నా జీవితంపై ఆశ
నా ఉనికికై పెంపర్లాట
నాలోని సంతోష ఘడియలు
నా విజయాలు
నా వైఫల్యాలు
నాలోని నైరాశ్యం
నాలోని భయాలు
నాలోని గర్వం
నాలోని ఆత్మవిశ్వాసం
నేను పోగొట్టుకున్నది
నేను సాధించేది
నేను నాది అనుకునేవి
నేను ప్రేమించాను అనుకునేవి
నేను అసహ్యించుకున్నవి
నాలోని అహంకారం
అన్నీ ఈ మహాసముద్రం ఘోషలో కూలిపోయిన గోడలు,,,,
నా జీవితం అగ్నిగుండాల పాలైన పెను దుఃఖిత అలజడులన్నీ కలిపేసుకున్న భావనలో, ఊగిసలాడే కెరటాల ఊపులో ఎటూ కదలని ఈ మహాసాగరం ఉగ్రనృసింహం ఘోష చెంత మనస్సుకు ఎంత ప్రశాంతత,,,,,,,,,
సునామీల,తుఫానుల, అల్పపీడనాల సాగర గర్జనలలో ఎన్నెన్ని ప్రాణాలను కలిపేసుకుందో !?!ఎన్ని దుఃఖిత రోదనల రక్తకన్నీరు కలిసిపోయిందో,,,,,,,!?!
కాని నా దుఃఖిత మది ఈ కెరటాల గర్జనలో ఉత్తేజితమై చైతన్య పూరితమై ,ఈ భువిపై నా ఈ చిన్ని ప్రాణికి ఏం పోగొట్టుకున్నానని? ఏం బావుకుందామని నాలో ఈ సంఘర్షణ ?
మనిషిగా నాఆలోచనలు సాగర కెరటాల తుంపరల్లో నేనెంత ? ఈ దుఃఖం ఇక్కడే వదిలేస్తున్నా, నా కన్నీటి ధారలకిక వీడ్కోలు,,,,,,
నేను నేనేయైన నాలో వినూత్న జీవితానికి ఉజ్వల చైతన్య శంఖం పూరిస్తున్నా,,,,,!!??!!
అపరాజిత్
సూర్యాపేట