భారతి ఆరో భాగం

భారతి మనోజ్ ను వెతుకుతాను అని మనోజ్ తల్లిదండ్రులకు మాట ఇస్తుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత భారతి వెళ్లి ఏం చేస్తుందో ఇక చదవండి …
ఒక రోజు వాకింగ్ చేస్తున్న భారతి తండ్రికి ఊర్లో ఉన్న తన అన్నయ్య చనిపోయాడు అనే వార్త రావడం తో బాధ తో తను కూడా సృహ తప్పిపడిపోయాడు అది చూసిన కొందరు అతన్ని ఇంటికి తీసుకుని వచ్చారు.
అది చూసి ఇద్దరూ కంగారు పడి ఏమయ్యిందంటూ అడిగే సరికి ఇంతలోనే మళ్ళి ఫోన్ రావడం తో విషయం తెల్సిన భారతి వస్తున్నాము అని చెప్పి, తండ్రికి కాస్త బాగాయిన తర్వాత తల్లిదండ్రులను తీసుకుని ఖర్మకండాలకు వెళ్ళింది, కానీ ఖర్మ అయ్యేవరకు కూడా భారతి తండ్రి మాత్రం కోలుకోలేక పోయాడు.
పుట్టిన తర్వాత ఎంతో స్నేహంగా అన్నాదమ్ములా కంటే కూడా స్నేహితుల్లా మెలిగిన అన్నయ్య చనిపోవడం తో భారతి తండ్రి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాడు ఇక తల్లి దండ్రి అన్ని తానె అని అనుకున్నాడు.
కానీ హటాత్తుగా తన అన్న చనిపోవడం తో భారతి తండ్రి కుంగి పోయాడు, అక్కడ ఉన్న భందువులు అందరూ వారి స్నేహాన్ని ఏనాడు గొడవ పడనీ వాళ్ళ మైత్రిని మెచ్చుకుంటుంటే ఇంకా అతని ఏడుపు ఎక్కువ అయ్యింది.
తన తండ్రి ఏనాడు ఏడవడం చూడని భారతి తండ్రి ఏడుస్తూ ఉండడం తో ఇంకా భయపడి పోయింది తన తండ్రికి ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడి ఏం చేయాలో తెలియక ఆందోళన చెందింది.
అక్కడి నుండి ఎంత తొందరగా వెళ్ళాలని అనుకున్నా కూడా ఆమెకు వీలు కాకుండా అయ్యింది. అయితే చావు కు వచ్చిన అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్దామని అనుకుని తండ్రి తో చెప్పింది నాన్న అందరూ వెళ్ళారు మనం కూడా వెళ్ళాలి కదా…
అమ్మా భారతి ఇలా రామ్మా నీకు తోడబుట్టిన వాళ్ళు అంటే ఎవరో తెలుసా తల్లి “మన రక్తం పంచుకుని మనతో పాటుగా పుట్టి, మన ఎంగిలి పాలను, ఎంగిలి అన్నాన్ని తింటూ, మన కోసం అలోచించి, మంచిని చెప్తూ మనకు రక్షణగా ఉంటూ, తప్పొప్పులను సరిదిద్దే వాడేనమ్మ తోడబుట్టిన వాడు అంటే ఈ కాలం లో దీనికి అర్ధం మారినా మా కాలం లో మాత్రం మాకు అండ దండగ నిల్చిన వాడు నా అన్నయ్య నేను ఎన్నో తప్పులు చేసాను వాటిని అన్ని తన మీద వేసుకుని , నన్ను ఎప్పటి వరకు కాపాడుతూ వచ్చాడు నా అన్న.
నేను చదువుకుంటా అంటే నా కోసం తన చదువును త్యాగం చేసాడు లేదంటే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడినే కాదమ్మా “,
నీకు ఒక అన్నను నేను ఇవ్వలేకపోయాను అది నా వల్ల కాలేదు అందుకే నీకు తోడబుట్టిన వారి ప్రేమ, ఆప్యాయత గురించి తెలియదు కాని భారతి ఇంతగా నన్ను ఆదుకున్న నా అన్న కుటుంబాన్ని నేను ఆదుకోవడం నా కనీస ధర్మం తల్లి కాబట్టి నేనూ మీ అమ్మా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం.
ఇక నీ సంగతి అంటావా నీకు హాస్టల్ లో ఉండడం అలవాటే కాబట్టి నువ్వు నీ చదువును పూర్తి చెయ్యి తల్లి నీకు ఇష్టం అయితే ఉద్యోగం కూడా చేద్దువు కానీ , సరేనా ఇక మరి నువ్వే ఆలోచించుకో, నీకు అన్ని విధాలా చదువు భాద్యత నాదే ఇక మరి నీ నిర్ణయం ఏమిటో రేపు చెప్పు సరేనా అన్నాడు భారతి తండ్రి రామమూర్తి గారు.
అలాగే నాన్న నా నిర్ణయం ఏమిటో మీకు తప్పకుండ చెప్తాను అంటూ లోపలి కి వెళ్ళింది భారతి. ఏంటండి అమ్మాయిని అలా భయపెట్టారు నాకు ఏమి చెప్పనే లేదు.
అంది భారతి తల్లి కాఫీ ఇస్తూ దానికి మూర్తి గారు నవ్వుతూ నువ్వు నాలో సగం నేను అనుకున్నది ఏది కాదనవు అనే నమ్మకం తో నేను నా కూతురికి అలా చెప్పాను తప్పుగా చెప్పానా అన్నారు మూర్తి గారు.
అయ్యో లేదండీ ఇన్నేళ్ళ మన కాపురం లో మీరేది కావాలని అనుకోలేదు నా ఇష్ట ప్రకారమే కాపురం పెట్టారు, నా ఇష్ట ప్రకారమే అన్ని చేసారు నాకు విలువ ఇచ్చిన మీరు తీసుకున్న నిర్ణయాన్ని కాదనను.
కానీ ఒకే విషయం బాధిస్తుంది అనగానే ఏంటది అన్నట్టుగా చూసారు మూర్తి గారు, అదేనండీ ఇక్కడ హాస్పిటల్స్ లేవనే ఒకే ఒక్క కారణం అంతే అంటున్న భార్య వైపు అదోలా చూసి ఇన్నాళ్ళు నా అన్న కూడా ఇక్కడే బ్రతికాడు మరి అతని కంటే నేను ఏం ఎక్కువ కాదు గా అన్నారు మూర్తి గారు, తన అన్న కు లేని భయం నాకు ఎందుకు అన్నారు.
భారతి ఆరో భాగం

దానికి నిట్టుర్చిన భారతి తల్లి సరేనండి మీ ఇష్టం నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అంటూ కప్పు తీసుకుని లోపలి కి వెళ్లిపోయింది అయితే ఒక్క క్షణం తానూ తప్పు చేస్తున్నానేమో అనిపించింది కానీ అంతలోనే తన అన్న గుర్తుకు రావడం తో ఒక్క సారిగా మనసంతా చేదు తిన్నట్టుగా అయిపోయింది మూర్తి గారికి. తన ఆలోచనలోకి జారిపోయారు.
మూర్తి గారి అన్న గారికి ఇద్దరూ కూతుర్లు ఒక కొడుకు కొడుకు వ్యవసాయాన్ని నమ్ముకుంటే కూతుర్లు ఉన్న ఊర్లోనే చదువుకుంటున్నారు పెద్దమ్మాయి భారతి కంటే రెండు నెలలు పెద్దది ఆమె అదే ఊర్లో ఉన్న ఒక వ్యక్తిని ప్రేమించింది.
కానీ తండ్రికి భయపడి ఆ విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు తండ్రి చనిపోవడం వల్ల ఆమెకి కొంచం ధైర్యం వచ్చి మూర్తి గారికి చెప్పకుండా కనీసం తాను ప్రేమించిన విషయాన్నీ చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే ఆలోచన కూడా లేకుండా ఒక రోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లి పోయింది.
ఇక ఆ విషయం తెలియగానే తండ్రి చనిపోయిన బాధలో ఏమైనా చేసుకుందేమో అనుఇ అనుకుంటూ అందరూ చెట్లు చేమలు వెతుకుతూ వెళ్ళారు కానీ ఆమె ఎక్కడా దొరకలేదు.
ఇది మూర్తి గారికి పెద్ద షాక్ ఎందుకంటే అసలు అన్నయ్య పిల్లలతో పెద్దగా అనుబందం కానీ పరిచయం కానీ లేదు. దాంతో వాళ్ళ చదువులు తప్ప ఇంకేం తెలియదు. దాంతో మూర్తి గారికి ఏం చేయాలో తెలియలేదు.
అదే విషయాన్ని వదిన, భార్య, కూతురి దగ్గర చెప్పాడు అయితే అది విన్న భారతి మాత్రం ఇంకేదో ఉందని అనుకుని తన అక్క గురించి ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టింది. అప్పుడు భారతికి ఎన్నో విషయాలు తెలిసాయి. అక్క ఎవర్నో ప్రేమించిందని, అతను కులం తక్కువ వాడని కేవలం తండ్రి కి భయపడి ఆ విషయాన్నీ చెప్పకుండా భయపడి వెళ్ళిపోయిందని తెలిసింది.
అదే విషయాన్ని తన తండ్రి తో పెద్దమ్మ, అమ్మ లతో చెప్పింది భారతి. అయితే మూర్తి గారు మాత్రం మంచి భావాలూ కలవారు కావడం వల్ల వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకుని రమ్మని ఇద్దరికీ తానూ పెళ్ళి చేస్తాను అని చెప్పారు.
భారతి ఆరో భాగం

కానీ వేతకడానికి ఎవరూ వెళ్ళాలి అనగానే భారతి ముందుకు వచ్చి, నేనూ తమ్ముడు కలిసి వెతుకుతాం అని బయలు దేరింది. కానీ వాళ్ళను వెతకడం మాములు విషయం కాలేదు వాళ్ళు అసలు దొరకడమే గగనం అయ్యింది.
మూడు నెలలు వాళ్ళను వెతకడానికే సరిపోయింది. వాళ్ళు దొరికిన తర్వాత ఇంటికి తీసుకుని రావడం ఇంకా గగనం అయ్యింది వాళ్ళు రామంటే రాము అని బీష్మించుకుని కూర్చున్నారు.
వస్తే తమను వేరు చేస్తారు అని మమల్ని విడదిస్తారు అని ఇలా ఇంతో ఇబ్బంది పెట్టిన తర్వాత తన తండ్రి వాళ్ళకు పెళ్ళి చేస్తాడు అని ఇబ్బందేం లేదని రమ్మని భారతి ఎంతో నచ్చ చెప్పిన తర్వాత తానూ హామీ ఇస్తున్నా అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు.
వాళ్ళను ఇంటికి తెచ్చిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు గొడవ పడ్డారు మా అబ్బాయిని మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళిందనే పంచాయితి పెట్టారు. ఇక ఆ అబ్బాయి మాత్రం తల్లిదండ్రులను కాదనీ నేను ఇష్ట ప్రకారమే వెళ్ళాం అని పంచాయితి లో చెప్పడం వల్ల వాళ్ళు సైలెంటు గా అయ్యారు.
ఇక అందరూ పెళ్ళికి ఒప్పుకోవడం తో మూర్తి గారు వాళ్ళ పెళ్లిని బాగానే జరిపించారు అయితే అప్పటికే భారతి అక్క మూడు నెలల కడుపుతో ఉంది కాబట్టి ఎవరూ ఏం అనలేక పోయారు . దాంతో పెళ్ళి ఏ గొడవలు లేకుండా జరిగిపోయింది.
ఇక ఈ హడావుడి లో భారతి చాలా నలిగి పోయింది ఎంతో వేదనను అనుభవించింది తానూ తన తండ్రి కోరికను తీర్చగలనా, లేదా అని ఏంటో మనోవ్యధ చెందింది.
ఇక ఈ హడావుడి లో పడిపోయిన భారతి తో పాటూ అందరూ దాదాపుగా మనోజ్ విషయం మరిచిపోయారు. తన చదువును మధ్యలో వదిలేసిన భారతి పరిస్థితి చక్క బడడం తో హాస్టల్ కి వెళ్లిపోయింది భారతి ..
మరి భారతి మనోజ్ నీ వెతికిందా ? లేదా ? మనోజ్ భారతి మళ్ళి కలిసారా ? లేదా ? చదవండి తదుపరి భాగం లో …
హ్మ్మ్ అనుకోని మలుపు ఐనా బావుంది భవ్యా