మనిషిగా బతుకుటకు…!!!

 

మనిషిగా బతుకుటకు…!!!

పల్లవి :——

పయనించే మానవుడా
ఎందాకా నీ ప్రయాణం…
ఎవరి కోసమో ఈ త్యాగం
ఆలోచించావా ఒక్కసారైనా….

చరణం :——

కూయని కోయిలలకు మానై
నిలిచిన ఈ సంఘం మానవత్వానికి
నీరీయదని….
బరువెక్కిన బతుకును మోయుటకు
ఆదెరువునకై వెళుతున్నావా…
బిక్క ముఖాలఆ పసిమొగ్గను
ముందు తరాలకు ఆదర్శం కావాలని అడుగేస్తున్నావా…

చరణం :——

మౌనం…చెప్పని పొరపాటని
ఊహలు వినికిడి చేయని విషధ్వేషాలకు నిలయమని…
కొలిమి గాల్చిన బతుకులతో గుండెకైన
గాయాలన్నో కనిపించక పోయినా…
ఆదరణ చేయని సమాజం వంచనేనా…

చరణం :——

బతుకు తియ్యధనాలను బానిసగా
చేయలేక…
దేహాన్ని కప్పలేని చిల్లుల వస్త్రమైనా…
కూలిన కోటలతో అడుగుల నెంచక…
గమ్యం పూజితమని ఓపికను
నడిపిస్తున్నావా వంశాంకురానికై….

చరణం :——

వెనుదిరగని సహనంతో
ఓర్పును వ్యూహ రచన చేసుకొంటు
కాలం యథేచ్ఛను వేయి చీలికల
గుణాలతో బంధించక…
చిత్తం చేసిన మనిషివై సాగిపోతున్నావా
మనిషిగా బతుకుటకు…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *