అక్షర కొరకు
అంశం – చిత్ర కవిత
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – భానుడు
ఉదయించే భానుడిని
చూస్తూ నిద్ర లేస్తామందరం
అస్తమించే సూర్యుడిని చూస్తూ
ఇళ్లు చేరుతారందరూ!
ఆ భానుడి కిరణాలు
మనకిచ్చేను విటమిన్లు
ఆ సూర్యుడి తేజం
కలిగించేను ఉత్సాహం!
రవి కిరణాలతో వెలుగు
ఆ కిరణాలు అస్తమిస్తే చీకటి
ఆ వెలుగు చీకట్లలో మన
బ్రతుకు ముడి పడి ఉంది!
చీకట్లోఅన్నీ బాధలూ కష్టాలే
వెలుతురులోనే సంబరాలు
కానీ వెలుగైనా చీకటైనా మనం
ఉపయెాగించడం లోనే ఉంటుంది!
వెలుతురు ను బ్రతుకు తెరువుకు
చీకటిని శరీర అలసట కు ( నిద్ర )
ఉపయెాగిస్తే జీవితం హాయిగా
సాగుతుంది కానీ ఈ కాలం తారు
మారవుతుంది!
అపార్ట్ మెంట్ల బ్రతుకులకు
సూర్యుడు ఉన్నాడనే తెలియదు
చీకటి కాలం తయారైంది ఈ కాలం
ఆకాశం లోకే వెళ్తున్న అంతస్తులలో
తెలుస్తున్నాడేమెా భానుడు!
ఇది నా స్వంత రచన…