భార్య భర్తల బంధం

అక్షర కొరకు
అంశం – చిత్ర కవిత
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – బార్య భర్తల బంధం

వెనుకటి రోజుల్లో
పతియే ప్రత్యక్ష దైవం
ఇప్పటి రోజుల్లో పతి
బానిసలా ఉండాలని కోరిక!

ఆ కాలంలో అర్థం చేసుకుని
మెదిలే వారు ఆడవాల్లు పైగా
వాల్లకు ఏ ఉధ్యోగాలు ఉండేవి
కావు భర్త దేవుడనుకునే వారు!

ఆ విధమైన భావనలో గొడవలు
ఎక్కువ ఉండేవి కావు ఈ కాలంలో
మగవాడితో సమానంగా ఆడవాల్లు
సంపాదిస్తున్నారు దాంతో మాట పడడం లేదు!

గొడవలు ఎక్కువై పోతున్నాయి
ఏ కాలంలోనైనా ఎంత సంపాదించినా
ఆడవాల్లకు బలం తక్కువే మగవాడి
బలం ముందు సంపాదన విషయం
పక్కకు పెట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి!

అప్పుడే బార్యా భర్తల బంధం
బలపడుతుంది ప్రేమ అనురాగాలతో
సంసార బంధాన్ని నిలబెట్టు కోవాలి!

ఇది నా స్వీయ రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *