మనసులో పూస్తూనే ఉంటాయి

మనసులో పూస్తూనే ఉంటాయి

మనసులో పూస్తూనే ఉంటాయి

                                   ఒక చిన్న ఊరిలో అనన్య అనే అమ్మాయి ఉండేది. ఆమెకు గులాబీలు అంటే ఎంతో ఇష్టం. కానీ , అందరూ ఎరుపు, తెలుపు గులాబీలను ఇష్టపడితే... ఆమెకు మాత్రం నల్ల గులాబీలంటే ప్రాణం.

ఒక రోజు ఆమె స్నేహితుడు ఆర్యన్ ,
“అందరూ రంగుల పూలను ఇష్టపడుతుంటే… నువ్వెందుకు నల్ల గులాబీలు ఇష్టపడుతున్నావు?” అని అడిగాడు.
అనన్య చిరునవ్వుతో…
“రంగుల పూలు ఆనందాన్ని చెబుతాయి. కానీ , నల్ల గులాబీలు మనసులో దాచుకున్న కథలను చెబుతాయి” అంది.
కొన్ని రోజుల తర్వాత ఆర్యన్ ఉద్యోగం కోసం దూరంగా వెళ్లిపోయాడు. రోజులు గడిచాయి. నెలలు మారాయి. కానీ , అతను తిరిగి రాలేదు.
ఒక రోజు అనన్య ఇంటి ముందు ఒక చిన్న పార్సెల్ వచ్చింది. తెరిచి చూస్తే అందులో ఐదు నల్ల గులాబీలు. వాటితో పాటు ఒక చిన్న చీటీ.
“కొన్ని బంధాలు మాటల్లో కాదు! మౌనంలో బ్రతుకుతాయి.”
ఆ చీటీ చదివిన అనన్య కళ్లలో నీళ్లు మెరిశాయి. ఆ రోజు ఆమెకు అర్థమైంది.
నల్ల గులాబీలు దుఃఖానికి గుర్తు కాదు! మనసులో ఎన్నటికీ చెదరని జ్ఞాపకాలకు గుర్తు.
అప్పటి నుంచి ప్రతి సాయంత్రం ఆమె ఆ గులాబీలను చూస్తూ, మౌనంగా ఒక చిరునవ్వు నవ్వేది. ఎందుకంటే… కొన్ని ప్రేమలు ముగియవు. అవి మౌనంగా మనసులో పూస్తూనే ఉంటాయి.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *