మమతల కోవెల అమ్మ

ఈ రోజు అంశం
బంధం విలువ

శీర్షిక
మమతల కోవెల అమ్మ

మరువలేనిది
పేగు బంధం,
మరచిపోలేనిది అమ్మ ప్రేమ.
కష్టాలన్నీ తనలో దాచుకొని,
సంతోషాలను పంచేది అమ్మే.
అమ్మ ఒడిలో ఆప్యాయత ఉంటుంది,
అమ్మ చూపులో అనురాగం ఉంటుంది.
మన కష్టాల్లో
మనల్ని మనసారా ఓదార్చేది అమ్మే.

మన కడుపు
నిండితే తన కడుపు నిండిందని భావించేది అమ్మే.
మన కలలు
నెరవేర్చేందుకు
తన నిద్రను త్యాగం చేసేది అమ్మే.
బాధ కలిగినప్పుడు అండగా నిలిచి,
ఆపద వచ్చినప్పుడు రక్షణగా మారి,
ప్రతి అడుగులో ధైర్యం నింపి,
ముందుకు నడిపేది అమ్మే.
అమ్మ మాటలు
కమ్మనైన గీతాలు,
అమ్మ దీవెనలు మన విజయానికి మెట్లు.
అమ్మ హృదయం కరుణకు నిలయం.
అమ్మ త్యాగం జీవితానికి ఆదర్శం.

అమ్మ ప్రేమకు హద్దులు లేవు,
అమ్మ మమతకు అంతే లేదు.
కాలం మారినా, పరిస్థితులు మారినా,
అమ్మ ప్రేమ మాత్రం మారదు.

ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నా,
అన్నింటికన్నా గొప్పది అమ్మ ప్రేమ.
జీవితాంతం మన వెంట నిలిచే,
మరువలేని బంధం అమ్మ ప్రేమ.
అలాంటి అమ్మ
లేని లోటు
తీర్చలేనిది.
ఉన్నప్పుడు తెలియదు
అమ్మ విలువ.
వెళ్ళిపోయాక
వగచి లాభం
లేదు.
అమ్మ ఉన్నప్పుడే
ఆమెను ప్రేమతో
కాపాడుకుందాం.

ఈ రచన నా రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *