"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

మనిషిగా మిగిలిపోతావు

మనిషిగా మిగిలిపోతావు…!!!

తెగిపోయిన బంధం…
తెరచాపలేని ప్రయాణం ఒక్కటే
ఆ బంధం అతుకుపడుతుందో లేదో
ఈ ప్రయాణం తీరం చేరుతుందో లేదో…
తెలియని వింతగా జీవితం ఒక నటనే…

ఉప్పెనలు ఊపిరిలు పోయవు…
నీటంచున స్నేహం గూడుకట్టదు…
తడి ఆరని రెక్కలతో నిరంతర మధునం
సుడిగుండాలకు సూత్రమవుతు…
ఉదయించే అగ్ని గోళాన్ని తాగుతు…
ఆవిరవుతున్న ఉప్పునీటి బతుకది…

ఎగసిపడే అలల సోపానాలు
సమ్మోహనాలు కావు…అవి తమను
తాముగా తీర్చిదిద్దుకొనే ప్రయత్నమే…
నీలో దాగిన పక్షపాతాన్ని నిలువునా
చీల్చుతు…ఆశయాల చిగురింపునకై
సాగరమంతటి ఔన్నత్యాన్ని కదలించు
తరాలు చెప్పుకొనే మనిషిగా మిగిలిపోతావు…

ప్రేమించడం కరుణా క్షమా వంటి
మానసిక ఒప్పందాలతో మెరుగుపడుతు
సమాజమనే నువ్వు చదివే పుస్తకంలో
ప్రతి పేజీలోని అంతరార్ధాన్ని విషదీకరిస్తు
నేర్చిన జ్ఞానం కొండంతది కాకపోయినా…
అందరి శ్రేయస్సుకై ఉపయోగించు…

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *