భారతి -మూడో భాగం

 భారతి తల్లిదండ్రులను వెతుక్కుంటూ వచ్చారు మనోజ్ తల్లిదండ్రులు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ? వాళ్ళు రావడానికి కారణం ఏంటి ? ఇక చదవండి …

ఇక ఆడవాళ్ళ మాటలకు అంతే లేకుండా పోయింది తాము చూసిన ప్రదేశాలు గడిచిన ఐదేళ్లలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుతూ కూర్చున్నారు వీళ్ళ ముచ్చట్లకు అంతులేకుండా పోయింది ఈరోజు మనకు పెడతారో పెట్టారు అని ఇద్దరు స్నేహితులు అనుకుంటూ వంట అయిందా మాకు ఏమైనా భోజనం పెట్టేది ఉందా లేదా అని ఆశ్చర్యంగా అన్నాడు భారతి తండ్రి ఓ అదే ఐదు నిమిషాల్లో చేస్తాను అన్నయ్య మీరు రండి అంటూ చెప్పింది తల్లి.

భోజనాలు అవి కూర్చున్నాక ఇంతకీ భారతి ఇక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఉంది కాలేజీ గాని వెళ్ళినా ఏంటి అని అడిగాడు మనశ్శాంతి లేదండి ఇక్కడ ఉంటే చదువు సాగడం లేదని భారతిని వేరే ఊర్లో ఉన్న హాస్టల్ లో వేశాను అక్కడ ఇతర ఇంజనీరింగ్ చదువుతోంది వారానికి ఒకసారి వెళ్లి చూసి వస్తూ ఉంటాను అని అన్నాడు భారతి తండ్రి.అవును మరి మనం సంగతేంటి మనోజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాగా పెద్దవి ఉంటాడు మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా చిన్నవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏంటో ఏం చేస్తున్నాడు అంటూ ఆరా తీసింది భారతి తల్లి.

దాంతో ఒక్కసారిగా మనోజ్ తల్లి తండ్రి ఇద్దరూ దిగులుగా మోకాలు పెట్టుకున్నారు అదేంటి అన్నయ్య ఏమైంది ఏదైనా సమస్య అని అడిగింది ఏం లేదమ్మా వాడు డిగ్రీ అవగానే సైన్యంలో చేరుతానని మాకు చెప్పాడు మేము ఉన్న ఒక్కగానొక్క కొడుకును సైన్యంలోకి పంపించమని అనడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు గత రెండు సంవత్సరాల నుంచి అని ఎక్కడ ఉన్నాడో ఏంచేస్తున్నాడో మాకు ఎవరికీ తెలియదు ఆ దిగులుతోనే కాస్త మార్పు గా ఉంటుందని మీ దగ్గరికి వచ్చాము మిమ్మల్ని వెతుక్కుంటూ అని అన్నాడు

అలా ఎందుకు చేశాడు మంచి డాక్టరు ఇంజనీరు చదివితే మీ కళ్ళ ముందే ఉండేవాడు కదా అని అన్నాడు భారతి తండ్రి, అన్ని విధాలా చెప్పి చూసావా అన్నయ్య మేము చేస్తామని కూడా బెదిరించాను అయినా వాడు వినకుండా మమ్మల్ని వదిలి రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడో కూడా తెలియకుండా పోయింది .

కనీసం ఉత్తరము ఫోను కూడా చేయట్లేదు చేయాలని ప్రయత్నించిన వాడి ఎక్కడున్నాడో మాకు తెలిస్తే కదా మేము ఉత్తరాలు రాసేది అందుకే దిగులుతో మా ఇద్దరికీ ఏమి తోచక మీరు ఏదైనా సలహా చెప్తారేమో అని ఇలా వచ్చాము అని అన్నారు ఇద్దరు……. 

మరి మనోజ్ ఎక్కడికి వెళ్ళాడు ? అసలు ఏం జరిగింది ? ఏం జరగబోతుందో చదవండి తదుపరి భాగం లో …

మీ భవ్య చారు

Related Posts

1 Comment

Comments are closed.