మాటే మంత్రము పార్ట్ -1

రితేష్ కార్లో వెలుతూ రోడ్ ప్రక్కన జనాలంతా ఒకచోట చేరడం చూసి ఏమై ఉంటుంది, అందరు అలా ఒకే చోట గుమిగూడారే అనుకుని కార్ సైడ్ కు పార్క్ చేసి, అటువైపుగా వెళతాడు. అ జనాల దగ్గరకు చేరుకుని జరగండీ ఏమైంది అంటూ చూసే సరికి,  అక్కడ ఒక అమ్మాయి అక్సిడెంట్ అయి తలకి గాయం అవడంతో, రక్తపు మడుగుల్లో పడి ఉంటుంది కానీ ఇంకా బతికే ఉండి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ మైకంతో ఉన్నట్లు, స్పృహలో ఉన్నట్లు ఉంది. ఆ షాక్ లో నుండి తేరుకుని ఏంటది ఆ అమ్మాయి అలా ఉంటే చూస్తూ ఉన్నారు అంబులెన్స్ కాల్ చేశారా? అనగానే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఎవరికి చెప్పలేదా? సరే కాస్త సహాయం పట్టండి అంటూ ఆ అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని తన కార్ వద్దకు తీసుకుని వేళతాడు కార్ డోర్ ఓపెన్ చేస్తారు చుట్టు ఉన్నవారు. కార్లోకి ఎక్కించుకుని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ దగ్గర ఆపి స్ట్రెచర్, డాక్టర్, నర్సు అంటూ అరుస్తూ, తనని అలాగే ఎత్తుకుని లోపలికి తీసుకొని పోతూ, మీకు ఏమి కాదండీ, నేనున్నాను అంటూ మాట్లాడిస్తూ తీసుకెళతాడు.

ఇంతలో నర్సు వచ్చి ఏమైందండీ అంటే ఆక్సిడెంటు అంటే సరే స్ట్రెచర్ మీద పడుకోబెట్టండీ అంటుంది. లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ ఇది ఆక్సిడెంట్ కేసు కాబట్టి పోలీస్ కేస్ అవుతుంది అంటే…

సార్ ప్లీజ్ ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను కంప్లీట్ చేస్తాను దయచేసి ముందు తనకు ట్రీట్మెంట్ చేయండీ అంటూ రితేష్ బతిమాలడంతో డాక్టర్ చూసి ఒక ఇరవై నిమిషాల తర్వాత బయటకు వచ్చి, కాస్త త్వరగా తీసుకొచ్చి ఉండాల్సింది, రక్తం బాగా పోయింది. బ్లడ్ బ్యాంకు నుంచి గానీ, ఎవరైనా డోనర్స్ నుండి కనకొని రాండి, తనది A నెగేటివ్ బ్లడ్ గ్రూప్ అంటాడు డాక్టర్ గారు.

ఒకే సార్ అంటూ తనకు తెలిసిన అందరి స్నేహితులకు పోన్ చేస్తాడు. నాది B పాజిటివ్, A పాజిటివ్ అంటూ సారీ అని చెబుతారు. బ్లడ్ బ్యాంక్ కి కాల్ చేసినా ఫలితం ఉండదు. ఇంతలో డాక్టర్ గారొచ్చి బ్లడ్ దొరికిందా ఒక గంటలో బ్లడ్ రాకపోతే ఇంకా కష్టం తను బతకడం లేదా కోమాలోకి వెలిపోతుంది అంటాడు.

ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి డాక్టర్ వెనకకు తిరిగి, మీరు ఏమి అవుతారు తనకు అనగానే.. రితేష్ ఫ్రెండ్ అనాలా? బ్రదర్ అనాలా?  ఏమని చెప్పాలి? ఎందుకు సార్ అని అడుగుతాడు. ఆ అమ్మాయికి కావలిసిన వాళ్ళు అయితేనే నేను ఫర్ధర్ గా ప్రోసీడ్ కాగలను, ఏదైనా జరగరానిది జరిగితే మా హాస్పిటల్ కు బ్యాడ్ నేమ్ అనగానే, అన్నయ్య అనో, ఫ్రెండనో చెబితే ఆ అమ్మాయిని చూడరని, హస్బండ్ అని అబద్ధం చెబుతాడు.

డాక్టర్ గారు ఒకే అని పోలీసులకు ఇన్ ఫార్మ్ చేశారా అంటే రితేష్ లేదు అంటూ తల అడ్డంగా ఊపుతాడు. మీ ఇష్టం మళ్ళీ తనకి ఏమైనా ఐతే మమ్మల్నీ అనొద్దు అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళీ తనని చూస్తాడు. తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నర్స్ బయట ఉన్న తన హస్బండ్ ను పిలవండి అంటారు డాక్టర్.  

రితేష్ లోపలికి రాగానే, తనకి మీరు ఉన్నారని ధైర్యం చెప్పండి తను ఏదో మీకు చెప్పాలనుకుంటుంది ఈ టైంలో  స్ట్రెస్ తీసుకుంటే నరాలు చిట్లే అవకాశం ఉంది అని అంటాడు డాక్టర్ గారు.

రితేష్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. రితేష్ తన దగ్గరికి వెళ్ళి పరిచయం లేని వ్యక్తిలా సంబోధించి మాట్లాడితే డాక్టర్ కి,  ఆ అమ్మాయికి తను ఏమి కాను అని తెలిస్తే ట్రీట్మెంట్ ఇవ్వరు అని, తన పక్కనే ఒక చేర్ వేసుకుని కూర్చుని ఏంటిరా? ఏది ఏంటి? అంటూ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని,  నీకేమి కాదు, నేనున్నాగా, నీకు ఏమైనా అయితే నేనెలా బతకగలను?  ప్లీజ్ బి స్ట్రాంగ్! ఐ లవ్ యు రా అంటూ గెట్ వెల్ సూన్ అంటూ, ధైర్యం చెబుతుంటాడు.

ఆ అమ్మాయి కళ్ళలో నుండి కన్నీరు కారుతుంటే, రితేష్ చ.. ఆ ఏడుపు ఎందుకు?  నువు కోలుకోగానే లైఫ్ ను బాగా ఏంజాయ్ చేద్ధాం ఒకేనా అంటూ మాట్లాడుతుంటే.. ఇంతలో రితేష్ సెల్ మోగుతుంది.

A నెగేటివ్ బ్లడ్ కావాలన్నారు, నాది అదే గ్రూపు అంటూ అటు నుండి ఒక అమ్మాయి వాయిస్, థాంక్యూ అండీ రoడి అంటూ పిలుస్తారు! రమ్య వచ్చి బ్లడ్ ఇస్తుంది. డాక్టర్ తనకేమి ప్రాబ్లం లేదు కాకపోతే యాక్సిడెంట్ అయిన చాలా సేపటికి ఎక్కించాము కనుక, కోమలోకి వెళ్ళింది 24 గంటలలో స్పృహలోకి వస్తుంది అంటారు. అది విని రితేష్ ఊపిరి పీల్చుకుని రమ్యకి థాంక్యు చెప్పి బాయ్ అంటూ మళ్ళీ బెడ్ దగ్గరికి వెలతాడు. ఇంతలో నర్స్ రావడం చూసిన రితేష్ నర్స్ వైపు తిరిగి అంతా ఒకే కదా అంటాడు. ఇంకా టెన్షన్  లేదు అంటూ నర్స్ చెబుతుంది.

తన  పిలుపు కొసమే ఎదిరు చూస్తున్నానంటూ రితేష్ అంటాడు  నర్స్ నో ప్రాబ్లం సార్ మీ ప్రేమ బ్రతికిస్తుంది తనని, మీ ఆరాటం తనకి అర్థం అవుతుందండీ ఆ మాటలకి రితేష్ చిన్నగా నవ్వి ఒకే నర్స్ అంటాడు. నర్స్ వెల్లిపోవడంతో మళ్ళి బెడ్ పక్కనే కూర్చుని, చూశారా నా లవ్ అంటా మా ప్రేమ వల్లే మీరు బతికారంటా జనాలు అబద్ధాలకు పడిపోతారు.  ఏంటి మేడం అంటూ నవ్వి మీరు రెస్టు తీసుకోండి. నాకు ఆకలేస్తుంది తినొస్తా, మీకేంటి మంచిగా గ్లూకోజ్ ఎక్కుతుందిగా బలం వచ్చేస్తుంది. మీరు లేచేదాకా మిమ్మల్నీ నేనేగా చూసుకోవాలి సో తినొస్తా అని చెప్పి ఆ రూం నుండి బయటకు వేళతాడు.

తిరిగొచ్చి నైటంతా అక్కడే పడుకుని, మార్నింగ్ లేచి తనని  తీసుకొచ్చినప్పుడు తన బ్యాగ్ ఉండాలే అని బ్యాగ్ గుర్తుకొచ్చి, కార్ దగ్గరికెళ్ళి బ్యాగ్ తీసుకుని చూస్తాడు. అందులో ఒక పిక్ ఉంటుంది  ఆ అమ్మాయితో పాటు మరి కొంత మంది ఉండడం చూసి వెనకాల బ్యాగ్ గ్రౌండు చూస్తే అమ్మ అనాధ ఆశ్రమంఅని ఉంటుంది, అంటే ఈమె అనాధనా? లేక అక్కడికి సర్వీస్ చేయడానికి వెళతారా? అంటూ ఆలోచనలో పడతాడు. ఇంతలో డాక్టర్ వచ్చి హాయ్ రితేష్ ఎలా ఉంది మీ ఆవిడకు అంటే ఇంప్రూవ్ మెంటు అంటే లేదు సార్ ఇంకా స్పృహలోకి రాలేదు అంటాడు. దానికి డాక్టర్ గారు స్పృహలోకి రాకపోయినా మీ మాటలు తను వింటుంది మేము మాట్లాడుతుంటే తను రెస్పాండ్ అవ్వలేదు. కానీ నేను నిను పిలిచాకా నువ్వొచ్చి మాట్లాడాకే తనలో చలనం వచ్చింది. మీ మాటలే తనకు ప్రాణం పోశాయి అంటారు. ఆ మాటలకు నవ్వొచ్చినా ఒకే డాక్టర్ గారు అంటూ రితేష్ తల ఆడిస్తాడు.

అనుకున్నట్లుగానే ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది. డాక్టర్ హౌ ఆర్ యు ఫీలింగ్ నవ్ అంటే చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఐ యామ్ ఒకే అన్నట్లు రితేష్ కంగ్రాట్స్ అయ్యా… మీ వైఫ్ కళ్ళు తెరిచింది. మాట్లాడుతుంది. అనగానే రితేష్ తనని చూడాలని, లోపలికి వచ్చి చూస్తాడు.  డాక్టర్ యు పీపుల్ క్యారీయాన్ అని వెళ్ళిపోతారు. రితేష్ ఆ అమ్మాయి పక్కనే కూర్చుని, ఇప్పుడు ఎలా ఉన్నారు?  అనగానే అందుకు సమాధానంగా ఆ అమ్మాయి ఐ లవ్ యుఅంటుంది. రితేష్ షాక్ అవుతారు……….

ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? తనకి   ముందుగానే రితేష్ తెలుసా? ఐ లవ్ యు చెప్పింది ఏంటి?

అనేగా మీ డౌట్స్ మరో ఎపిసోడ్ లో చెబుతాను…

Related Posts