మధ్య తరగతి మహా కరోనం

తలుపు సప్పుడు అయ్యింది. ఎవరూ? ఎవరూ? అన్నాడు చిన్నోడు, అరెయి ఎవరో సూడచ్చు కదార అన్నాడు పెద్దోడు. అరె నీ బయట ఎవడున్నాడో ఏమో, ఎట్లా తెలుస్తది. ఎవడో వచ్చి ఏమేసి పోతుండో అరె బాబు ఎవరొస్తారు రా మన అపార్ట్మెంట్ లకు కింద వాచ్ మెన్ అడుగుతాడు కదా ఎవరని, అయినా బయట వాళ్ళని ఎవర్నీ రానిస్తలేరు కదా, ఈ కరోనల ఎవరో సూడు ముందు అనగానే చిన్నోడు పోయి తలుపు కొద్దిగా తీసి చూసాడు, అప్పటి లోపు వాచమేన్ రమణ కాగితాన్ని గోళ్లేనికి పెట్టేసి వెల్లుపోతున్నాడు. అది ముట్టుకోకుండా ఏంది రమణ అని అన్నాడు చిన్నోడు. హ సర్ ఆదా మెంటనెన్స్ కట్టుమని ఆఫీసోళ్లు కాగితం పంపిడ్రు సర్ అని చెప్పి, వెళ్లిపోయాడు రమణ, ఆ కాగితాన్ని కటింగు ప్లేయర్ తో తీసుకుని, సానిటైజర్ రాసి, తీసి చదివాడు పెద్దోడు, అగొ నేను అంటనే ఉన్న, మీరు వినకపోతిరి ఇప్పుడు కట్టుమని కాగితం పంపే దాకా వచ్చే ముచ్చట అంది అమ్మ కోపంగా, అగొ కట్టుమని అంటే ఏడ నుంచి కట్టాలి, పోయిన నెల వచ్చిందే సగంల సగం పెన్షన్ నీకు నాకు అయితే జీతం కూడా రాకపోయే, వాడు జీతం చెయ్యిమని అంటే లంచం అడుగవట్టే, ఏడ నుండి తేవాలి ఆ పైసలు కూడా, అరెయి అది కాదు మొన్ననే ఉన్న దాంట్లోనే ఆరువందల యాభై కడితే అయిపోతుండే, మీరే కట్టలేదు ఇప్పుడు మళ్ళా ఎంత అడుగుతాడో ఫైన్ అన్నది అమ్మ, పెద్దోడు అబ్బా  ఎంతనే యాభై రూపాయలు గంతే అన్నాడు. ఆ మీకు గంతనే అనిపిస్తది. ఆ యాభై రూపాయల నాకు కూరగాయలకో, పాలకో అయితాయి. పెద్ద సంపాదించినట్టే చెప్తున్నావ్, అవే యాభై రూపాయలు పాలు తెచ్చుకుంటే మీ అక్క ఆ పాలను వారం రోజులు చేస్తాది బిడ్డ అంది అమ్మ,కొంచం గర్వంగా అనిపించింది.

మళ్ల గంతలనే గా రేషన్ కార్డ్ అన్నా సంపాదించుకోకపోతివి కదనే, మంచిగా పదిహేను వందలు వస్తుండే గి కష్ట కాలంల, మనకు ఏమి లేకపోయె పెన్షన్ వస్తది అని గా పింక్ కార్డ్ కూడా తీసేషిరి, ఇప్పుడు గా పదిహేను వందలు, వంటరి తల్లి అని పైసలు ఇస్తారట అవి అయిన వస్తుండే నువ్వు ఏమో పోక పోతివి అంది. అబ్బా అమ్మా గట్లాంటావు ఎన్ని రోజులు తిరిగిన చెప్పు, తిరిగి, తిరిగి చెప్పులు అరిగిపోయే, అయినా ఆధార్ కార్డ్ కోసమే నెల తిరిగిన లాస్ట్ కు ఎట్లనో వచ్చింది.దానికే సంతకం సరిపోలే అని,ఫోటో మంచిగా రాలేదని,వేలిముద్రలు సరిపోలేవు అని మస్తుగా తిప్పిoడ్రు,అయినా పట్టు పట్టీ ఆధార్ అయితే తెచ్చుకున్న కానీ రేషన్ కార్డ్ కోసం కూడా మూడు నెలలు తిరిగి,తిరిగి చెప్పులు అరిగిపోయే అయినా రాలె, ఇగో మన అపార్ట్మెంట్ ప్రెసిడెంటుకూ ఎంత ఆస్థి, పైసలు ఉన్నా కూడా అయన  రేషన్ బియ్యం తెచ్చుకుని అమ్ముకుంటుండు, మరి మాకన్నా ఇస్తే ఎంత మంచిగా ఉంటుండే ,ఇగ ఊర్లో ఉన్నదని అనుకుంటే ఊర్లో ఉన్న ఓటు కూడా తీసేశీండ్రు,గీడ నే ఎయ్య వడ్తిమి అన్ని ఆయినా ఆడోళ్ళు అన్నింటి లో ముందు ఉండాలని అంటారు కాదనే గా రేషన్ కార్డు కూడా తెచ్చుకోలేరా అన్నాడు  పెద్దోడు.

అబ్బో పెద్ద మొగోడు మరి పో రా పోయి నువ్వు తెపో సూద్దాం అన్నాను నేను, అరె బిడ్డ అది కాదు నువ్వు అక్క తోని తిరిగి దానికి ఆ రేషన్ కార్డు ఇప్పిస్తే అయినా తల్లి కొడుకులకు కష్టం కాదు అంది అమ్మ సoదాయింపుగా సరే తియ్యి గని ఇప్పుడెం చేద్దాం చెప్పుండ్రి అన్నాడు పెద్దోడు.ఏమో ఎం చేస్తారో ఏమో కానీ ఇప్పుడు ఇల్లు లోన్ కూడా కట్టాలి, రెండు,మూడు నెలలు కట్టకున్నా సరే అని వాడెవడో అనుడు కాదు మనం కట్టక పొతే మనకే మల్ల ఫైన్ పడతది, అవి ఎట్లనో కట్టండి అంది అమ్మా..

ఓ అమ్మా నువ్వు కట్టుమని అంటున్నావు కానీ మేము కట్టము అని అంటలేము,కానీ పైసల్ ఎడున్నాయే తల్లి వచ్చిన పన్నెండు వేలలో అన్ని పైసలు బియ్యానికి, కురగాయలకే ఖర్చు అయినాయి, అందుల మళ్ళా అన్ని పైసలు పెట్టి తెచ్చుడే, కిరానా షాప్ వాడు ఇప్పుడు ఉద్దేరా ఇయ్య అని అన్నాడు,వాని దగ్గర లేని కొన్ని నేను బయట తెచ్చిన వాటికీ కూడా పైసలు అయిపోయినాయి, కరెంటు బిల్లు,కూ నీళ్ళాకూ ఇచ్చిన వాడు రేటు ఎక్కువ చెప్తుండు అన్నింటికీ అన్ని బాగా ఎక్కువచేసిండు,ఇగ రెండు,మూడువందలేఉన్నయి.ఇంకా టీవీ కి కూడా ఇచ్చిన,ఇంకేం ఇయ్యాలి,నాకు జీతం రాలేదనే కదా నువ్వు కడుతున్నవా అని అంటున్నావ్ అన్నాడు చిన్నోడు అరేయి నిన్ను ఎవ్వరు అన్నర్రా  ఇప్పుడు ,అవును నువ్వు నన్నే అంటున్నావు, నాకు తెల్సు, వాడేమో ఆఫీస్ కూ రమ్మని అంటాడు .ఇడ పొనికి ఏమి లేవు నా దగ్గర బైక్ కూడా లేదు.పోదాం అంటే అందరూ నా మీదనే ఏడుస్తారు. గవర్నమెంటు ఉద్యోగం అని, పైసల్ బాగా వస్తాయి అని  ఏడుపు మా అయ్యా ఉద్యోగం రానికే యాబై రూపాయల నుండి లక్ష దాక లంచం పెట్టినం, కనీసం అవి కూడా రాలేవు, దానికి చేసిన అప్పునే ఇప్పటికి కడుతున్న, ఇగ నా తిండికి, కిరయిలకు కావాలి, రోజు నూట ఇరవై కిలోమీటర్లు పోయి వచ్చేది ఎవడు సుడదు, నెల కంగానే జీతం వస్తది అంటారు అది రానికే నేను వాని సుట్టు తిరగాలి, వాణ్ణి జీతం చేయ్యిమంటే వాడు తాగిపియ్యి, తినిపియ్యి అంటడు సగం వాని  తాగుడు, తిండికీ పోతది, ఇంకా సగం అప్పులకు పోతది, ఉన్నా దంట్ల నేను పోవాలె, రావలె, ఏడ నుండి తేవలేనే అని, ఇగో ఇప్పుడు రమ్మని అంటుండు నేను ఎట్లా పోవాలి దేక్కుంట పోవలనా, పోయినా కూడా అడ ఉండనికి జాగా లేదు, వండుకుని తిననికి పైసల్ లేవు ఎం చేయమంటావు చెప్పు అన్నాడు చిన్నోడు, అరేయ్ ముచ్చట ఏడ నుండి ఏడికి పోతుంది రా బాబు, నిన్ను అనంగానే సాలు ఇగ అన్ని ఒర్రుతావు అన్నాడు పెద్దోడు చిన్నోన్ని, ఇగో సుడుర్రి మంచిగా చెప్తున్నా బాకిలు అన్ని కట్టుకోవాలె అని ఆంది అమ్మ, అరె మల్ల గదే మాట మాట్లాడుతవ్, ఇగో అమ్మా నువ్వు లొల్లి పెట్టకే పెన్షన్ వచ్చిందే పన్నెండు వేలు కట్టక పొతే సస్తమా ఏంది? కడుతం, కాకపోతే కొంచం లేట్ గా కడుతం, ఇప్పుడు తొమ్మిది వేలు కడుతున్నాం అప్పుడు పది వేలు కడుతం అన్నడు పెద్దోడు అబ్బా  కడుతదంట కడుతాడు ఏడ నుండి తెస్తావు అంది అమ్మా, వాడు మొఖం అదోలా పెట్టిండు, అది చూసి అబ్బా అమ్మ ఉకోవే వన్నెం అంటున్నావు అన్నాను నేను, అరేయి పెద్దోడా బిడ్డా భాధ వడకు, ఇగో ఊర్లో ఉన్న ఇంటి మిద ఉన్న అప్పు కట్టనికి నీ జీవితం తాకట్టు పెట్టినవ్ బిడ్డా అంది అమ్మా, అమ్మ కట్లో నిల్లు చుసిన మాకు కూడా ఏడుపు అచ్చింది, ఇగో ఎడ్వ కుర్రి గని అమ్మా జరా నవ్వే అన్నాడు పెద్దోడు అరె గట్లనే గని, ఇగో చిన్నోడా మటనో, చికేనో తెస్తావా బిడ్డా ఆరేళ్ళు అయ్తుంది తిని, నాలుక రుచి లేదు బిడ్డ అంది అమ్మా, ఇగో ఓ అమ్మా గిప్పుడు గా చికెన్, మటన్ తినకపోతే ఏమితదే, ఎమన్నా సస్తామా,తింటేనే సస్తం గని, వాడు ఏడ తెస్తాడో, ఏమో, ఏమి పుస్తాడో, ఉమ్ముతడో, వద్దే అమ్మా, నీకు దండం పేడత అన్నాడు పెద్దోడు అయ్యో బిడ్డ పెడ్తే పెద్తివి గని వద్దుతి, నా కోసమా బిడ్డా అందరం తినటం కదా అని తెమ్మంటి, అవునే అప్పులు కట్టనికే పైసల్ లేవు అంటివి ఇప్పుడు గీ చికెన్ కి మటన్ కి ఏడ నుండి వస్తాయి మరి అన్నాడు మల్ల వాడె, ఏముంది బిడ్డా ఇన్ని రోజులు ఎట్లా చేసినామో ఇప్పుడు గట్లనే అంది అమ్మ, ఇందే అది అన్నాడు వాడు….,

ఇగో ఆర్నెల్లకో, మూడునెలలకో చికెన్, మటన్ తెచ్చుకుంటిమె అనుకో, నేను మందులు, తెచ్చుకోను, గట్లనే ఇంట్ల కూరగాయలు, పాలు తెప్పియ్యతమ్మునికి ఒక చిన్న పాకెట్ తెచ్చి వనికోసమే చాయి పెడతాం, అక్క నేను బుచ్చోడు తోక్కేసుకుని తిని, మీకోసం కూర చేసి పెడతాం, ఆ మిగిలిన పైసల తోని చికెన్ పైసల లోతు ని పుడుస్తం అంది అమ్మా, అబ్బా అమ్మా మా కోసం ఇన్ని రోజులు మీరు ఇట్లా చేసిండ్ర ఆనందు చిన్నోడు, అవు బిడ్డ ఇగో మనకు ఎవరూ లేరు మంచిగా ఉండాలి అందరితోని, మన పని అయ్యేదాకా అందర్తోని మంచిగా మాట్లాడి, మంచి పెరు తెచ్చుకోవాలి, ఎవరేమన్నా పట్టించుకోవద్దు అన్నది అమ్మ, ఇంతలో చిన్నోని ఫోన్ మోగింది హ సర్, సర్, సర్ మంచిది సర్ వస్తా సర్ అని నoగి, నంగి గా ఫోన్ మాట్లాడి పెట్టేసి నీ యవ్వ ఎం ఉద్యోగమో ఏమో, తూ ని యవ్వ నా జీవితం పాడు గాను  బానిస బతుకయ్యింది నాది అన్నాడు. మళ్ళా ఏమయింది రా ఇప్పుడే పోను అంటివి కదా అన్నాడు పెద్దోడు. హ ఏవో లేటర్లు కొట్టలే అంట, అర్జెంట్ గా రమ్మని అంటుండు, బైక్ లేదని చెప్తే నేనే వచ్చి పిక్ అప్ చేసుకుంటా అంటుండు, చేసుకొని తీసుక పోతాడు, కానీ మల్ల పోయేటప్పుడు చెప్పాడు, ఒకసారి గట్లనే చేసిండు పోదాం, అగు అని రాత్రి పది గంటల దాక పని చేయ్యిమన్నాడు, ఆయన ఎనిమిది గంటలకు బయటకు పోయిండు, నేను మల్లా వస్తాడు అని అనుకుంటే పది గంటలకు ఫోన్ చేసిన అయ్యో నేను వచ్చేసిన హైదరాబాద్ కి అన్నాడు, ఇగ అ రాత్రి నా గోస ఎవరికీ చెప్పుకోవాలె, తిండిలేదు, నిద్రలేదు, ఆఫీస్ ల ఒక్కన్ని  అయినా, అప్పుడు బస్ లు నడిశినాయి కాబట్టి ఇంటికి వచ్చిన……

అగొ గప్పుడే మూడో రెండో అయ్యింది టైం, ఇప్పుడు కూడా నన్ను వదిలేస్తే ఎట్లా అనేదే నా భాధ ఆఫీస్ ల పనిల పడ్డాక నాకు యాదికి ఉండది, అయన పొతే కష్టం, అడ ఎవడు లేడు, సుట్టాలు కూడా రానియ్యరు, దోస్తులు లేరు, పైసలు వెట్టి హోటల్ లా ఉందాం అన్నా పైసలు లేవు, పోలిసుల గొడవ ఉంటది ఇవన్ని అలోచిస్తే, అసలు పోబుద్ది ఆయిత లేదు, మల్ల అయన కార్ ల ఎక్కుటే, అయన ఏడికి పోయిండో ,ఎవర్ని ముట్టుకుండో  అన్నాడు భయం గా, అరేయి నువ్వు మరి మాట్లాడ్తావ్ అయనకూ ఉండదా జాగ్రత్త, అన్నాను నేను హ ఉంటాదే అక్కా నీకు తెల్వదే బయటకు పొతే ఏదోటి మాట్లాడాలి, ఏవరో ఒకళ్ళను కలవాలి, వాళ్ళ తోని కూసోని తినాలి ఒక వేల తింటే, అయినా ఆయనకు సుట్టాలు, దోస్తులు మస్తు మంది ఉన్నారు, అర్సుకోనికి, మనకెవరు ఉన్నారు, ఆయనకు ఎమన్నా అయితే సుపియ్యనికి మంచి దావఖానల సుపిస్తారు. పైసా పెడ్తే మంచి వైద్యం దొరుకుతది, మనకేవాడు పెడతాడు పైసా, మామో అయిదుగురం మనకు మనమే ఉన్నాం, సుట్టలు పెడ్తే పెళ్లి కోరతారు, లేకుంటే సావు కోరతారు, పేరుకె గొప్ప మనం మనకేం లేదు, మన అయ్యా సంపాదించిన ఆస్తులు లేవు,

నీ తాత దాసిన ఖజానా ఏమి లేదు ఇక్కడ అందుకే గింత భయం అన్నాడు వాడు, నిజమే కానీ మన జాగ్రత్తలో మనం ఉంటె సాలు అన్నాను నేను, ఆవు ఉంటాం గని రాత బాగాలేకుంటే తాడే పామయ్యింది అంట అన్నాడు, మరేట్లారా? అన్నింటికీ అన్ని చెప్పవడ్తివి, పొతే పో, లేకపోతె ని ఇష్టం అని ఊరుకున్నా నేను, ఈ పోవే బొచ్చు ఉద్యోగం కంపెనిల చేసుకున్న ఎవనికి భయపడేది ఉండది, ఎవనికి అణిగి ఉండాల్సిన పని లేదు, ఇష్టం ఉన్న నాడు పోతా, లేకుంటే ఇంట్ల పంట, అడ ఎవని కళ్ళు మొక్కే పని ఉండది, ఎవని సంక నాకే పని ఉండది, జీతంకోసం తినిపిచ్చుడు, తాగించుడు ఉండది, హైగా ఒకటి కాకుంటే ఇంకో కంపెనిల చేసుకోవచ్చు, ఇదేంది పని ఇష్టం లేకున్నా సచ్చినట్టు పోవాలె, జీతంల కోత కోశిన ఏమి అనొద్దు, వనికి వంగవడి పని చేయాలి అన్నాడు నిసృహగా, ఇగో చిన్నోడా మంచిగా చెప్తున ఇను బిడ్డ

అది మీ అయ్యా సచ్చి పొతే వచ్చిన ఉద్యోగం, గోవేర్నమెంటు ఉద్యోగం రావాలంటే పెట్టి పుట్టాలి, నికేదో వచ్చింది బిడ్డ, ఇగో గిప్పుడు గట్ల అనిపించినా తర్వాత అంతా మంచిగానే అయితది బిడ్డ ఉద్యోగాన్ని ఇదిషి పెట్టకు, పెళ్లి అయినంక నికే అంతా మంచిగా అయితది అంది అమ్మా, అబ్బో మరి ఇప్పుడు నీ కొడుక్కి పిల్లని ఇయ్యనికి క్యూలు కట్టిండ్రే మరి, మల్ల మాట్లాడ వట్టె, గవర్నమెంట్ ఉద్యోగం అంటేనె అడ పిల్లలు దొరకుత లేరు, అందరికి సాఫ్ట్వేర్ వల్లే కావాలంట, మీదనుండి నీకు పెన్షన్  వస్తదా అని అడుగుడు ఒకటి అన్నాడు దాదాపు ఏడుపు గొంతుతో, సరే గని ముచ్చట ఎడికో పోతున్నది గని ఇగో వంట అయ్యింది అమ్మా అన్నం, పప్పు చారు రండి తిందురు అని పిలిచాను నేను

ఇగో చిన్నోడా నీ ఇష్టంరా ఇగ, చెప్పింది చెప్పిన, నీ జాబు నీ ఇష్టం అని అంది అమ్మ, అమ్మా మరి బ్యాంకు లోన్ కోసం ఏమి చేద్దాం అని అడిగాడు పెద్దోడు, హ ఏముంది బిడ్డా ఉంది కదా మన కల్పవృక్షం, పాపం మీ అయ్య ఏ జమానాలో చేపిచ్చిండో కానీ మనకు కష్టం వచ్చినప్పుడల్లా ఆదుకుంటుంది గదేగా గొలుసు, మల్ల మార్వాడి దగ్గరికి పోయి అది పేట్టి నాలుగు తులాలకు ఎంత వస్తాదో, మిత్తి పట్టుకొమ్మని, పైసల్ తెచ్చుకోవాలె, కట్టుకోవాలె, గీ కష్ట కలంలా ఎట్లనో బతకలే బిడ్డా, మన మధతరగతి వారికే ఇవ్వన్ని బేషజాలు, ఆత్మాభిమానం, సచ్చినా సస్తారు కానీ ఎవర్ని ఏమి అడుగరు, సచ్చి పోతున్నా కూడా మనం ఒకళ్ళ ముందు చేయి చాచం, తినో, తినకనో, కష్ట పడలే, ఏది అయినా నాలుగు గోడల మధ్యనే ఉండాలే గంతే అంది అమ్మా, అవును ఇంకేం చేయగలం అన్నాడు చిన్నోడు పోతతి గని నువ్వు ఒర్లకే అన్నాడు వాడు, అవును నిజమే మధ్య తరగతి వారికీ ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఒకరి ముందు చేయి చాచి అడగరు, వారికీ లేకున్నా పక్క వారికీ సహాయం చేయాలనీ చూస్తారు, కొటిశ్వరుడికి లేని మంచి హృదయం మధ్య తరగతి వారికీ ఉంటుంది అని అనుకున్నా మౌనంగా, ఇంతలో మైక్ లో ఎదో చెప్తున్నారు అదేందో ఇనుండి అన్నది అమ్మ. అబ్బ ఏమి లేదే కూరగాయలు అచ్చినాయి అని అంటుండు  అన్నాడు  పెద్దోడు అరేయి చిన్నా పోయి మామిడి కాయలు తీసుకోని, ఇంత కారం, ఆవాలు, మెంతులు తెపో అయిన కర్చు అయ్యింది ఇగ గిది ఒక్కటి పెట్టుకుంటే, కూరగాయలు  తెచుకోకున్నా వాన కాలంల తోక్కేసుకుని తిందాం, అంది. సరే పోతున్న గని మీరు అందరూ లోపలికి పొండి, బయట ఎవరూ ఉండొద్దు, అరేయి పెద్దోడా బయట నీళ్ళ బకిటు పెట్టు, నేను ఫోన్ చేసినాక తలుపు తియ్యి అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి, వాడు మామిడి కాయల కోసం బయటకు వెళ్ళాడు. ఇగో ఎంత చెప్పినా ఇది ఒడ్వధి, తెగని మధ్య తరగతి  మహా భారతం మధ్య తరగతి మహా కరోనం, కరోన వల్ల లోన్లు కట్టుకొని వారి లొల్లి ఇదే ….

Related Posts

1 Comment

  1. వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *