మహిళా మేలుకో

ఆడదానికి అసలు ఏం కావాలో తనకైనా తెలుస్తుందా అసలు తన శక్తి తనకు తెలుస్తుందా లేదా ఒక వేళా తెలిసినా కూడా తెలియనట్టే ఉంటుందా రెండోదే కరెక్ట్ అని నా అభిప్రాయం ఇలాంటి ఆలోచన మీకెందుకు వచ్చింది అంటారా చెప్తాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవన్నీ చెప్పిన తర్వాత అయినా మీరు కనీసం మిలో ఒకరైనా అవును నిజమే కదా అని ఒక్క సెకండ్ ఆలోచించినా నేను రాసిన దానికి ఒక తృప్తీ మిగులుతుంది..

కొన్నేళ్ళుగా కొన్నాళ్ళుగా ఆడదాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్న మగజాతి తమ ఆచారం సంప్రదాయం పేరిట ఆడదాన్ని ఒక అబలగా , ఒక చేతకాని వ్యర్ధ పదార్ధం లా తనని తానూ రక్షించుకోలేదు అనే ఒక విష వలయాన్ని సృష్టించి తనని  ఒక ఇనుప ఛత్రం లో బిగించారు. అయితే స్త్రీ తనని తానూ నిజంగానే ఒక శక్తి లేని దానిలా ఉహించుకుంటూ వాళ్ళ ఆలోచనతోనే తన ఆలోచనలుగా చేసుకుని బ్రతుకు వేల్లదిస్తుంది.

కొన్నేళ్ళ తర్వాత రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మి బాయి  వంటి రాణులు కాస్త ముందుకు వచ్చి తమ శక్తులను చూపించారు. రాజ్యాన్ని , ప్రజలను తమ పిల్లలుగా భావించి పాలించారు ఇక ఆ తర్వాత మెల్లిగా స్త్రీ తన ప్రపంచాన్ని కొంచం కొంచం గా మారుస్తూ తన ఉనికిని తెలుపుకుంటూ తనదైన ముద్రని వేస్తూ  సత్తాను చాటింది. అలా కాల ప్రవాహంలో మనం ఆకాశం లో సగం అయ్యాం , ఆకాశం లో సగమని నిరూపించుకున్నాం. ఇక కొన్నేళ్ళ తర్వాత అన్ని రంగాల్లోనూ మనదైన శక్తి యుక్తులను చాటుకుంటూ వస్తున్నాం .

అయితే ఇంత శక్తి ఉన్నా,ఇంత పురోగతి సాధించినా ఇంకా స్త్రీ కి ఏం కావాలో ఎలా ఉండాలో తనకే తెలియదు తన గురించి  తనకే అర్ధం కాదు. తనకేం కావాలో తనకే తెలియదు ఇంతటి పురోగతిని సాధించినా మహిళ ఒక చీర కొనాలన్నా , ఒక నగ కొనాలన్నా తన భర్త వైపు చూస్తుంది.  ఎంత సంపాదిస్తున్నా ఎన్ని కోట్ల టర్నోవర్ ప్రజేక్ట్లుల్లో పెడుతున్నా ఇంకా ఇప్పుడు ఏదైనా అడగాలి అని అనుకున్నా లేదా ఎన్దూలొ అయినా ఇన్వెస్ట్ చేయలన్నా తన స్వంత నిర్ణయం తానూ తీసుకోదు. నిజమే భర్తకు విలువ ఇవ్వాలి కాదు అనను, కాని ఒక మంచిచీర కట్టుకోవాలన్నా, ఒక మూర పువ్వులు పెట్టుకోవాలి అన్నా భర్త మాట చెప్పాలి అప్పుడు తను చేయాలి.

భలేవారే  ఇప్పుడు అలా ఎవరున్నారండి అంటారా ఉన్నారండి బాబు అందుకే ఇదిగో ఇలా రాయడం మొదలు పెట్టా నాకు ఇది చూస్తుంటే చాలా హాస్యాస్పదం గా అనిపిస్తుంది. ఎందుకు అంటారా వినండి మహిళ మగాడి కంటే ఎన్నో రెట్లు శక్తి కలది ఎన్నో రకాల ఆలోచనలు చేయగలదు ఒక దేశాన్ని ,రాజ్యాన్ని శాషించ గలదు .ఇది తెలిసిన మాగాడు తనని అణగ ద్రోక్కలనే తన ప్రయత్నం లో సఫాలి క్రుతుడు అయ్యాడు.

ఎలా అంటే సంస్కృతి ,సంప్రదాయం పేరిట, ఆచార వ్యవహారాల పేరిట తనలో ఒక మూడ నమ్మకాన్ని రేపి నువ్వు నిజంగా శక్తివే కానీ నాకంటే కాస్త తక్కువ అనే నమ్మకాన్ని తన మనసులో నాటి అది పెద్ద విషవృక్షంలా మారెలా చేసాడు. నువ్వు నాకంటే ఎక్కువే అని ప్రేమతో అంటూనే నువ్వు ఇది తప్పకుండా చేయాలి అనే ఇనుప సంకెళ్ళు తనకు వేసి తన చుట్టే తిప్పుతూ ఉంచాడు. ఒక లాంటి భావన తనలో రేకెత్తించాడు మానసికంగా, నా తోడూ లేకుండా నువ్వు ఏం చేయలేవు ఒక వేళ చేసినా సమాజం నిన్ను ఎన్నో మాటలు అంటుంది అంటూ ఇనుపచట్రం లో బిగించివేసాడు.

దానికి తగినట్లే అదే మగ వెధవలు అత్యాచారాల పేరిట ఆడవాళ్ళను ఎంత సాధించినా ఇంకా వంటింటి కుందేళ్ళుగా మారుస్తున్నారు. ఒక కంపెనీని నడిపే మహిళా అయినా ఒక  క్రీడాకారిణి ని అయినా, ఒక సినిమా తార అయినా, ఒక కంపెనీలో పని చేసే మహిళా అయినా , ఒక దినసరి కూలి అయినా మగవాడి ఉక్కు పాదాల క్రింద నలగాల్సిందే అనే ఒరవడిని సృష్టించారు మగవాళ్ళు. అన్నిటిలో సమానత్వం అంటారు ఇంకేంటి అని గోల పెట్టె మగాళ్ళు నిజంగా ఒక్క క్షణం మీ గుండెల పై చేయి వేసుకుని చెప్పండి మాకు అన్నిటిలో సమానత్వం ఇస్తున్నారా , ఉంది అంతే కానీ లేదు ఇదే నిజం ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యం .

ప్రధాని అయినా , సర్పంచ్ అయినా , మేయర్ అయినా, ఇంకోటి ఏదైనా భర్త అజమాయిషీ లో నడవాల్సిందే ఎంత గొప్ప పదవి ఉన్నా,ఎంత సాధించినా తనకంటూ ఏమి మిగుల్చుకొని తన పేరుతో తన భర్త ఎన్ని అరచాకాలు చేస్తున్నా ఏనాడు పెదవి విప్పని ఓ మహిళా ఇకనైనా మేలుకో నీ అస్తత్వాన్ని నిలుపుకో నీ కంటూ ఒక రోజును లేదా ఒక గంటను సృష్టించుకో అసలు నీకేం కావాలో నువ్వు ఎలా ఉండాలో నీకై నువ్వు తెలుసుకో,నిన్ను నువ్వు ప్రేమించుకో , నీ శక్తి ఏమిటో నువ్వు గ్రహించు మగాడి కబంధ హస్తాల నుండి బయటపడు.

స్త్రీ ఒక అద్భుతం,ఒక మాయ,ఒక శక్తి .. చిన్న అణువును ఒక రూపంగా మర్చి తొమ్మిది నెలలు మోసి ఓపిక తో ఇష్టంగా తనకునచ్చని పదార్ధం తన బిడ్డ కోసం అంటూ మిగుతూ,తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ఎముకలన్నీ విరిగిపోతున్నా , చనిపోతాను అని తెలిసినా తన జీవితాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. తన అనుభవాన్ని అంతా నింపి బిడ్డలకు అన్ని  బుద్దులు నేర్పిస్తుంది. విచిత్రం ఏంటంటే అన్ని తెలిసినా తల్లినే ఆ బిడ్డలు పెద్దయిన తర్వాత నీకేం తెలియదు అనడం ఎంత పిచ్చితనమో కదా , నిజమే జనరేషన్ మారి ఉండొచ్చు కానీ ఆలోచనలు,ఆచరణలు మాత్రం మారవు కదా ,ఈ విషయాన్నీ అర్ధం చేసుకోలేని వారు తల్లికేం తెలియదు అంటారు పాపం పిచ్చితల్లి నవ్వి ఊరుకుంటుంది అంతే ..

ఇంకొక విచిత్రం చెప్పాలా ఎన్నో కష్టాలు ఒర్చుకున్న మహిళ ఎంతో శక్తికలిగిన మహిళ తనని తానూ కాపాడుకోగలిగిన ఆడది, దేశానికి కరాటే లో పతకాలు సాధించినా కూడా బయటకు వెళ్ళాలంటే మాత్రం ఒక పదేళ్ళ కుర్రాడిని ఇచ్చి పంపుతారు. అది పెద్ద వయసు వాళ్ళని కూడా అలాగే పంపుతారు అది జాగ్రత్త కాదు నువ్వు ఆబలవు నీకేం చాత కాదు అని మన మనస్సులో నింపే ప్రయత్నం ఇది గమనించరు ఎవరు. ముడ్డి కూడా సరిగ్గా కడుక్కొని వాడు మనల్ని కాపాడతాడని నమ్ముతాం అదే మన దేశ మహిళ ల దౌర్భాగ్యం .

ఇలాంటి మానసిక బెదిరింపుల నుండి బయట పడండి, కాస్త మీ గురించి మీరు ఆలోచించుకోండి మగాడు అవసరం లేదు అందం లేదు కానీ వాడి కోసమే మీ జీవితాన్ని త్యాగం చేయకండి, వాడి పాదాల క్రింద పడి నలిగిపోకండి మీకంటూ కొంత సమయాన్ని, మిలో ఉన్న నైపుణ్యాలను మెరుగు పరచుకుని ఏదైనా సాధించాలి అని ప్రయత్నం చేయండి.

ఎప్పుడూ పిల్లలు, భర్త, అత్తామామ అంటూ వారి సేవలో పడి మీ ఆరోగ్యాన్ని, శరీరాన్ని ,ఆలోచనలను,శక్తులను వృధా చేయకుండా కాస్త మీకంటూ ఒక పని మీ మనసుకు నచ్చింది చేయండి. యాడాది పొడుగునా చేస్తున్నా కూడా ఎలుక తోలు ఎలా తెల్లగా అవ్వదో ఎంత పని చేసినా సేవ చేసినా ఏదోక పని మిగులుతూనే ఉంటుంది.

అందుకే ఓ పిచ్చిదానా మేలుకో .. ఓ మహిళా మేలుకో ..ఇప్పటికైనా నీ కళ్ళు తెరుచుకో  మీకంటూ కొంత సమయాన్ని ఎంచుకోండి ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు మాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయనే నిజాన్ని అందరికి తెలియ చేయండి  అణగద్రొక్కే మగాడి బంధాలను కొంచం తెంచుకొని కనీసం ఒక రోజైనా మీకు నచ్చినట్టు  ఉండండి. అలా ఉండలేరా అయితే ఒక గంట అయ్యో రామా అది లేదా అయితే ఇదేదో మహిళా దినోత్సవం అంట కనీసం ఈ రోజైనా ఒక గంట మీతో మీరు , మీలో మీరు , మీలా మీరు మీకు నచ్చినట్టుగా ఉండండి .. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షల

అబ్బో భలే రాసింది  ఎవరో కానీ ఈ రోజు మన దినం అంట నీకు తెలుసా అంది సీత అవునే తెలుసు దినం కాదు దినోత్సవo  బాగా రాసింది కదా  అందుకే చదవమని నీకు ఇచ్చాను అంది శోభ , హ ఇంతోటి దానికి ఇవన్నీ ఎందుకు  రోజు లా ఏదో  ఇంత ఉడకేసుకుని డబ్బాలో పెట్టుకుని వచ్చేదానికి ఇవ్వన్ని అవసరమా ప్రోద్దంతా ఇడ ,రాత్రి అడ పని తప్పదు ఎలాగైనా మనమే చేయాలి వాళ్ళను అడిగితే ఇల్లు పీకి పందిరేస్తారు , మళ్ళి మనమే చూసుకోవాలి అదంతా ఎందుకొచ్చిన బాధ అయినా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందని ఎవరు చెప్పొచ్చారు వంట చేసుకుని బయట పడ్డం  మళ్ళి రాత్రికి వెళ్ళి చేసుకుచావాలి.

నిజమే ఈ రోజు మన దినమే ఎందుకంటే అన్ని మనమే చేసుకుని చావాలి కదా అంటూ తన అక్కసు అంతా వెళ్ళగ్రక్కి డబ్బా తీసుకుని విసవిసా వెళ్ళిపోతున్న సీతను చూస్తూ నిజమే కదా అనుకుంది శోభ పాపం ఆ రచయిత అయినా తనకంటూ కొంచం సమయాన్ని మిగుల్చుకుందో లేదో అని నిట్టూరుస్తూ తిరిగి తన పనిలో నిమగ్నమైంది..

***** భవ్య చారు

*******మహిళా దినోత్సవ శుభాకాంక్షలు*******

 

Related Posts

1 Comment

Comments are closed.