మహనీయుడు మృగము మానవుడే

అక్షర సమూహం
అంశం : చిత్రకవిత
శీర్షిక : మహనీయుడు మృగము మానవుడే,,,,,,!!
రచయిత అపరాజిత్ రెడ్డి

ఈ పృధ్విపటలంపై వీచే చల్లని గాలికెరటాల సవ్వడికి మనస్సు రంజిల్లి తేలికవు,,,,,,,,
నీలి ఆకాశమంత కడలి తీరంలో లేత చల్లగాలుల పసందైన ప్రకృతి,,,,,,,,,,
ఈ కాలగర్భంలో ఎన్నెన్ని యుగాలు తరాల మానవుల సంచారం ఈ భువిపై కన్నీళ్ళు ఆనందాల ఆహ్లాదాల వైరాగ్యాల పర్యంతమయ్యిందో,,,,,,,,,,,
ఈ ఆనంతానంత సుందర గోళంపై గర్జించే మేఘాలు మెరుపుల అలల అల్లకల్లోలం నీలి సముద్రాల సంగమంలో అగ్గిమంటల ఎండలకు తుకతుక ఉడికి భీకర తుఫాను గాలుల భీభత్సం చవిచూసిన మానవుడు ఎంత మహనీయుడో,,,,,,,,,,
భువికి దివారాత్రులకు మూలమైన సూరీడు మహోన్నత ఆకాశం నిండా వెలుగుల వెచ్చదనాలతో ప్రతి దినం నూతన సృజన గావించే అద్భుత సృష్టికి ఆద్యుడు పరబ్రహ్మ అతనే కదా,,,,,,,,,,,,
ఈ ప్రకృతి అందాలలో తేలియాడే వన్యమృగాలు పశుపక్ష్యాదులు జలచరాలు మానవుల క్రూరవధకు గురియై జీవనహొయలు కోల్పోతూ కొన్ని ఆంతరించిపోతూ సాత్విక జీవనం మరచి సర్వభక్షకుడై దానవుడై భోగాళాలసత్వంలో కూర్చున్న చోటు కిందే నిప్పు పెట్టుకుంటున్నాడు,,,,,,,,
అనంతకోటి జనం జాగృతం కావాలని కోరుకునే సత్పురుషులు సాత్వికులు మరికొందరు మాత్రమే మిగులుతారు రేపు రాబోయే వికృత లోకాన్ని అతలాకుతలం చేసే ప్రళయం తదుపరి తస్మాత్ జాగ్రత్త,,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీ పత్రం : ఈ రచన నా కలం సేత యని నా హామీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *