భారతి ఎనిమిదో భాగం Miracle Decision 8

భారతి ఎనిమిదో భాగం

భారతి ఎనిమిదో భాగం
భారతి ఎనిమిదో భాగం

భారతి మనోజ్ ను వెతికింది అయితే భ్జరతి స్నేహితురాలి కజిన్ ద్వారా మనోజ్ ఎక్కడున్నాడో తెలిసింది, భారతి వెతుకుతున్న విషయం తెలిసిన మనోజ్ తన చిన్ననాటి నేస్తం తనను వెతుకుతుంది అని తెలిసి సంతోషించి, ఇన్నాళ్ళు తానూ కోల్పోయింది ఏమిటో తెలిసి వచ్చిన మనోజ్ భారతి ని కలవాలి అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా తన స్నేహితుడు, హితుడు అయిన అభిలాష్ తో పాటూ పయనం అయ్యి భారతి కళ్ళ ముందు నిలిచాడు.

అతని రాకకు అందరూ సంతోషించారు తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు వాళ్ళు కొడుకు రాక తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు, భారతి తమ కొడుకుని వెతికి తీసుకు రావడం వల్ల మనోజ్ భారతిని కోడలుగా చేసుకోవాలి అని అనుకున్నారు దానికి భారతి తల్లిదండ్రులు కూడా ఒప్పుకుని చాలా సంతోషించారు.

ఎందుకంటే భారతి చిన్నప్పటి నుండి తానూ మనోజ్ ను ప్రేమిస్తున్న సంగతి చెప్పడం వల్ల అందరూ వారిద్దరికీ పెళ్ళి చేయాలనీ అనుకున్నారు…మరి మనోజ్ ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడా ? లేదా ? .. ఏం చేస్తాడు మనోజ్ ఇక చదవండి ..

*****

వాళ్ళ ఇద్దరికీ  ఇక ముక్కు తాడు వేయాల్సిందే పట్టు బట్టి వాడిని రప్పించిన నా కోడలు అఖండురాలు అంటూ కిందికి వెళ్తున్నా వాళ్ళ  మాటలు విని నవ్వుకుంది భారతి. అలా వారిద్దరినీ ఏకాంతంగా వదిలి అందరూ కిందికి వెళ్లిపోయారు మనోజ్ భారతి దగ్గరగా వచ్చి ఏంటి నువ్వు  అఖండురాలివా నా కోసం ఇంతగా వెతికావా నా మీద అంత ప్రేమ ఉందా నీకు అని అనగానే భారతి సిగ్గు పడి గువ్వలా అతని గుండెల్లో మొహం దాచుకుంది.

ఇక మనోజ్ ఆమె చుబకం పట్టి పైకి ఎత్తగానే అవును మనోజ్  చిన్నప్పటినుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం  అప్పుడు అది ప్రేమ అని తెలియదు నువ్వు నన్ను విడిచి  వెళ్ళిన తర్వాత నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. జీవితం లో నిన్ను కలవాలనేదే నా ఆశ అందుకే నువ్వు కనిపించట్లేదు అని అనగానే చాలా బాధపడ్డాను చదువుని కూడా పక్కన పెట్టేసి నీకోసం వెతకని చోటు లేదు.

ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో అన్నింట్లో నీ గురించి రాశాను చివరికి  నువ్వు నాకు దొరికావు అయినా నువ్వు మిలటరీ లోకి వెళ్లడం ఏంటి నాకు ఒక మాట అయినా చెప్పలేదు ఉత్తరాలు లేవు, ఫోన్స్ లేవు ఏదీ లేదు పూర్తిగా మర్చిపోయావు నన్ను, అయినా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతగా ప్రేమించలేదా నేను అంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది భారతి.

నువ్వంటే నాకు చాలా ఇష్టం భారతీ, నిన్ను నేను ఎలా మరచిపోగలను నువ్వు నా జీవతం లోకి వచ్చిన అందమైన బంధానివి, నువ్వు వెళ్ళాక నేను కూడా నిన్ను మిస్ అయ్యాను. అసలు నీ కోసమే నేను సైన్యంలో చేరాలని అనుకున్నాను నీ పేరు భారతి అందుకే ముందుగా భారత దేశానికి సేవ చేసి  తర్వాత ఈ భారతి చేయి చేపట్టాలి అని అనుకునే సైన్యంలో చేరాను నీకు చెప్తే నువ్వు వద్దంటావు అని నీకు ముందుగా చెప్పకుండా చేరాను.

ఇప్పుడు భారత దేశ సేవ అయిపోయింది ఇక మిగిలింది ఈ భారతి సేవ ఇక ఈ దేవి గారి సేవ చేస్తూ ఉంటాను అని అన్నాడు మనోజ్ భారతిని కౌగిలించుకుంటూ ఆగు మనోజ్ అబ్బా ఎవరైనా చూస్తే బాగోదు పెళ్లికాకముందు ఇవన్నీ కుదరవు అని అతని కౌగిలి నుంచి విడిపించుకొని కిందికి పరిగెత్తింది భారతి. నీ సిగ్గు అంతా మొదటి రాత్రి నేను తీసేస్తాలే అంటూ భారతి వెళ్ళిన వైపు మనోహరంగా చూస్తూ ఉండిపోయాడు మనోజ్.

ఆ తర్వాత వెంటవెంటనే ముహూర్తాలు పెట్టి వేసుకోవడం పెళ్లి జరిగిపోవడం అయిపోయాయి ఆరోజు తొలిరాత్రి కొత్త దంపతులకు మొదటి రాత్రి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ కోరికలతో తమ జీవనాన్ని తమ కలలను సాకారం చేసుకునే రోజు ఆరోజు ఇద్దరిని గదిలోకి పంపి తలుపులు పెట్టారు పెద్దవాళ్ళు. తలుపు దగ్గరే ఆగిపోయిన భారతి నీ చూస్తూ మనోజ్ అలా ఆగిపోయావు ఏంటి భారతి ఇన్ని రోజులు లేని సిగ్గు ఇప్పుడే వచ్చింది అమ్మాయి గారికి అని అంటూ మెల్లిగా  భారతిని దగ్గరికి తీసుకుని నడిపించుకుంటూ మంచం వైపు  తీసుకుని వచ్చాడు మనోజ్.

మంచం మీద కూర్చున్న తర్వాత మనోజ్ భారతి తల పైకెత్తుతూ భారతి ఇక మన సంసారం మొదలుపెట్టే ముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలి దానికి నువ్వు సమర్థిస్తామని సహకరిస్తావు అనే నమ్మకంతో నేను నీకు చెప్తున్నాను నువ్వు నాలో సగం కదా నేను ఏది చేసినా ఇద్దరం సగం సగం అనుభవించాలి కాబట్టి నీకు చెప్తాను. నీకున్న రహస్యాలు కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పు అని అన్నాడు మనోజ్.

భారతి ఎనిమిదో భాగం

భారతి ఎనిమిదో భాగం
భారతి ఎనిమిదో భాగం

ఆ మాటలు  విన్న భారతి మీకు తెలియని రహస్యాలు నా దగ్గర ఏమి లేవండీ మీరంటే నాకు చాలా నమ్మకం మీరు ఏం చేసినా మంచికే చేస్తారు అదే నమ్మకంతో ఉన్నాను నేను  మీరేం చెప్పాలని అన్నారు కదా  అది ఏంటో చెప్పండి అని అన్నది భారతి.

దానికి మనోజ్ నవ్వుతూనే లేచి ఆపిల్ కోస్తూ భారతి అందరo పుడతాం, చదువుతాం, పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు పిల్లల్ని చూస్తూ జీవితాంతం వారి కోసం కష్టపడుతూ ఉంటాం ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ పిల్లల్ని చూస్తాం సమయం రాగానే చనిపోతాం ఇదేనా జీవితం అంటే మనం ఈ దేశంలో పుట్టినందుకు దేశం మనకేమిచ్చింది మనం దేశానికి ఏమి ఇచ్చాము అని ఎవరైనా ఆలోచించారా లేదు కానీ మనం దేశానికి ఏమిచ్చాము అనే ఆలోచన నాకు వచ్చింది.

అందుకే నేను దేశం కోసం ఏదైనా చేయాలనే రెండు సంవత్సరాలు కష్టపడి అమ్మ వాళ్ళు ఒప్పుకోకున్నా దేశానికి సేవ చేయాలని నేను మిలటరీ లో చేరాను ఇప్పుడు అమ్మ వాళ్ళు పెళ్లి అయింది కాబట్టి దేశానికి సేవ చేయకు ఇక్కడే ఉండి అన్ని చూసుకో అని అంటున్నారు కానీ అది నాకు ఇష్టం లేదు నేను అనుకున్నది, చేయవలసింది చాలా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా సెలవు అయిపోగానే మళ్ళీ మిలటరీలో కి వెళ్తాను. అది నీకు ఇష్టమేనా ఇష్టమైతేనే మన మొదటి రాత్రి జరుగుతుంది లేదంటే మన పెళ్ళికి అర్థం లేదనుకుని నేను నీకు వేరే అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పాడు మనోజ్.

మనోజ్ మాటలన్నీ ప్రశాంతంగా విన్న భారతి అతన్ని చూస్తూ చూడు మనోజ్ ఆడదానికి పెళ్లి ఒక్కసారే అవుతుంది ఒకరితో అవుతుంది నేను చిన్నప్పటినుంచి నిన్ను ప్రేమించాను నువ్వే లోకంగా బ్రతికాను నీవు లేని జీవితం నాకు అర్థం లేనిదని నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావ్ నీలో సగం నేను అని అన్నావు కదా నువ్వే నేను కాదని ఎలా అనుకున్నావు.

నీ ఇష్టమే నా ఇష్టం  నువ్వు ఏదైనా చేయి నువ్వు ముందుకు వెళ్తాను అంటే నేను వెనక్కి లాగే అందరి ఆడవాళ్లలా కాదు,నీకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం నాకు కూడా దేశసేవ అంటే చాలా ఇష్టం అందుకే నేను కాలేజీ లో ఉన్నప్పుడు దేశానికి ఏదైనా చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను.

సామాజికంగా ఎన్నో మంచి పనులు చేశాను ఆ విషయాలన్నీ నీకు తెలిసిన తర్వాత చెప్తాను లేదా నా ఫేస్బుక్ లో చూడు నేను ఏ కార్యక్రమాలు చేశానో నీకు పంపిస్తాను అని భారతి అనగానే అవును నేను అవన్నీ చూశాను భారతి అందుకే నువ్వంటే నాకు ఇంకా ఇష్టం పెరిగింది నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నీకు విషయం చెబుతున్నా ఆరు నెలలు నేను ఇక్కడే ఉంటాను నీతో పాటే ఉంటాను తర్వాత నేను ఖచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను నీ  సహకారం ,అంగీకారం రెండు కావాలి  అన్నాడు ఉద్వేగంగా మనోజ్.

భారతి ఎనిమిదో భాగం

భారతి ఎనిమిదో భాగం
భారతి ఎనిమిదో భాగం

మనోజ్ నేను మిమ్మల్ని కాదు అని అనను దేశసేవ కంటే  ఏది ముఖ్యం కాదు మీరు ఇక ఆ విషయం మర్చిపోండి ఆరు నెలలు హాయిగా ఉందాం మిమ్మల్ని నేను బలవంత పెట్టను కానీ నాది ఒకే ఒక చిన్న కోరిక తీర్చి వెళ్ళండి అని అనగానే, ఏంటి భారతి అది చెప్పు నీ కోరిక ఏదైనా నేను తీరుస్తాను అది ఎంత పెద్ద కోరిక అయినా,  ఎంత రిస్క్ అయినా తీర్చే వెళ్తాను కానీ నువ్వు మాత్రం నాకు అనుకూలంగా నా నమ్మకాన్ని వమ్ము చేయమని నమ్ముతున్నా అని అన్నాడు గంభీరంగా..

దానికి భారతి నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయనండి మీకు ఎదురు చెప్పను, ఉండమని అడగను ఇక కోరిక అంటే  ఏంలేదు మనోజ్ ఈ ఆరు నెలలు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మీలాంటి ఒక బిడ్డను నాకు ప్రసాదించండి అదే చాలు అదే నా కోరిక అని అంది భారతి. అదేనా నీ కోరిక సరే నేను తీరుస్తాను ఇక లేటెందుకు అని అంటూ లైట్ తీసేసాడు మనోజ్ ఇక ఆ గదిలో వేడి నిట్టూర్పులు కోరికతో దహించి వేస్తున్న తమ దేహాలను తృప్తీ పరుస్తూ, తమ ప్రేమకు అర్దాన్ని వెతుకుతున్న రెండు ప్రేమ పక్షులూ ఉసులాడు కుంటూ ఆనంద డోలికల్లో ఓలలాడుతూ తేలిపోతున్నారు ..

మరి వీరిద్దరూ ఇలా తీసుకున్న నిర్ణయాన్ని ఇద్దరి తల్లిదండ్రులు ఆమోదిoచారా ? లేదా ? కొడుకు ఇక తమతోనే ఉంటాడు తమను బాగా చూసుకుంటాడు అని అనుకుంటున్నా ఆ వృద్ద దంపతులకు వీరి నిర్ణయం ఏలాంటి సమస్యలు తీసుకు రాబోతుంది ? భారతి తల్లిదండ్రులు ఒక్కగానొక్క కూతురు సుఖంగా ఉంటుందని అనుకుంటున్నారు మరి భారతి ఇలా భర్తకు మాట ఇచ్చిందని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి ? భారతి జీవితం ఏ మలుపులు తిరగబోతుంది ? ఎలాంటి సమస్యలు భారతికి ఎదురు కాబోతున్నాయి ? ఏం జరగబోతుంది ? చదవండి తదుపరి భాగం లో…..

Related Posts

2 Comments

Comments are closed.