మనిషి నైజం

అక్షర కొరకు
అంశం :⁠- ఏది మోసం ఏది నిజం(చిత్ర కవిత)
తేది:⁠- 03/10/2026
కవితసంఖ్య:⁠- 44
శీర్షిక:⁠- మనిషి నైజం
@@@@@@@@@@@@@@@@@

జీవితంలో ఏది మోసం
ఏది నిజం అనేది మనిషి ప్రవర్తన
మాటలు మరియు చేతల ద్వారా స్పష్టమయ్యేను
కష్టంలో వెన్నంటి నిలిచేది నిజమైతే
కనిపించే రూపాలు మార్చి వెన్నుపోటు పొడిచేది
మోసానికి నిదర్శనం
మనుషులు నవ్వుతూ పైకి పొగుడుతారు
ఆ నవ్వును మన మంచికే అని మోసపోయేది కొందరు
కానీ ఆ నవ్వు వెనక మోసం ఎంతో ఉంది
పైకి మాట్లాడతారు వెనక నుండి వెన్నుపోటు పొడిచే
ఇది మానవ నైజం
మనల్ని దండించే వారి దగ్గర ప్రేమ ఉంటుంది
మనల్ని పొగిడే వారి దగ్గర మోసం ఉంటుంది
ఏది నిజం ఏది మోసం అనేది తెలుసుకోవాలి
సమాజంలో రకరకాల మనుషులు ఉండే
ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చదు
వారి వారి ఇష్టాలపై ఆధారపడి
మన మంచికోరేవారిని తెలుసుకోవాలి
మన చెడు కోరేవారిని గ్రహించాలి
అందుకు ఏది మోసం ఏది నిజం అని మనిషి తెలుసుకొని బ్రతకాలి…

డా. సరికొండ రమాదేవి
హామీ పత్రం :⁠-

                 ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *