిపోతు అని ఫాట్ వస్తుంది అని దెప్పుతూ ఉండేది. ఆ తర్వాత హాస్టల్ లో మొన్నటి వరకు కూడా ఎదో కోడి గెలికినట్టుగా గెలుకుతూ తినేది ఫుడ్ వెస్ట్ కానివ్వకుండా అదంతా తనకే పెట్టేది కానీ గత రెండు వారల నుండి ఎమైoదో కానీ బాగా తినడం మొదలు పెట్టింది.

అది చూస్తున్న తను ఏంటే ఇలా తింటున్నావు అని అడిగితే ఇపుడు కాక ఇంకెప్పుడు అంటూ తనకే సలహాలు చెప్తుంది. అంటూ గతం లోంచి బయటకు వచ్చిన పల్లవి

దీనికి ఎదో అయ్యింది  అందుకే ఇలా తింటుంది ఏంటో అది అని అడిగితే ఏం లేదంటుంది. ఈ మధ్య సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇలాగె అన్ని రకాలు తింటూ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకుంటున్నారని ఎక్కడో చదివింది.

అలాంటి వాళ్ళను గుర్తుపట్టి కనిపెట్టి ఉండాలని కూడా అందులో ఉంది, కాబట్టి తనకి ఎక్కడో  అనుమానం మొదలైంది. ఇక అప్పుడే తనకు అనన్య గుర్తుకు వచ్చింది.

అనన్య ఎవరూ అంటే తమ ఇద్దరి కామన్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు సైక్రియాట్రిస్ట్ కాబట్టి తను అంజలి ని వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకు వెళ్ళాలని అనుకుంది పల్లవి.

అనుకోగానే అనన్య కు ఫోన్ చేసింది పల్లవి తను ఫోన్ ఎత్తగానే అంజలి చాలా డిఫ్ఫరెంట్ గా ప్రవర్తిస్తుంది రెండు వారాలుగా చాలా ఎక్కువగా తినడం మొదలు పెట్టింది. నేను ఏంటని అడిగితే నాకు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు అయితే తన మనసులో ఏముంది తెలుసుకోవాలి అంటే నీ సహాయం కావాలె అంది పల్లవి.

అయ్యో పల్లవి నా వల్ల ఏ సహాయం అయినా నేను చేస్తాను మన స్ద్నేహితురాలిని మనం కాపాడుకోవాలి వాళ్ళ అమ్మా మనకు చాలా చెప్పింది జాగ్రత్త అని ఇక తనకు సహాయం చేయడం అంటే మనకు మనం చేసుకోవడమే కదా నువ్వేం అడగాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను ఏం చేయమంటావో చెప్పు అంది అనన్య .

అనన్య నీ మాటలు నాకు చాలా సంతోషం కలిగిస్తున్నాయి  అయితే నువ్వు చేసే సహాయం ఏంటంటే మీ ఫాదర్ సైక్రియాట్రిస్ట్ కాబట్టి మనం మీ నాన్నగారి ద్వారా తనను హిప్నాటిజo చేసి తన మనసులో ఏముందో కనుక్కోవాలి.

అయితే అది తనకు తెలియకుండా ఉండాలి మనం ఇలా చేసామని తెలిస్తే తను బాధపడుతుంది కాబట్టి తెలియకుండా దాని మనసులో ఏముందో కనుక్కొని దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి మరి నువ్వేం అంటావు అడిగింది పల్లవి.

సరే కానీ మళ్ళి ఎప్పుడైనా తెలిస్తే పరిస్థితి ఏంటి అనాది అనన్య అప్పుడు దానికి ఏదోలా సర్ది చెప్పోచ్చులే కానీ ముందు తన మనసులో ఏముందో చూడడం ముఖ్యం అంది పల్లవి.సరే నేను మా నాన్న గారితో మాట్లాడతాను అంది అనన్య.అవును మరి తనని మా ఇంటికి తీసుకురావడం ఎలా అంది అనన్య హ అవును కదా నేను మరిచేపోయాను ఎలా అంది పల్లవి.

హ ఒక ఐడియా  అని అనన్య అనగానే ఏంటది చెప్పవే తొరగా అనగానే రేపు ఉగాది కాబట్టి ఆ రోజు మా ఇంటికి లంచ్ కి పిలుస్తాను వేరే పనులేమి పెట్టుకోకుండా వచ్చేయి అంది అనన్య పల్లవి తో అవునే సరే ఇదేలాగో  తిండి ధ్యాసలో పడింది కాబట్టి వచ్చేస్తుంది తినొచ్చు అని అప్పుడు దానికి డౌట్ రాకుండా చేయమనాలి ఒకే నా అంది పల్లవి.

హ సరే నీకు మళ్ళి మెసేజ్ చేస్తాను నేను రాత్రికి సరేనా అనగానే సరే అని ఫోన్ కట్ చేసింది పల్లవి ఇంత సేపు ఎవరే ఫోన్ లో అంటూ వచ్చింది అంజలి బర్గర్ తింటూ  హ అదా అనన్యనే ఎదో నోట్స్ గురించి అడిగింది లే అవును నువ్వేంటి ఇప్పుడే అన్నం తిన్నావు కదా మళ్ళి ఈ బర్గర్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చావు అంది పల్లవి.

అదా తినక ముందే ఇచ్చాను కానీ వాడు ఇప్పుడు తెచ్చాడు అంటూ పల్లవికి ఇవ్వకుండా మొత్తం తినేసి కూల్ డ్రింక్ తాగేసి పడుకుంది అంజలి .

ఇదేంటో ఈ తిండి గోలెంటో ఎల్లుండి తెలుస్తుంది అప్పటి వరకు తనని ఏం అనకూడదు. కానీ ఒక్క క్షణం కూడా విరామం ఇవ్వకుండా ఇలా తినడం ఏంటో అది కూడా నోట్లో ఉండగానే ఎవరో ఎత్తుకుపోతున్నట్టుగా ఎవరో లాక్కున్నట్టుగా  తింటుంది ఇది చూస్తే పాపం ఆంటీ అంకుల్ ఎలా తట్టుకుంటారో సెలవులకు వెళ్ళక ముందే ఇదేదో తేల్చేయాలి అని అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది పల్లవి.

*********

ఎప్పటిలా తెల్లారింది ఆ రోజు ఉగాది ప్రొద్దునే నిద్రలేచిన పల్లవి తన ఫోన్ తీసుకుని చూసింది అనన్య మెసేజ్ కోసం కానీ మెసేజ్ ఏం రాలేదు దాంతో నీరసం వచ్చేసింది పల్లవికి అయితే అంకుల్ ఒప్పుకోలేదా ఏమన్నారు అనే లక్ష సందేహాలతో ఆలోచిస్తూ కూర్చుండి పోయింది.

ఏయి పల్లవి అనన్య ఫోన్ చేసిందే మనల్ని ఇంటికి లంచ్ కు రమ్మని అంటుందే వెళ్దామా అంటూ తుపానుల దూసుకొచ్చింది అంజలి. దాంతో విషయం అర్ధం అయ్యింది పల్లవికి అయితే తనకు చేయకుండా అంజలికి చేసిందన్నమాట.

అని అనుకుని అవునా మరి నువ్వేం అంటావే అంది పల్లవి వెళ్దాం పదవే హోమ్ పుడ్ తిని చాలా రోజులయ్యింది.అక్కడ ఆంటీ చాలా చేస్తుంది పులిహోర,పొంగలి,పచ్చడిఅబ్బా అనుకుంటుంటే నోరు ఉరిపోతుంది.

పద పద తొందరగా రెడీ అవ్వు అంది నోట్లో వడ కుక్కుకుంటూ ఈ వడ ఎక్కడిదే అంది పల్లవి హాస్టల్ లో ఇడ్లీ, ఉప్మా తప్ప వడ ఉండదు కాబట్టి దానికి అంజలి ఇది వాచ్మెన్ తో తెప్పించాను అంది నవ్వుతూ..

ఉష్ అని గట్టిగా నిట్టూర్చి దీనికి కారణం ఏంటో ఇంకో రెండు గంటల్లో తెలుస్తుంది అని అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది పల్లవి.

ఆ తర్వాత ఇద్దరు రెడీ అయ్యి అనన్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మా నాన్న ఎంతో సంతోషించారు తమని చూసి ఎమ్మా రావడం లేదే అంది అనన్య వాళ్ళ అమ్మగారు గాయత్రి ఎక్కడ ఆంటీ క్లాసులని చవగోడుతున్నారు అంది పల్లవి అంజలి మాత్రం వెళ్ళగానే ఆంటీ ఏంటి స్పెషల్ అంటూ వంటగదిలో దూరడం తో కాస్త సమయం లోనే అంకుల్ ఇది కథ అంటూ మొత్తం చెప్పేసరికి నాకు వదిలేయమ్మా నేను చూస్తాను అని భరోసా ఇచ్చారు రామచంద్ర గారు.

టిఫిన్స్ అయ్యాక అంజలి నీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడాలి అంటూ తనని పక్క గదిలోకి తీసుకుని వెళ్ళారు రామచంద్ర గారు అదేంటి అంకుల్ నన్నే ప్రత్యేకంగా పిలిచారు అంది అంజలి కుర్చీలో కూర్చుంటూ..

ఏం లేదమ్మా నేను ఒక థిసిస్ రాయాలని అనుకుంటున్నా దాని కోసం నీలాంటి వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి అన్సర్స్  చెప్తే చాలు అన్నాడు రామచంద్ర ఓస్ అంతేనా సరే అంకుల్ మీకు హెల్ప్ చేయడానికి నేనెప్పుడూ రెడీ నే అంది అంజలి.

బయట మాత్రం అనన్య పల్లవి తో పాటుగా కాస్త విషయం తెలిసిన గాయత్రి గారు కూడా ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడుతూ ఎదురుచూస్తున్నారు రామచంద్ర గారి కోసం ..

ఒక గంట తర్వాత గది లోంచి బయటకు వచ్చారు ఇద్దరు అయితే రామచంద్ర మొహం మాత్రం అదోలా ఉండడం తో పల్లవి చాలా టెన్షన్ గా తన వైపు చూస్తుంది.

కానీ రామచంద్ర గారు గాయత్రి అంజలిని తీసుకుని వెళ్లి ఏదైనా పెట్టు అనగానే రమ్మా అంటూ లోనికి తీసుకు వెళ్ళింది గాయత్రి, వాళ్ళు వెళ్ళగానే ఏంటి అంకుల్ ఏమయ్యింది ఏదైనా సమస్యా అంది పల్లవి ఆదుర్దా గా దాంతో రామచంద్ర గారు నేను చెప్పడం కంటే మీరు వినడమే మంచిదమ్మా అంటూ అందర్నీ తన గదిలోకి తీసుకుని వెళ్ళారు.

వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్న తర్వాత రామచంద్ర గారు తానూ రికార్డ్ చేసిన ఆడియో ఆన్ చేసారు అందులో కొన్ని మాములు మాటల తర్వాత అంజలి గొంతు వినిపించడం మొదలయ్యింది. ఏమ్మా అంజలి ఈ మధ్య నువ్వు చాలా తింటున్నావు అని తెలిసింది ఎందుకు అడిగారు రామచంద్ర గారు కొన్ని నిమిషాలు మౌనం తర్వాత అంజలి అవునంకుల్ నేను ఎక్కువ తినడం స్టార్ట్ చేసాను అనగానే ఎందుకు అడిగారు రామచంద్ర గారు.

మీకు నేను చెప్పేది వింతగా విచిత్రంగా అనిపించవచ్చు కానీ నేను అనుకున్నది చేస్తున్నదే చెప్తున్నా అనగానే చెప్పమ్మా మేమేం అనుకోము అనగానే “ ఎక్కువగా తింటే లావుగా అవుతాను అప్పుడు నన్నేవ్వరూ చూడరు అందంగా లేకపోతే ఎవరూ దగ్గరికి రారు అందుకే ఎక్కువ తింటూ లావుగా అవ్వాలని ట్రై చేస్తున్నా అనగానే ఎందుకమ్మా ఆడపిల్లలు అందంగా ఉండాలని నాజుకుగా మారాలని జిమ్ లో చేరుతుంటే నువ్వేంటి లావుగా అవ్వాలని అనుకుoటున్నావు  అడిగారు రామచంద్ర గారు.

అవునంకుల్ కాని మీరు ఈ మధ్య పేపర్ చదవడం లేదా పేపర్లో చిన్న పిల్లలను, ఆడపిల్లలను ముసలి వారిని ఎవర్ని వదలడం లేదు మృగాళ్ళు అందుకే కనీసం ఇలా లావుగా ఉంటె అయినా ఎవరూ నన్ను ర్యాగింగ్ చేయరు పట్టించుకోరు అనగానే అదేంటమ్మ అలా నీకు జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావు అలా ఏం కాదమ్మా అనగానే కావాలని అనుకోవడం లేదు నేను లావుగా అయినా నాకు అలాంటి పరిస్థితి రావచ్చు రాక పోవచ్చు కానీ నేనుంటున్న స్థితిలో నాకు వచ్చిన ఆలోచన ఇదే అందుకే తినడం మొదలు పెట్టాను మీరు మహానటి సినిమా చూసారా అందులో సావిత్రి లావుగా అయ్యేసరికి తనకు అవకాశాలు రాలేదు ఆ సినిమా చూడగానే నాకు అలా కావాలని అనిపించింది అందుకే ఇలా తినడం మొదలు పెట్టాను. “

“ మీకు తెలుసా అంకుల్ చిన్న పాప అంకుల్ నెలల పాప తనని తీసుకుని వెళ్ళిన వాడు తన చేతులు విరిచేసి, కాళ్ళు లాగేసి తన చిన్ని మానాన్ని చిద్రం చేసాడు,పళ్ళతో కొరికాడు గిచ్చాడు, గిల్లాడు అవన్నీ ఆ పాప ఎలా తట్టుకుందో, ఎంత ఏడ్చిందో, ఎంత గిలగిల్లాడి పోయిందో ఇంకా అమ్మ ఒడిలో వెచ్చగా పడుకోవాల్సిన పాప ఎంత బాధ నరకం అనుభవించింది తల్చుకుంటూoటే నా రక్తం మరిగిపోతుంది.

కానీ ఏం చేయగలను నేను అబలను నన్ను నేను రక్షించుకోలేను అందుకే కనీసం ఇలా అయితే అయినా పెళ్ళి అయ్యేవరకు నన్ను నేను కాపాడుకోవచ్చు అనే ఆశ తో ఇలా తినడం మొదలు పెట్టాను. ఇది చాలా తెలివి తక్కువ ఆలోచన అని నాకు తెలుసు మృగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కాదనను కానీ నాకు తట్టిన ఆలోచన నేను చేసాను. ఎందుకంకుల్ ఇలా చేస్తున్నారు వాళ్ళు ఏ పాపం తెలియని వాళ్ళను వాళ్ళ పది నిమిషాల సుఖం కోసం నాశనం చేస్తూ మొగ్గను చిదిమేయడం ఎందుకు చేస్తున్నారు.

వారికీ అంతగా కోరిక కలిగితే ఏ వేశ్యల దగ్గరికో వెళ్ళొచ్చు కదా అంకుల్ ఎందుకు ఇంత అరాచకంగా తయారు అయ్యారు, అమ్మకు పుట్టి, చెల్లి అంటూ పిలిచి, భార్యగా ఉన్న తమను కన్నవారిని కట్టుకున్న వారికీ చెడ్డ పేరు ఎందుకు తెస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఒరిగింది ఏమిటో నాకు అర్ధం కాలేదు కానీ నేను అనుకున్నది మాత్రం లావుగా ఉంటె ఎవరూ దగ్గరికి రారు చూడరు అనే చిన్న ఆశ నా చిన్ని బుర్రకు తట్టిoది నేను చేస్తున్నా అంకుల్ ఇది తప్పంటారా “ ? అంటూ అంజలి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎవరీ దగ్గర దొరుకుతుందా అని ఇప్పుడు వాళ్ళంతా వెతుకుతూ ఉన్నారు.

కానీ అంతా విన్న పల్లవి కళ్ళు తుడుచుకుంటూ ఇది కాదంకుల్ తను ఆలోచన తప్పు మాకు ఇవన్ని అవమానాలు జరుగుతున్నాయి, కాదనను కానీ తను ఆలోచించేది తప్పు అంజలి ఎంతో బాధ పడితే తప్పా అలాంటి నిర్ణయం తీసుకోదు. అయితే మేము ఈ కొత్త సంవత్సరo నుండి సెల్ఫ్ డిఫ్ఫెన్స్ నేర్చుకోవడం మంచిది.

ఈ రోజే నేను అక్కడికి వెళ్ళి ఫాం పిల్ చేసి జాయిన్ అవుతాను అలాగే అంజలిని కూడా ఒప్పించి తనను చేరేలా చేస్తాను అంటూ లేచి నిలబడింది పల్లవి. అమ్మా పల్లవి మీతో పాటుగా అనన్య కు కూడా ఒక ఫాం తీసుకురామ్మా అన్నారు రామచంద్ర గారు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఒక ఆడపిల్ల తండ్రిగా.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ముగ్గురూ ముందడుగు వేసారు..

 

**** జరుగుతున్న దారుణాలు చూస్తున్న అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి ఇదొక చిన్న ప్రయత్నం మాత్రమే  భవిష్యత్తు తో  ఇంకేం జరుగుతున్నాయో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో ఇంకొక కథలో తెలుసుకుందాం  మరి సెలవ్..

 

                                                                                                    భవ్య చారు

 

 

 

 

 

 

 

`

Related Posts

1 Comment

  1. స్త్రీల సమస్యని తీస్కుని బాగా రాశారు . good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *