మలుపు

 

కిషోర్ కు మధుకు ఆ రోజే పెళ్లి జరిగింది ఆ రోజు రాత్రే వారి శోభనం కూడా కానీ కిషోర్ కు ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు అతను లావణ్య అనే అమ్మాయిని ప్రేమించాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు కానీ అతని తల్లిదండ్రులు మధుని ఇచ్చి చేసారు తల్లి చనిపోతాను అని బెదిరించడంతో ఇక తప్పక మధుని పెళ్లి చేసుకున్నాడు కానీ మనసులో మాత్రం లావణ్య నే ఉంది అతనికి చాలా చిరాగ్గా ఉంది. పెళ్లి అంటేనే ఇష్టం లేని వాడు ఇక శోభనం అంటే చిరాగ్గా ఉండక ఏమవుతుంది. ఇంతలో మధుని తెచ్చి గదిలో వదిలి వెళ్ళారు అమ్మలక్కలు మధు సిగ్గుపడుతూ రూమ్ లోకి వచ్చి గడియ పెట్టి కిషోర్ కి  పాల గ్లాస్ ఇచ్చింది.

కిషోర్ ఉన్న కోపం మొత్తం గ్లాస్ మిద చూపిస్తూ దాన్ని విసిరి కొట్టాడు. దానికి భయపడిన మధు ఏమి మాట్లాడకుండా వెళ్ళి మంచం మీద ఓ పక్కగా పడుకుంది. అది చూసినా కిషోర్ మధు దగ్గరికి వెళ్ళి ఏంటి పడుకున్నావ్ ఎందుకు గ్లాస్ విసిరేసానో అడగవా అన్నాడు కోపంగా ఆ మాటకు లేచి కూర్చున్న మధు కిశోరే వైపు చూస్తూ అది మీ గ్లాస్ ఇది మీ ఇల్లు మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకునే హక్కు అధికారం మీకు ఉంది నాకేంటి అని మళ్ళి పక్కకు తిరిగి పడుకుంది మధు.

తనని కనీసం పట్టించుకోకుండా అనాల్సిన మాటలన్నీ అని మళ్ళి పడుకున్నా మధుని చూసి ఇంకా కోపం వచ్చి చుట్టూ చూస్తూ తీసి పారేయ్యాడానికి ఏమి లేక ఏమి చెయ్యలో తెలియక గోళ్ళు కొరుకుతూ కూర్చున్నాడు. మధు ఇదంతా కనురెప్పల కింద నుండి చూస్తూ నవ్వుకుంది. మధుకు అత్తామామలు అన్ని విషయాలు  ముందే చెప్పడం కొన్ని రోజులు అయ్యాక వాడె మారతాడులే అని హామీ ఇచ్చారు. దాంతో అతను అంత కోపంగా ఉన్నా పట్టించుకోలేదు మధు. అలా కొన్ని రోజులు గడిచాయి అయితే కిషోర్ ప్రేమించిన లావణ్య మాత్రం ఇంకొక అతన్నిమంచి ధనవంతున్ని పెళ్లి చేసుకుని అమెరికా  వెళ్ళిపోవడం తో అతను ప్రేమ మత్తులో నుండి కొద్ది కొద్దిగా బయటకు వచ్చేసాడు.

కానీ కిషోర్ మధు తో సరిగ్గా మాట్లాడక పోవడం ఎన్ని రోజులు అయినా అతను మారక పోవడంతో మధుకి అతని మిద కోపం,చిరాకు పెరగసాగింది.  అతని పై ఉన్న ప్రేమ జాలి కూడా తగ్గిపోతూ ఉంది. అతను మారతాడు అని చాలా రోజులు ఎదురుచూసింది.  కానీ ఇప్పుడు అతను మారక పోవడoతో ఆమెకూ ఓపిక తగ్గిపోతూఉంది .కానీ ఆ విషయాన్నీ ఎవరూ గుర్తించడం లేదు.

ఇక కిషోర్ కూ లావణ్య అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని స్నేహితులు చెప్పడం తో అసలు నమ్మలేదు కానీ వాళ్ళు అన్ని ఆధారాలు చూపించారు. ఎక్కడో  లావణ్య మీద ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా పొయింది కిషోర్ కు అన్ని రోజులు తన భార్యని ఎలా దూరం పెట్టింది. తను ఎన్ని విధాల తనకు దగ్గర కావాలని చూసిన తను ఆమె మాట వినకుండా అసలు ఆమెని ఒక మనిషిలా కూడా చూడకపోవడం టిఫిన్  పెట్టినా ,అన్నం పెట్టినా తినక పోవడం మధుని కావాలని అవాయిడ్ చెయ్యడం తల్చుకుని కిషోర్ చాలా బాధ పడ్డాడు.

వెంటనే వెళ్ళి మధు కూ క్షమాపణలు చెప్పాలని బైక్ మీద వెళ్ళసాగాడు. కొంచం దూరం వెళ్ళాక ఎదురుగ వేగంగా  వస్తున్న ఒక లారి వచ్చి కిషోర్ బైక్ ని గుద్దింది కిషోర్ తలకు హెల్మెట్ లేకపోవడం అది వేగంగా వచ్చి గుద్దడం వల్ల అతను ఎగిరి వెళ్ళి అక్కడెక్కడో పడిపోయాడు. అలా ఎగరడం లోనే అతనికి హార్ట్ అటాక్ వచ్చిఅక్కడికికక్కడే చనిపోయాడు.

*********

కిషోర్ లేచి పరుగెత్తుకుని వెళ్ళాడు మధు వద్దకు వెళ్ళి మధు మధు అని పిలుస్తున్నాడు కానీ మధు ఏమి వినిపించుకోకుండా  బెడ్ పైన పడుకుని తన పెళ్లి ఫోటోలు చూసుకుంటూ ఉంది అతన్ని ఆ ఫోటోలలో చూస్తూ….

”కిశోర్ నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను నువ్వు నన్ను పెళ్లి లోనే చూసి ఉంటావు. కానీ నేను మాత్రం నిన్ను కాలేజి లోనే చూసాను అప్పుడే నీతో ప్రేమలో పడ్డానుకానీ నువ్వు నన్ను కనీసం చూడకుండా ఆ లావణ్య వెంట పడేవాడివి

అది చూసి నాలో నేను చాలా కుమిలి పోయేదాన్నినా ప్రేమ అంతా వ్యర్ధం అయ్యిందని బాధ పడుతున్న సమయం లో మీ అమ్మా నాన్నలు మా ఇంటికి సంబంధం కలుపుకోవడానికి వచ్చారు నాకు చాలా ఆనందం  గా అనిపించింది”

‘నువ్వులావణ్యను మర్చిపోలేకపోతుంటే నేను ఎంత బాధ పడుతున్నానో నీకు అర్ధం కాదు ఎందుకంటే ఒక అమ్మాయిని మనసులో పెట్టుకున్న నిన్నునేను ప్రేమించడం నువ్వు ఆమెని ఆమెని మర్చిపోలేక నన్ను ప్రేమించలేక ఎంత బాధని అనుభావించానో నువ్వు  కూడా అంతే భాదని అనుభవించావో నాకు తెలుసు అందుకే నేను నీ జీవితం లోంచి వెళ్లిపోవాలి అని అనుకుంటున్నా అందుకే ఇదిగో ఇది తెచ్చుకున్నా అంటూ విషం సీసా నోటి దగ్గర పెట్టుకుంది మధు.

అదంతా పక్క నుండి చూస్తున్న కిషోర్ వద్దు వద్దు అంటూ గబుక్కున వెళ్ళి మధు చెయ్యి పట్టుకుని అపాడు అతను తనని ముట్టుకోవడం చూసినా మధు కిషోర్ అంటూ ఏడుస్తూ అతన్ని హత్తుకుంది విషం సీసా కింద పడి బళ్ళున పగిలిపోయింది. ఇంతలో ఏడుస్తూ అక్కడికి వచ్చిన కిషోర్ తల్లి  ఏమ్మా వాడికి యాక్సిడెంటు అయ్యిందని తెల్సి చనిపోవాలని అనుకున్నావా ఏంటమ్మా ఇది పద వెళ్ళి చూద్దాం అంది మధు తో ఏంటి అత్తయ్య ఎం మాట్లాడుతున్నారు మీరు ? కిషోర్ కి యాక్సిడెంట్  కావడం ఏంటి ? అతను హాస్పిటల్ లో ఉండడం ఏంటి ? ఇదిగొ ఇక్కడే ఉన్నారు కదా అంది.

ఏంటమ్మా కిషోర్ ఇక్కడనా ? ఏడి అంది తల్లి ? ఇదిగో ఇక్కడే అని బెడ్ రూమ్ లోకి చూపించింది వేలు తో కానీ అక్కడ ఎవరూలేరు.మధు బెడ్రూమ్ అంతా వెతికింది తనకి ఎవరూ కనిపించలేదు అత్తయ్య ఇక్కడే అత్తయ్య ఇప్పుడే అత్తయ్య తాను వచ్చి నన్ను ఇలా కౌగిలించుకున్నారు అని ఏదేదో చెప్తున్న మధును హత్తుకుని పదమ్మ అంటూ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళింది.

అక్కడ కిషోర్ బెడ్ మీద పడి ఉన్నాడు. అతని ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు వారి  అనుభవాన్ని అంతా కలిపి వైద్యం చేస్తున్నారు మధుకి ఇదంతా ఏమిటో అర్ధం కాలేదు అసలు కిషోర్ కి యాక్సిడెంటు కావడం ఏంటి అని అత్తయ్యకు జరిగిన విషయం చెప్పినా కూడా నమ్మలేదు మామయ్యకు తల్లిదండ్రులకు కూడా చెప్పింది వాళ్ళు అంతా భర్తకు అలా జరగడం వల్ల షాక్ తో ఇలా మాట్లాడుతుంది అని అనుకుని ఆమెని ఓదార్చారు కానీ మధు కూ అంతా కలవరం లాగా ఉంది ఆమె చెప్పిన సమయం ప్రకారం అతను ఆ టైం లో రోడ్డు పై పడి ఉన్నాడు ఆమె వద్దకు ఎలా వస్తాడు అని అన్నారు తల్లిదండ్రులు అవును నిజమే అలా ఎలా రాగలుగుతాడు అని అనుకుంది మధు ఆ విషయాన్నీ ఆలోచించలేక కిషోర్ ని అలా బెడ్ మిద చూడలేక బాధ పడుతూ కూర్చుంది.

మధు ప్రేమ కోసం ఆమె ప్రేమలో నిజం ఉందని ఆమెకి దూరం అవ్వడం ఇష్టం లేని కిషోర్ ఆమె బాధని అంతా చూస్తూ వెళ్ళి డాక్టర్లు వైద్యం చేస్తూ ఉండగా బెడ్ మీదున్న  తన శరీరం లో ప్రవేశించాడు అప్పటి వరకు స్పందించని శరీరం ఒక్క సారిగా కదలడం వల్ల వెంటనే వైద్యాన్ని అందించారు. ఒక గంట తర్వాత డాక్టర్లు బయటకు వచ్చికిషోర్ తల్లిదండ్రులు మధు తో మీ అబ్బాయికి ఏమి ప్రమాదం లేదమ్మా మీరు వెళ్ళి చూడండి అని చెప్పారు. ఆ మాట విన్న మధు పరుగున లోనికి వెళ్ళింది కానీ మళ్ళి ఎదో సందేహం తో డోర్ దగ్గరే ఆగిపోయింది

అందరూ వెళ్ళి ఎలా ఉందంటూ అడుగుతున్నా మధు బయటే ఉండడాన్ని చూసి కిషోర్ సైగ చేసి దగ్గరికి  రమ్మని పిలిచాడు. భయంగా దగ్గరికి వచ్చిన మధు ని పక్కన కూర్చోమని అన్నాడు మధు కూర్చుంది ఆమె చేతి ని తన చేతిలోకి తీసుకుంటూ నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నావా? అవునే నీకు ఆ విషం సీసా ఎవరూ తెచ్చి ఇచ్చారో నాకు చెప్పు వాణ్ణి నాలుగుతన్నాలని ఉంది అన్నాడు కిషోర్. ”విషం ఏంట్రా అంటున్న తల్లి మీకెలా తెల్సు అంటున్న భార్యనుచూస్తూ మనసులో ఆ దేవునికి దండం పెట్టుకున్నా కిషోర్ మధు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తన ప్రేమ ఫలించినందుకు ఆనంద బాష్పాలు రాల్చింది మధు…

****** భవ్య చారు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related Posts