భారతి పేరెంట్స్ నీ వెతుకుతూ వస్తారు మనోజ్ పేరెంట్స్. మాటల్లో మనోజ్ తమని వదిలి వెళ్లి పోయి రెండేళ్ళు అయ్యింది తను ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్పి భారతి మనోజ్ తో ఏమైనా టచ్ లో ఉందేమో అనే అనుమానం తోనూ, ఎవరితో పంచుకోవాలో తెలియని స్థితిలో మీ దగ్గరికి వచ్చాము అని అంటారు ఇక జరిగేది చదవండి ….
అయినా ఈ రోజు రేపు పిల్లలకి మనం చెప్పేది యెంటమ్మ వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతారు నేను భారతి ని డాక్టర్ చదివించాలని అనుకున్నాను కానీ తనకు ఇంజనీరింగ్ ఇష్టమని ఇంజనీరింగ్ లోచేరింది నా మాట వినలేదు తనకు ఇష్టమైన చేస్తుంది అని చెప్పి బాధపడ్డారు భారతి తల్లి తండ్రి,…..
సరే అన్నయ్య మీరు ప్రయాణం చేసి వచ్చారు కాసేపు అలా నడుము వాల్చాను అండి మీ పక్కలు బెడ్రూంలో సర్దార్ అని చెప్పి వాళ్లను బెడ్ రూమ్ లో కి పంపించింది భారతి తల్లి ఇక్కడే ఉండండి ఓ నాలుగు రోజులు మీ మనసు పడే వరకు మాతో మాకు కూడా ఎవరున్నారు ఎవరు లేరు అమ్మాయి అక్కడ మేము ఇక్కడ మనం ఒకరికి ఒకరు ఒకరికి ఒకరం తోడుగా ఉందాం
ఈ నాలుగు రోజులు మీరు దిగులు లేకుండా హాయిగా ఉండండి అని అన్నారు సరేనమ్మా అది మన మంచికే లే కనీసం కాస్తలో కాస్త తగ్గుతుంది అని అంటూ వాళ్ళు వెళ్లి రెస్ట్ తీసుకో సాగారు…
అలా వాళ్ళు ఒక వారం రోజులు ఉన్నారు ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఇద్దరూ కలిసి పిండి వంటలు చేయడంలో మునిగిపోయారు ఆడవాళ్ళు అవును ఈ పండక్కి భారతి వస్తుంది కదా అని అడిగింది మనోజ్ వాళ్ళ తల్లి అవును వదిన పోయినసారి కూడా ఏ పండక్కి రాలేదు ఈ పండక్కి వస్తుందేమో చూడాలి అని సమాధానం ఇచ్చింది భారతి తల్లి .
సరే వస్తే తనను చూసినట్లు కూడా ఉంటుంది మేము వెళ్లి పోతాం అని చెప్పింది మనోజ్ తల్లి ,అయ్యో అదేంటి వదిన మేము ఏమైనా పరాయి వాళ్లమా మీకు మనమంతా ఒకటే కుటుంబంలా కలిసి ఉన్నాము పండగ కూడా ఇంకో వారం రోజులు ఉండండి మీ దిగులంతా తీరే వరకు ఉండి అప్పుడు వెళ్ళండి మీకు వెళ్లాలనిపిస్తే వెళ్ళండి లేదా ఇక్కడే ఉండండి అందరం కలిసి మెలిసి ఉండొచ్చు అంటే సరేలే సరే చూద్దాం ఈయన ఏమంటారు అక్కడ బిజినెస్ ఇల్లు వదిలేసి వచ్చాం ఉందాం అంటారో వెళ్దామంటారో తెలియకుండా ఉంది అని వీళ్ళు ఇలా మాట్లాడుతుండగానే అక్కడ మగవాళ్ళు కూడా ఇదే విషయం మీద డిస్కస్ చేస్తున్నారు
ఇంకో వారం రోజులు ఉండమని భారతి తండ్రి అంటే లేదు బిజినెస్ అంతా పోతుంది నేను లేకుంటే ఇల్లు కూడా వదిలేసి వచ్చాము అక్కడ ఎవరూ లేరు. పండగ అవగానే భారతిని చూసి వెళ్తాము అని అన్నాడు, ఇక బలవంతం చేయడం ఇష్టం లేక సరే మీ ఇష్టం అని ఊరుకున్నాడు భారతి తండ్రి. మరి ఈ పండక్కి అయినా భారతి వస్తుందా ? రాదా ? మనోజ్ విషయం తనకు తెలుసా ?
చదవండి తదుపరి భాగం లో …
మీ భవ్య చారు
బావుంది భవ్యా కానీ కధ రెండు సార్లు రిపీట్ అయ్యింది