మాధవ రావు గారు రియల్ ఎస్టేట్ బిజెనెస్ చేస్తారు. వారి పక్కిల్లె రామమూర్తి గారిది. రామ మూర్తి గారు రెవిన్యూ శాఖలో పని చేస్తూ ఉండేవారు. మాధవరావు గారికి ఒకగానోక్క కొడుకు మనోజ్ , రామ మూర్తి గారికి ఒక్కగానొక్క కూతురు భారతి వారి ఇల్లు పక్కనే కావడం వల్ల పెద్దవారి మధ్య స్నేహం పెరిగింది.
అది విడదీయలేని బంధం గ మారింది. ఎంతలా అంటే ఒకరి ఇంట్లో అన్నం వండితే ఇంకో ఇంట్లో కూర చేసేంతగా పెరిగింది. వారి స్నేహం తో పాటు వారి పిల్లల స్నేహం కూడా వారితో పాటు పెరిగి, పేద్దయ్యింది. వారు బాగా చదువుతూ, పెద్దలకు పేరు ప్రఖ్యాతిలు తెస్తూ, వారి ఆనందాన్ని రెట్టింపు చేసేవారు .చదువులోనే కాకుండా ఆట , పాటల్లో కూడా బహుమతులు సంపాదించే వారు.
అలా ఇద్దరు కలిసి పదవ తరగతి వరకు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. పరీక్షలు ముగిసే సరికి భారతి వాళ్ళ నాన్నకి వెరీ ఊరికి బదిలీ అయ్యింది. వాళ్ళు ఆ ఊరి నుండి వెళ్తున్నారు అంటే మాధవరావు గారు చాల బాధ పడ్డారు. అలా వారు వదలలేక వదలలేక ఎక్కడికి వెళ్ళినా తమ క్షేమం తెలుపుతూ ఉత్తరాలు రాసుకోవాలి అనే నిబందన పెట్టుకొని, ఆ ఊరి నుండి వెరే ఊరికి వెళ్ళిపోయారు. స్నేహితులు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు విడిచి ఉండలేక ఏడవసాగారు. భారతి అయితే ఏడుపు ఆపుకోలేక పోతుంది.
ఇద్దరు తల్లులు వాళ్ళిద్దరినీ సముదాయించ లేక పోతున్నారు. అయినా నా ఎంత దూరం వెళ్తున్నాం అక్కడ వస్తే ఇక్కడే దిగుతాం ఇక్కడ ఎక్కి అక్కడే దిగుతాం చూడాలనుకున్నప్పుడు రావచ్చు అని ఊరుకోపెట్టింది. మనోజ్ కూడా అలాగే సముదాయించింది భారతి వాళ్ళ అమ్మ.
ఇంతలో భారతి వాళ్ళ నాన్న కార్ తీసుకుని రావడంతో ఆ కారులో ఎక్కి వెళ్లిపోయారు ఆ కారు వెళుతున్న అంతమేర మనోజ్ చేయి ఊపుతూ నే ఉన్నాడు ఇంతవరకు ఏడుపు ముఖంతో చూస్తూ నిలబడిపోయాడు అక్కడే నిలబడకు వాళ్లు వెళ్లి చాలాసేపు అయింది పద ఇంట్లోకి అంటూ బలవంతంగా మనోజ్ నిఇంట్లోకి తీసుకొని వెళ్ళింది వాళ్ళ అమ్మ. దాదాపు పు వరకు భారత్ ని మర్చిపోలేక ఏడుస్తూనే ఉండిపోయాడు మనోజ్. మరి మళ్ళి ఈ ఇద్దరు స్నేహితులు మళ్ళి కలుస్తారా ? లేదా ? వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి ? తెలుసుకోవాలి అంటే మళ్ళి శనివారం వరకు ఆగాల్సిందే…..
—-భవ్య చారు
Very interesting akka waiting