భారతి- రెండో భాగం

భారతి మనోజ్ ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు కానీ తండ్రికి వేరే ఊరికి బదిలీ అవడం తో భారతి వెళ్ళాల్సి వస్తుంది మనోజ్ నీ వదిలి .. తర్వాత ఏం జరిగిందో చదవండి ….

ఆ తర్వాత  ఫలితాలు రావడంతో భారతి విషయం పక్కన పెట్టి తన మార్కులు చూసుకున్నాడు. తనతోబాటు భారతి కూడా ఫస్ట్ క్లాస్ లోపాస్ అయింది. ఈ విషయం  తల్లికి చెప్పి చాలా సంతోషించాడు మనోజ్. అక్కడ భారతి కూడా తన నెంబరు మనోజ్ నెంబరు చూసి ఇద్దరూ మంచి మార్కులతో పాస్ అయ్యమని గుడికివెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. ఆ తర్వాత రోజులు గబగబా నడిచాయి.

మనోజ్ ను హైదరాబాదులో ఉన్న హాస్టల్ లో ఇంటర్లో చేర్పించారు తండ్రి ఆ హాస్టల్ వాతావరణంలో లో కొత్త కొత్త స్నేహితులతో కలిసి  దాదాపుగా భారతి మర్చిపోయాడు అని చెప్ప వచ్చు మనోజ్ . భారతి కూడా వేరే ఊర్లో ఇంటర్లో చేరింది. ఇద్దరూ బాగానే చదువుతున్నారు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకుంటున్నారు అలా కొన్ని రోజులు గడిచాక ఇద్దరు ఇంటర్ పూర్తయింది.

చదువుల హడావుడిలో పడి ఉత్తరాలు తగ్గించారు వాళ్ల దారులు వేరయ్యాయి చదువులో పడి ఏ విషయాన్ని పట్టించుకోవడం తగ్గించారు భారతి ఇంజనీరింగ్ లో చేరింది కొత్త ఫ్రెండ్స్ చదువులో  సెమిస్టర్ పరీక్షల మధ్యలో దాదాపుగా మనోజ్ ను మరిచిపోయిందని చెప్పవచ్చు.

అలా ఐదేళ్లు గడిచాయి ఒకరోజు  భారతి   తండ్రి ఆఫీస్ కు ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది అందులో అతని అడ్రస్ తెలుపమని మనోజ్ తండ్రి రాసినట్టుగా ఉంది అతను ఆ లెటర్ లో ఉన్న అడ్రస్కు తన అడ్రస్ తెలుపుతూ ఉత్తరం రాశాడు గత అయిదేళ్లుగా తమ స్నేహాన్ని మరిచిపోయినందుకు తనను క్షమించమని  వేడుకుంటూ ఉత్తరం రాసి  తను ఉన్న అడ్రస్ తను పనిచేసే ఆఫీసు పేరు తో సహా రాసి పోస్టు చేశాడు భారతీ తండ్రి…..

ఒక వారం తర్వాత వాళ్ల అడ్రస్ వెతుక్కుంటూ మనోజ్ తండ్రి తల్లి ఇద్దరు వచ్చారు వాళ్లను చూసిన ఆనందంలో  భారత్ తండ్రి సంతోషపడుతూ వాళ్లకు ఎదురువెళ్లి లోపలికి తీసుకొని వచ్చాడు ఐదేళ్ల నుంచి జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఇద్దరు స్నేహితులు తను బిజినెస్ లో బాగా గడించినట్లు మంచి పొజిషన్ లో ఉన్నట్లు చెప్పాడు ఆఫీస్ లో ప్రమోషన్లు వచ్చే జీతం పెరిగి ఆఫీసు ఇల్లు ఇచ్చిందని చెప్పాడు భారతి తండ్రి..

వీరిని వెతుకుతూ రావడం వెనక ఉన్న అసలు కథ ఏంటో తదుపరి భాగం లో తెలుసుకోండి…

భవ్య చారు  

Related Posts