భారతి ఏడో భాగం Interesting Un-expected Part 7

భారతి ఏడో భాగం

భారతి ఏడో భాగం
భారతి ఏడో భాగం

భారతి తన తండ్రికి ఏర్పడిన ఒక సమస్య ను పరిష్కరించింది. సమస్యకు సమాధానం ఇచ్చేసి, మధ్యలో ఆగిపోయిన తన చదువును పూర్తి చేయడానికి గానూ మళ్ళి హాస్టల్ కు వెళ్లి పోయింది. అయితే మరి మనోజ్ విషయాన్ని భారతి ఏం చేయబోతుందో  ఇక  చదవండి….

ఇలా ఆరు నెలలు  గడిచాయి…

అయితే ఈ ఆరు నెలల కాలంలో భారతి మనోజ్ గురించి మర్చిపోలేదు వెతుకుతూనే ఉంది తన ఫ్రెండ్స్ అందరికీ మనోజ్ ఫోటో ఇచ్చింది. అయితే వాళ్ళు భారతికి ఒక సలహా ఇచ్చారు అదేంటంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి.

కాబట్టి అందరం ఫేస్ బుక్ లో పెడదాం అని చెప్పడం తో భారతి సరే అంది అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి ఆ ఫోటో ని ఫార్వర్డ్ చేయమని చెప్పింది వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో అన్నింట్లో అతని ఫోటో పెట్టి అందరికీ రిక్వెస్ట్ పెట్టింది ఈ వ్యక్తి కనిపిస్తే తన నెంబర్ ఇచ్చి ఆ  నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పింది.

అలా వెతుకుతూ ఉండగా భారతి కి ఫ్రెండ్ అయినా మానస కజిన్ బ్రదర్ ఫ్రెండ్ మిలటరీ లో ఉన్నాడు.

మనోజ్ కు  అతను చాలా క్లోజ్ ఫ్రెండ్ అతని పేరు అభిలాష్. అభిలాష్ ఒకరోజు ఫేస్బుక్ లో చూస్తుండగా మానస పంపిన మెసేజ్ చూసి తిరిగి మానసకి ఫోన్ చేశాడు ఇతను మనోజ్ నాకు తెలుసు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మిలటరీలో మేజర్ ర్యాంకులో ఉన్నాడు చాలా మంచి మనిషి ఇతని గురించి పోస్టు ఎవరు పెట్టారు?

ఎందుకు పెట్టారు ? అని అడిగాడు మన దానికి మానస అన్నయ్య అతను నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయి ఐదు సంవత్సరాలయింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.

అందుకని మేము అతన్ని వెతుకుతూ పోస్ట్ పెట్టాము ఇప్పుడు ఆ ఫ్రెండ్ నీ దగ్గర ఉన్నాడా అని అనగానే అతను అవునమ్మా నేను తను ఇద్దరం ఒకేసారి మిలటరీ  లో జాయిన్ అయ్యాం.

కానీ అతను మంచి పనితనంతో ప్రమోషన్ తెచ్చుకొని మేజర్ స్థానంలో ఉన్నాడు అది ఇక్కడే ఉన్నాడు ఇంకొక రెండు నెలలో తనకి  సెలవు దొరుకుతుంది. అప్పుడు వెళ్లి తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేయాలని తనకు ఒక స్నేహితురాలు ఉందని తనని కూడా మర్చిపోలేక పోతున్నానని అది ప్రేమేనేమో అని అతను నాకు చెప్పాడు.

ఎందుకంటే అతను నాకు  చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈ విషయాలన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు  మీరు పెట్టిన పోస్టు వల్ల నాకు  అతని గతం ఏంటో తెలిసింది అని అనగానే మానస ఫోన్ లో ..

అన్నయ్య అతనికి ఈ విషయం చెప్పి ఈ పోస్ట్ చూపించి భారతి నీ కోసం వెతుకుతుంది అని చెప్పు  అనగానే లేదమ్మా ఇప్పుడు తను యుద్ధం లో ఉన్నాడు నేను ఇప్పుడు చెప్పలేను తను వచ్చాక తెలియజేస్తాను.

అప్పుడు ఈ విషయం మనం భారతికి చెబుదాము అప్పటివరకు నువ్వు ఏం చెప్పకు అని అన్నాడు అభిలాష్  దాంతో మానస కూడా  సరే అన్నయ్య నేను భారతి కి ఏ విషయం చెప్పను నువ్వు కూడా ఫేస్ బుక్ లో ఏ విషయాన్ని చెప్పకు అని టచ్ లో ఉండు అన్నయ్య అంటూ మనోజ్ నెంబర్ తీసుకుని ఏమీ తెలియనట్లుగానే ఫోన్ పెట్టేసింది మానస.

భారతి మాత్రం మనోజ్ కోసం ఇంకా వెతుకుతూనే ఉంది. భారతి ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయింది అయినా కూడా మనోజ్ గురించి ఇంకా వెతుకుతూనే ఉంది ఆ తర్వాత రెండు నెలలు గడిచాయి మనోజ్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాడు.

అభిలాష్ తనకి ఫేస్ బుక్ లో పోస్ట్ చూపించి నీ కోసం భారతి వెతుకుతూనే ఉంది అని చెప్పడం తో మనోజ్  సరే వెళ్తాను అని చెప్పి కానీ ఈ విషయాలేవీ భారతి కి తెలియకుండా చేద్దాము ఒకటేసారి వెళ్దాం అని అనగానే ఇద్దరు కలసి బయలుదేరారు హైదరాబాద్ కి.

అయితే ఇంతలోనే రామమూర్తి గారు అన్నయ్య చనిపోయిన బాధ లో సరిగ్గా తినక పోవడం వల్ల అనారోగ్యానికి గురి అయ్యారు దాంతో విషయం తెలిసిన భారతి  తండ్రికి ఆరోగ్యం బాగాలేదని ఆఫీసులో సెలవు తీసుకొని, ఇంటికి వచ్చింది వస్తూ వస్తూ మనోజ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది తన తండ్రి ఇలాగైనా కాస్త కోలుకుంటాడు.

అని  స్నేహితుని ఆరోగ్యం సరిగా లేదని తెలుసుకున్న మనోజ్ వాళ్ళ తల్లి తండ్రి కూడా భారతి వాళ్ళ ఇంటికి వచ్చారు అందరూ ఒకే దగ్గర ఉన్నారు తననీ రెండు రోజులు హాస్పిటల్లో ఉంచుకొని అంతా బాగానే ఉంది కాకపోతే బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి పంపించి వేశారు అలా నాలుగు రోజులు ఉన్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు.

వాళ్ళు, ఇక్కడ అ మనోజ్ అభిలాష్ ఇద్దరు బయలుదేరి హైదరాబాదు లో ఉన్న తమ ఇంటికి ముందుగా వెళ్లారు వెళ్లేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది.

పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్లు లేరని వరంగల్ లో ఎవరికో బాగా లేదంటే వెళ్లాలని చెప్పారు పక్కింటి వాళ్ళు, దానితో కంగారు పడిన మనోజ్ ఎవరికి ఏమైందో అని అనుకుంటూ వరంగల్లో అడ్రస్ తెలియక ఎలా వెళ్లాలో అని అర్థం కాకుండా వెళ్లి వరంగల్ బస్సు ఎక్కారు.

భారతి ఏడో భాగం

భారతి ఏడో భాగం
భారతి ఏడో భాగం

పని చేసే ఆఫీస్ అడ్రస్ తెలుసుకుని గుర్తు ఉంది కాబట్టి అదే ఆఫీస్ కి వెళ్లి పేరు చెప్పి వాళ్ల ఇంటి అడ్రస్ తీసుకున్నారు. ఆ అడ్రస్ ప్రకారంగా గా ఆటోలో వెళ్లి ఆ ఇంటి ముందు ఆటో దిగారు అదే నా ఇల్లు కాదా అని అనుకుంటూ ఉండగా లోపల్నుంచి పనిమనిషి బయటకి వచ్చింది.

బాబు రామమూర్తి గారి ఇదేనా అని అడిగాడు మనోజ్ అవునండి ఇదే రామమూర్తి  గారి ఇల్లు తనకి ఆరోగ్యం బాగాలేదు ఇంతకీ మీరు ఎవరు ? ఎక్కడి నుంచి వచ్చారు ? అని అడిగేసరికి మేము వాళ్ళకి తెలిసినవాళ్లము హైదరాబాద్ నుంచి చూడ్డానికి వచ్చాము అనగానే రండి సార్ లోపలికి గదిలో  ఉన్నారు సార్ అని చెప్పి లోనికి తీసుకొని వెళ్ళింది పనిమనిషి.

అప్పుడే వంట గది లోంచి బయటకు వస్తున్న తల్లి మనోజ్ ను చూడగానే తల్లి సంతోషంతో ఎదురుగా వచ్చి బాబు ఎన్నాళ్ళయింది రా నిన్ను చూసి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లావు రా అంటూ గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉండడం వల్ల ఆ అలికిడికి భారతి తల్లి మనోజ్ తండ్రి ఇద్దరూ గబగబా హాల్లోకి వచ్చారు.

అందరూ మనోజ్ రాక కు చాలా సంతోషించారు. ఇక కుశల ప్రశ్నలు అయ్యాక మనోజ్ భారతి ఎక్కడ ఉందాంటి అనగానే భారతి మేడ మీద ఉంది బాబూ వాళ్ళ నాన్నగారికి బాగా లేదు కదా తనని చూసుకోవడానికి వచ్చింది నువ్వు వచ్చిన విషయం ఇంకా తనకి విషయం తెలియదు.

నిన్ను చూసి భారతి  చాలా ఆనందిస్తుంది సరే మీరు ప్రయాణం చేసి వచ్చారు ముందు కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత భారతి నీ వెళ్లి కలవండి బాబూ అనగానే మనోజ్ లేదాoటి భారతి నా గురించి  చాలా  కష్టపడి వెతికింది ఇప్పుడు  నా ఎదురుగా రావడం లేదు ఎందుకు అని అనగానే లేదు బాబు ఆమెకు ఇంకా నువ్వు వచ్చినట్లు తెలియదు.

భారతి ఏడో భాగం

భారతి ఏడో భాగం
భారతి ఏడో భాగం

ఆమెపైన ఉన్నట్టుంది అనగానే అవునా సరే సరే మీరు ఎవరు ఏమి చెప్పకండి అని అనుకుంటూ తానే మెల్లగా పైకి మేడ మీదికి వెళ్లాడు మనోజ్.

పైన గదిలో కుర్చీలో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంది భారతి మెల్లిగా పిల్లిలా అడుగులు వేసుకుంటూ వెనక నుంచి వెళ్లి రెండు కళ్ళు మూశాడు మనోజ్.

భారతి ఎవరు ఎవరు అది నా కళ్ళు మూసారు మీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి ఎందుకు వెనకా  దాక్కున్నారు నాకు ఎందుకు కనిపించడం లేదు అసలు ఎవరు మీరు ? ఎవరికీ ఇంత ధైర్యం ఉంది అంటూ కంగారు పడసాగింది.

దాంతో మనోజ్ తన  గొంతు మార్చి నేను దొంగని మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఇచ్చేయి అని అంటూ గట్టిగా బెదిరించడం తో దొంగవా నువ్వు దొంగవా సరే నన్ను  ఏమి చేయకు నీకు బంగారం మొత్తం ఇస్తాను అని అంటూ అలాగే ముందుకు తిరిగి కాలి తో ఒక్క తన్ను తన్నింది భారతి. అబ్బా రాక్షసీ అని అరిచి చేతులు వదిలేశాడు.

నువ్వు నన్ను చంపేస్తావా నేను పది మందిని చంపిన వాడిని నువ్వు నన్ను చంపుతావా నువ్వు అసలు ఆడదానివేనా అని నవ్వుతూ అనగానే ఎవరు నువ్వు అని అంటూ మనోజ్ ను తేరిపారా చూస్తూ నువ్వు నువ్వు మనోజ్  నువ్వు  మనోజ్ కదా అని ఆశ్చర్యానికి గురి అయింది భారతి. హ అవునే రాక్షసీ నేనే మనోజ్ ను, నేనే రాక్షసుణ్ణి అనుకుంటే టెర్రరిస్టుల అందర్నీ చంపుతాను అని అనుకుంటే  నువ్వు నన్ను  చంపావు కదే రాక్షసి అని కోపంగా అన్నాడు.

మనోజ్ అయ్యో సారీరా గుర్తుపట్టలేదు అయినా వెనుకనుంచి కళ్ళు మూయడం ఏంటి ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి గాని ఎవరైనా ఇలా వస్తారా ఏంటి అని గొడవ పడసాగింది మనోజ్ తో భారతి.

అమ్మ తల్లి ఆపు కొట్టింది నువ్వు తిట్టేది నన్నా ఆహా అమ్మ మీ ఆడవాళ్లు ఉన్నారే చాలా తెలివైన వాళ్ళు అని  మనోజ్ చిలిపిగా అనగానే ఇద్దరు ఫక్కున నవ్వారు. కింద ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు స్నేహితులు తో సహా మేడ మీద గది లోకి వచ్చారు అందరూ చిరునవ్వు నవ్వుతూ బాగుంది ఇద్దరి జంట ఇద్దరూ ఇద్దరే ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు అని అనుకుంటున్నారు అని  ఇక ఇద్దరికీ ముక్కుతాడు.

వేస్తే మనముందే ఉంటారు ఇంకా అని మాట్లాడుతూ ఉండగా మనోజ్ , భారతి  ఇద్దరు సిగ్గుతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చిన్నగా నవ్వు సాగారు…

మరి భారతి మనోజ్ ల పెళ్ళి జరిగిందా ? లేదా ? వారి జీవితం ఏ మలుపులు తిరగబోతుంది చదవండి తదుపరి భాగం లో ..

Related Posts

1 Comment

Comments are closed.