మందబుద్ది కలవాడు
ఒక ఊర్లో శాంతిదేవి దినకరుడు అనే పుణ్యదంపతులు
ఉండేవాల్లు. వాల్లు చాలా మంచివాల్లు ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేవాల్లు చాలా పూజలు చేసేవాల్లు దానధర్మాలకు కొదవేలేదు వాల్లకు లేకపోయినా అందరికి పంచేవాల్లు.
అన్ని బాగున్నా దేవుడు వాల్లకు ఒక లోటు పెట్టాడు
అదే సంతానం ఇవ్వలేదు అంతమంచి మనసున్న వాల్లకి
ఎందుకు పిల్లలను ఇవ్వలేదో ఆ దేవుడు
దాంతో వాల్లకు మనశ్శాంతి లేకుండా పోయింది రోజూ
గుడికి వెల్తూనె ఉన్నారు పూజలు చేస్తూనె ఉన్నారు
అయినా దేవునికి కరుణ కలుగలేదు
ఒక రోజు ఆ ఊరికి స్వామీజి వచ్చారు అని తెలిసింది
ఆయన దగ్గరకు వెలితే సంతానం కలుగుతుందని
ఆయన మహిమ గలవారనీ సంతానం లేని వాల్లంతా
ఆయన ఆశీర్వాదం కోసం వెలుతున్నారని ఆ నోట ఆ
నోట వీల్లవరకూ వచ్చింది.
ఇంకేముంది?వెంటనే అక్కడికి వెల్లారు స్వామివారు
వీల్లను చూడంగానె వీల్ల బాద గుర్తించారు.
మీకు పిల్లలు లేరు కదా! అని అడిగారు
అవును స్వామి !అన్నాడు దినకరుడు.
శాంతిదేవిని పిలిచి ఒడి పట్టమన్నాడు ఆమె ఓడి పట్టగానె పెద్ద మామిడి పండు ఒకటి ఒడిలో పెట్టి
ఇద్దరిని తినమన్నాడు.
అది తిన్న కొద్దిరోజులకే శాంతిదేవి గర్బందాల్చి పండంటి
మగ బిడ్డను కన్నది.
స్వామీజి మహిమ వల్ల కలిగిన ఆపిల్లవానికి దివాకరుడని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు
దివాకరుడు చూడడానికి చాలా అందంగా పెద్ద పెద్ద కల్లు
బుజ్జినోరు లడ్డు చెంపలు ఉంగరాల జుట్టుతో చూడ
ముచ్చటగా ఉండేవాడు . కాని అతి గారాబం వల్ల
అతనికి బుద్ది మాత్రం ఎక్కువ పెరుగలేదు .
అమ్మ,నాన్న ఎంత చెప్తే అంతె ,స్వంత బుద్ది ఉండేదికాదు
నలుగురితో కలిసేవాడు కాదు దాంతో స్నేహితులు కూడ
లేరు అమ్మ,నాన్న తోటే వాడిలోకం.ఏ పనీ చేయకుండ
చాతకాని వాడిలా తయారయ్యాడు.
దిననకరునికి శాంతిదేవికి చాలా బెంగగా ఉండేది.
మనకేమి సంపాదించి పెట్టకపోయినా వాడి బ్రతుకైనా
వాడు బ్రతకాలి కదా!ఇలా అయితే ఎలా?
అని వాడి ఆలోచనలతో నిద్రకూడ పట్టేది కాదు.
పెరిగి పెద్దవాడయ్యాడు పెళ్ళీడు కూడ వచ్చింది పెల్లయినా చేస్తె ఆ వచ్చే అమ్మాయైనా మంచి మార్గంలో
నడిపిస్తుందేమెా! మనం చెప్తే వినడం లేదు వాడికి మనం
చులకనయి పోయాం కనీసం ఆ అమ్మాయైనా మారుస్తుంది అప్పుడైనా మారతాడు అనుకుని ఆ
ఆలోచన వచ్చిందే తడవుగా పక్క ఊర్లో సంబందం ఉందని తెలిసి ఇద్దరూ వెల్లారు.
అమ్మాయిని చూస్తే అపరంజి బొమ్మ చాలా బాగుంది
సంబందం నచ్చింది దివాకరుడు కూడ చాలా అందగాడు
కదా! అమ్మాయి తరుపు వాల్లకు కూడ నచ్చేసింది
ఉద్యోగం దేముంది తల్లి తండ్రికి ఒక్కడే కొడుకు కదా!
ఉన్న ఆస్తి అంతా వాడిదే కదా! ఏదో ఒక చిన్న పని
చేసుకున్నా చాలులే అనుకుని అంగరంగ వైభవంగ పెల్లి
జరిపించారు.
అమ్మ,నాన్న ఎంత చెప్తే అంతే కదా మనవాడు పెల్లి
చేసుకున్నాడు.
పెల్లి అయ్యాక మెుదటి పండుగకు అల్లున్ని,కూతుర్ని
మామ వచ్చి తీసుకెల్లాలి కదా!
మామ వచ్చాడు తీసుకుని పోయేముందు దివాకరుడికి
వాల్ల అమ్మ నాలుగు బుద్ది మాటలు చెప్పింది.
అక్కడ ఎవరితో గొడవ పడకు
వాల్లు గంజి పోస్తె గంజి తాగు,
గట్క పెడితే గట్కనే తిను.
ఇది కావాలి అది కావాలని గొడవ చేయకు
అని చెప్పి పంపించింది.
వాల్లక్కడ అల్లుడొచ్చాడని పిండి వంటలు పులిహోర
పాయసం అన్ని చేసారు.
అల్లుడు రాగానె కాల్లకు నీల్లిచ్చి కాల్లు చేతులు కడుక్కోగానె బోజనం వడ్డించారు.
బోజనంలో గట్క లేదు గంజి లేదు వాల్లమ్మ చెప్పింది
కదా!
హా….నాకు గట్క కావాలె!గంజి కావాలె! నేను తినను
పొమ్మని అలిగాడు.
అయ్యెా! ఇదేం అల్లుడు మీకోసం ప్రత్యేకంగ ఇన్ని పిండి
వంటలు తయారు చేశాం ! మీరేంటి గంజి,గట్క అడుగు
తున్నారు ? ఇప్పుడైతె ఇవి తినండి తర్వాత అవి చేస్తాం
అని అత్తగారు ఎంత బతిమాలినా వినలేదు.
మామ ,బామ్మర్ది ఇంట్లో అందరూ బతిమాలినా వినకుండ
అలిగే కూర్చున్నాడు. ఇక లాభం లేదని ఆ గంజి,గట్కనే
వండి పెట్టారు.
పండగ అయిపోయి మల్లీ ఇంటికి తిరిగి వచ్చిన దివాకరున్ని శాంతిదేవి అడిగింది అత్తగారింట్లో బాగా
చూసుకున్నారా?
ఏమేమి వంటలు చేసి పెట్టారురా? అని
ఓ…..అన్ని బాగా చేసారమ్మా!
పులిహోర,నేతిగారెలు,పాయసం అన్నీ పల్లెంలో వడ్డించా
రు.
అవునా !అయితే అల్లుడి మర్యాదలు బాగానె చేసారన్నమాట అని సంబరపడిపోయింది శాంతమ్మ
కాని నేను తినలేదుగా ! అన్నాడు దివాకరుడు.
అయ్యెా! అదేంటి నాన్న ఎందుకు తినలేదు?అంది
నువ్వే గంజి గట్క తినమన్నావు కదా! అన్నాడు.
ఓరి పిచ్చి సన్నాసి మాట వరుసకి చెప్పాను రా వాల్లు
ఏది పెడితే అది తినమని దానర్థం ఇంత మందబుద్దేంట్రా? నాయనా ఇలాగైతే ఎలారా?
సరేలేవె అమ్మా! ఈసారి వెల్లినప్పుడు అన్ని చేయించుకుని మరీ తింటాగా!!
ఏం తింటావో ఏంటో సనుక్కుంటూ తన పనిలోకి వెల్లింది
శాంతమ్మ.
మల్లీ కొద్దిరోజుల తరువాత ఎలాగైనా అత్తగారింట్లో
పిండి వంటలు తినాలని బయలుదేరాడు దివాకరుడు
ఈసారయిన మంచిగా తిని రా నాయనా అని ఆశీర్వదించి పంపింది శాంతమ్మ.
దివాకరుడు వెల్లేసరికి వాల్ల ఇల్లుకాలిపోయి అందరూ
ఏడ్చుకుంటు కూచున్నారు. అల్లుని రాక చూసి బోరు
మని విలపించారు.
ఇదంతా ఏం పట్టని దివాకరుడు అత్తమ్మ నాకు మంచి మంచి పిండి వంటలు చేసిపెట్టవా? అని అడిగాడు.
నోరు వెల్లబెట్టి చూడడం వాల్లవంతయింది.
ఈ అల్లున్ని ఏమనుకోవాలో వాల్లకు అర్థం కాలేదు.
ఏదో పెట్టి పంపించేశారు.
తొందరగానె వచ్చిన కొడుకుని చూసి ఏమయిందిరా
తొందరగా వచ్చేశావు అంది శాంతమ్మ.
ఏంలేదమ్మా నేను వెల్లేసరికి వాల్ల ఇల్లు కాలిపోయి
అందరూ ఏడుస్తూ కూచున్నారు
అయ్యెా! పాపం ఇల్లెలా కాలిపోయిందిరా?మరి నువ్వేం చేశావు?వాల్లింటికి వెల్లి మనసులో ఏం చేసి వచ్చాడోనని
భయపడుతూనె అడిగింది శాంతమ్మ.
నేనేం చేస్తానమ్మ మంచి వంటలు చేయమన్న తింటాను
అన్నా.
అయ్యెా!అయ్యెా! ఏం వెడ్డి సన్నాసివిరా?నిన్ను నోములునోచి కన్నానురా ఇలా చేస్తున్నావేంట్రా?ఇల్లు
కాలి ఏడుస్తుంటె వంటలు చేయమని అడుగుతారా?
ఇంత తెలివి తక్కువేంట్రా నాయనా?నీతో ఎలారా?
సరే అమ్మా! నాకు తెలియదు కదా!మరేం చేయాలో
చెప్పచ్చు కదా!చెప్పమ్మా! అలాగె చేస్తాను.
ఇంకా చెప్పేదేమిట్రా చేసేదంతా చేసి వచ్చావు వాల్లు
ఏడుస్తుంటె నువ్వు ఏడవలేకపోయావా?
ఏడవాలా అమ్మా నాకు తెలియదే! అనుకుంటు మల్లీ
అత్తారింటికి పరిగెత్తాడు.
వెనకనుంచి శాంతమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండ
ఏడవాలని పరిగెత్తాడు.
వీడు వెల్లేసరికి వాల్లు అక్కడంతా శుభ్రం చేసుకుని మల్లీ
కొత్త ఇల్లు కట్టుకుని పూజ చేసుకుంటున్నారు
అయ్యగారు పూజ చేస్తున్న కొద్దీ వీడు ఏడుపురాగం అందుకోవడం అయ్యగారు పూజ ఆపి
బాబు అలా ఏడవకూడదు ఇది శుభకార్యం అని ఎంత
చెప్పినా మనవాడు ఏడుస్తూనె ఉన్నాడు.
ఎక్కడి తిక్క అల్లుడురా!బాబూ!అనుకుని ప్రసాదం పెట్టి
పంపిద్దాం అనుకుంటె ప్రసాదం కూడ తీసుకోకుండా
తిరుగు ప్రయాణమయ్యాడు.
ఇంటికెల్లగానె మల్లీ ఏం చేసి వచ్చావురా?అని శాంతమ్మ అడగగానె
ఏడ్చేసి వచ్చానమ్మా!అన్నాడు దివాకరుడు.
అయ్యెా!ఇప్పుడెల్లి ఏడ్చావా? వాల్లేం చేస్తున్నరు?అంది
తల కొట్టుకుంటూ.
వాల్లు పూజ చేస్తున్నారమ్మా!కొత్త ఇల్లు కట్టుకున్నారు
చెప్పాడు దివాకరుడు.
అనుకున్నంత అయింది ఇలాంటి పనేదో చేస్తావనె అనుకున్న .
ఇంకోసారి మీ అత్తగారింటికి వెల్లే పనే లేకుండ కోడలు
పిల్లను తీసుకుని రా!
ఈసారయినా చెప్పింది కరెక్టుగా చేయి మల్లీ మల్లీ
చెప్పించుకోకు సరేనా?అంది తల్లి.
బాగా ఆలోచించి పరిగెత్తి పోయి పిల్లచేయి పట్టుకుని
మల్లీ పరిగెత్తుకుని తీసుకొచ్చేశాడు.
ఇక మల్లీ పంపించలేదు శాంతమ్మ వాడిని అత్తారింటికి.
** ** ***
కొద్దికాలం తరువాత సుగుణవతి అయిన భార్యవల్ల
కొంత మార్పు వచ్చింది దివాకరుడికి ఇద్దరు పిల్లలు
కూడ కలిగారు సంపాదించడం నేర్చుకున్నాడు.
తల్లిని తండ్రిని సంతోషపెడ్తూ చివరి రోజుల్లో వాల్లను
సుఖపెడ్తూ కుటుంబ భారంమెాస్తూ హాయిగా కాలం
గడిపాడు దివాకరుడు.
దినకరునికి శాంతాదేవికి మనశ్శాంతి కలిగి మనవనితో
మనవరాలితో కాలక్షేపం చేస్తూ కృష్ణా,రామా అనుకుంటు
దివాకరుడిని ఇచ్చిన స్వామీజిని తలుచుకుంటు ఆనందంగా గడపసాగారు.
ఉమాదేవి ఎర్రం