మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ధర్మాగ్నిలో ధైర్యముతో నిలిచిన నారి
  దాశరథి సీత…
అవమాన సభలో ఆత్మగౌరవం గాచిన అజేయ పాంచాలి..
కాకతీయ సింహాసనమున కత్తి గర్జించిన
  వీర రుద్రమదేవి శక్తి
విజ్ఞాన గగనమున విహరించిన వనిత
  కల్పన చావ్లా కీర్తి
సమర రంగమున సాహసమై నిలిచిన
  రాణి లక్ష్మీబాయి శౌర్యం
సమాన హక్కుల సింహాసనమెక్కిన
  జాగృతి భారత నారి జాతి….

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

-శివ రామ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *