మనకు ఎంత అహంకారం..భూమిపైన ఉంటూ

శీర్షిక
విశ్రాంతి తీసుకుంటున్నారేమో.

బ్రతికుంటే భూమిపైన ఉంటూ
ప్రపంచమంతా మాదేనంటాం.
చనిపోతే ఆరడుగులు నేలలో సమాధై విశ్రాంత తీసుకుంటాం.
మనకు ఎంత అహంకారం.
బ్రతికున్నప్పుడు విర్రవీగుతాం.
తీసుకెళ్ళేదేమీ లేదని తెలిసినా
అన్నీ కావాలి అంటుంటాము.
పుట్టినరోజు తోడెవరూ రారు.
పోయేటప్పుడూ తోడు రారు.
ఆ విషయం తెలిసినా కూడా తెలియనట్టే ఉంటుంటాము.
శ్మశానంలో సమాధులన్నీ
మన లాంటి మనుషులవే.
ఉన్నన్నాళ్ళు ఆనందంగా
అందరితో మనం,అందరికోసం మనం కలసిమెలసి జీవిద్దాం.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *