భారతి అయిదో భాగం

భారతి రావాలి తనకు మనోజ్ గురించి తెలిసే ఉంటుందనే నమ్మకం తో ఎదురు చూస్తున్నారు మనోజ్ తల్లిదండ్రులు మరి భారతి వచ్చిందా ? మనోజ్ గురించి తనకు నిజంగానే తెలుసా ? లేదా ? వాళ్ళిద్దరూ కాంటాక్ట్ లో ఉన్నారా లేదా ఇక చదవండి ..

తెల్లారింది ఆ రోజు భోగి పండుగ వీళ్ళు భోగిమంటలు వేసుకొని నిలబడిన టైంలో చేతిలో సూట్ కేస్ తో భుజానికి హ్యాండ్ బ్యాగ్ తో ఆటోలోంచి దిగింది భారతి అమ్మ అంటూ వచ్చి తల్లిని హత్తుకుంది. తల్లి గబగబా ఏమ్మా బాగున్నావా ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి ఆయన ఏపండక్కి  రమ్మని అడిగినా రాను దానివి ఇప్పుడు అయినా వచ్చావు మేము అనుకుంటూనే ఉన్నాను. నువ్వు వస్తావా రావా అని అని అనగానే అదేంటమ్మా నిన్ను వదిలి నేను ఎలా ఉంటాను.

ఇంతకుముందు అంటే సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి రాలేకపోయాను. ఇప్పుడు ఇక ఆగలేక వచ్చేసాను అని తల్లి కూతుర్లు మాట్లాడుతుండగా అమ్మ తల్లి మేము ఇక్కడే ఉన్నాం కాస్త మా వంక  చూడండి జోక్ చేసింది వీళ్ళు అంటూ సందేహంగా నిలబడిపోయింది భారతి.

అదేంటమ్మా భారతి అప్పుడే మర్చిపోయావా అంటీని మనోజ్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళిద్దరు మొన్నే వచ్చారు అని తిరిగి పరిచయం చేసింది భారతి తల్లి. అదేంటి మమ్మల్ని మర్చిపోయావా అప్పుడే అవునులే అమ్మ పెద్దగా నేనెక్కడ గుర్తుంటాం నీకు అని హాస్యమాడింది మనోజ్ తల్లి.

అయ్యో ఆంటీ అలా అనకండి మీరు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మీ ఇంట్లో నేను ఎంత బాగా ఆడుకునేదాన్ని మీ ఇంట్లో వస్తువులని విరగకొట్టినా మీరు నన్ను ప్రేమగా చూసే వారు ప్రేమగా అన్ని పెట్టేవారు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు అంతేగానీ మిమ్మల్ని మర్చిపోలేదు నేను అని అంటూ హత్తుకుంది భారతి. అమ్మయ్య ఇప్పటికైనా గుర్తు పట్టావు అది చాలు అని అనగానే అందరూ నవ్వారు.

తానూ మనోజ్ అప్పుడు ఆడుకున్న ఆటలు, పాటలు అన్ని గుర్తొచ్చిన భారతి మనసు తియ్యగా మూలిగింది. ఇప్పుడు నా మనోజ్ ఎలా ఉన్నాడో వెంటనే తనని చూడాలని అనిపిస్తుంది . ఎప్పుడో పదో తరగతిలో చూడడమే కనీసం ఫోటో అయినా తీసుకోవాలి అని అనుకుంటూ తన బాగ్ లో ఉన్న మనోజ్ ఏడవతరగతి లో దిగిన ఫోటో…

 

barathi part 5
                                             barathi part 5

 

సరే పద పదలోనికి  నా బంగారుకొండ ఎప్పుడు తిన్నావో ఏంటో బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేద్దాం అని అందరూ ఇంట్లోకి వెళ్ళారు. స్నానాలు టిఫిన్లు అయ్యాక అందరూ తీరికగా సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు అవునాంటి  ఇంతకీ మనోజ్ ఎక్కడ కనిపించట్లేదు. తను రాలేదా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏం చదువుతున్నాడు డాక్టర్ ఇంజనీర్ ఏదో ఒకటి అయ్యే ఉంటాడు. అప్పుడు మేము చదివేటప్పుడు నేను ఇంజనీరు, తను డాక్టర్ అవ్వాలని అనుకున్నాం కానీ ఇప్పుడు  ఏం అయ్యాడో చెప్పండి ఆంటీ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది భారతి.

దాంతో అందరి ముఖాల్లో దిగులు ఆవరించింది అంటే భారతికి మనోజ్ గురించెం తెలియదు అనేది స్పష్టం అయ్యింది  దాంతో  మనోజ్ తండ్రి అమ్మ భారతి ఏం చెప్పమంటావు మనోజ్ గురించి తాను లాయర్ కాలేదు,డాక్టర్ కాలేదు కనీసం  నా బిజినెస్ అయినా చూసుకుంటాడు అనుకుంటే అది కూడా లేకుండా మాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్లి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది  ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు కనీసం మా మధ్య సమాచారం కూడా ఉత్తరాలు ఫోన్లు కూడా లేవు. ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు అని చెప్పాడు మనోజ్ వాళ్ళ నాన్నగారు.

అసలు ఏమైoది ఆంటీ ఎందుకు మనోజ్ ఇంట్లో నుంచి వెళిపోయాడు. ఏదైనా గొడవ జరిగిందా అని అడిగింది భారతి అవునమ్మా వాడు సైన్యంలో చేరతాను అని అన్నాడు దానికి మేము ససేమిరా ఒప్పుకోలేదు.దాంతో మాకు చెప్పకుండా రెండు సంవత్సరాల క్రితం నా కోసం వెతకొద్దు అని లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు సైన్యం లో చేరతాను అంటే ఏ తల్లిదండ్రి మాత్రం ఒప్పుకుంటారు, మా శక్తి మేరకు వెతికించాము కానీ ప్రయోజనం కనిపించలేదు అని అనగానే అయ్యో అవునా నేను వెతుకుతాను అంకుల్ తన ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అని గట్టిగా చెప్పింది భారతి.

అమ్మ భారతి నువ్వు ఆడపిల్లవు మేము ఎంత వెతికినా దొరకని వాడు నువ్వు ఎక్కడని వెతకగలవు తల్లి పోనిలే మా ప్రాప్తం ఇంతే అని అనుకుంటాం నువ్వు నీ చదువే లోకంగా ఉన్నదానివి  నువ్వేంటో ఎలా వేతుకుతావు. అమ్మ కనీసం   ఆ మాట అన్నావు చాలమ్మ అని అన్నాడు మనోజ్ తండ్రి .

లేదంకుల్ మనోజ్ అంటే నాకు చాలా ఇష్టం తనకోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు కాబట్టి నేను నిజం చెప్తున్నా నా ఇంజినీరింగ్ అయిపోయిన తరువాత నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు  తను దూరం అయినా నా మనసులోనే ఉన్నాడు ఒక విధంగా చెప్పాలి అంటే నేను మనోజ్ నీ ఇష్టపడుతున్నా కానీ తన ఇష్టం కూడా కనుక్కోవాలి కదా కానీ ఇంతలోనే మీరు వచ్చారు. నాకు మనోజ్ గురించి తెలిసింది ఇప్పుడే కదా నేను తనని ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాను నా మీద నమ్మకం  ఉంచండి అని చెప్పింది. వారు సరేనమ్మా చూద్దాం అని అన్నారు ఇంకో రెండు రోజుల తర్వాత సెలవులు  అయిపోగానే వాళ్ళు వెళ్లి వస్తామని చెప్పి  వెళ్ళిపోయారు మనోజ్ తల్లిదండ్రులు. ఇంతలోనే ఒక వార్త వాళ్ళ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది ఇంతకి ఆ విషాదం ఏమిటి ? భారతి మనోజ్ నీ వెతికిందా ? లేదా ? చదవండి తదుపరి భాగం లో …

 

 

 

 

Related Posts

1 Comment

Comments are closed.