మణి పూసలు

మణి పూసలు

జాతి పిత గాంధీజీ
ఆయనకెప్పుడు సలాంజీ
అహింస అతని పోరాటం
స్వతంత్రం తేవాలని ఆరాటం!

శాంతియుతం అతని బాట
సత్యాగ్రహమే అతని నోట
మంచి మార్గం అతని వేట
నడవాలందరం అతని వెంట!

ఖద్దరు బట్టలు వాడు తీరు
అతను ఓపికకు పెట్టింది పేరు
ఒక చెంపై కొడితే రెండో చెంప
చూపించు తీరు !

పోరు బందరులో జన్మించే
చదువు ఎంతో సాధించే
డిగ్రీ పట్టాలనే తాను పొందే
నేటి భవితకు ఆదర్శంగా నిలిచే!

రాట్నాలను తాను వడికే
నేత వస్త్రాలు ధరియించే
తెల్లవాడిని ఎదురించే
శాంతియుత పోరాటం సాగించే

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *