హాస్పటల్ వాతవరణంలో ఆమె బెడ్ పైనా అలాగే పడుకుని వుంది. రీతేష్ ఆవిడా ఎందుకు అలా అనుంటుంది అని అలోచనలో పడుతాడు .ఇంతలో డాక్టరు వచ్చి రిపోర్ట్స్ చెక్ చేసి రీతేష్ మీ వైఫ్ ని తీసుకెళ్ళచ్చు అంటారు . సరే అని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బయటికి వస్తారు…
కార్ ఎక్కడి అంటూ కార్ డోర్ తీస్తాడు రీతిష్ , ఆ అమ్మాయికి జరిగిదంతా కళ్ళ ముందు కనిపిస్తుంది . తనకి ఎక్పిడెంట్ అవ్వడం రీతిష్ తనని ఎత్తుకోని కార్ లో హాస్పటల్ కి తీసుకురావడం అంతా గుర్తుచేసుకుంటుంది . కార్ ఎక్కిన తరువాత ఎక్కడికి వెళ్ళదాం అంటూ రితేష్ అడగడంతో ఆకలేస్తుంది అంటుంది సరే ఏదైనా హోటల్ కి వెళ్ళదాం అని చెప్పి హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేసి బయటికి వస్తారు . కాస్త ఫ్రెష్ అవ్వాలి చికాకుగా వుంది అని ఆ అమ్మాయి అనడంతో ఫోటో లో చూసిన ఆశ్రమం గుర్తు చేసుకుంటాడు రితిష్ .
అది చాలా దూరం సరే రండీ అంటూ తన రూమ్ కే తీసుకుళ్తాడు , రూం అంతా చిందేరా వందరంగా వుంటుంది. సారీ బ్యాచలర్ రూం కాదా అందుకే ఇలా వుందని ఏదో కవర్ చేస్తున్నట్టు మాట్లడుతాడు రితీష్ . అ అమ్మాయి రూంలోకి వచ్చి ఏమి మాట్లడకుండా అక్కడే ఉన్న కూర్చోని వెనక్కి వాలి పడుకుంటుంది . రితీష్ కాస్త అయోమయంలో పడుతాడు ఏంటబ్బా ఫస్ట్ ఆకలి అంది , తరువాత ఫ్రెష్ అవ్వాలంది వచ్చింది మరి అవ్వకుండా పడుకుంటుందే పోనిలే అలసిపోయిందోనని తను ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూంకి వెళ్ళతాడు.
తను వాష్ రూం నుండి వచ్చేసరికి తన రూం కాస్త అందంగా నందానవనంగా మారిపోతుంది . తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది , చూడాగానే మళ్ళీ షాక్ కారణం ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి తన షర్ట్ పాంట్ వేసుకోని వస్తుంది .
రితేష్ – ఇదేంటండి నా బట్టలు వేసుకున్నారు .
అమ్మాయి – నా మొగుడు హాస్పటల్ లో వైఫ్ అని చెప్పారు కాని బట్టలు కొనివ్వలేదు .
రితేష్ – అయోమయంగా చూసి అక్కడ ఏదో అలా చెప్పాల్సి వచ్చింది సారీ అండి
అమ్మాయి – ఐ లవ్ యు
రితేష్ – హాస్పటల్ లో కూడా అలాగే అన్నారు వేళాకోలం చేయ్యకండి .
అమ్మాయి – నో అయామ్ సిరియస్
రితేష్ – రండీ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను
అమ్మాయి – ఎక్కడ చేస్తారు
రితేష్ – మీ ఇంట్లో
అమ్మాయి – మా ఇల్లా ఎక్కడ వుంది మీకు తెలుసా
రితేష్ – అమ్మా అనాథ ఆశ్రమం మీదే కదా
అమ్మాయి – హా
రితేష్ – సరే పదండి
గంటా తరువాత
ఆశ్రమానికి చేరుకున్న ఆ అమ్మాయిని చూసి పిల్లలంతా అమ్మ నాన్న శృతి అక్క వచ్చేసింది అంటూ గట్టిగా అరుస్తారు. లోపల నుండి ఇద్దరు పెద్దవారు బయటికి వస్తారు . శృతి రితేష్ గారిని పరిచయం చేసి జరిగింది చెప్పుతుంది. జరిగిదంతా విన్న ఆ వృద్ధ దంపతులు రితిష్ కి థాంక్స్ చెప్పి భోజనం పెట్టి సాయంత్రం అయ్యేసరికి వెళ్ళోస్తానంటూ బయలుదేరుతారు .
శృతి – మళ్ళీ ఎప్పుడు వస్తారు శ్రీవారు
వెళ్ళేవాడు వెనక్కి తిరిగి ఓ సీరియస్ లుక్ ఇస్తారు రితిష్ .
ఆ మాట అందుకున్న శృతి అమ్మనాన్న కూడా అల్లుడు గారు అమ్మాయి బెంగ పడుతుంది అప్పుడప్పుడు వస్తువుండండి అంటారు .
రితిష్ – ఫ్యామిలి ఫ్యామిలి అంతా ఇంతేనేమో అంటూ ఉంటాను అంటూ బయలుదేరుతాడు .
కాని కార్ లో వెళ్ళతూ తనకి శృతి మాట్లడినా ఆ మొదటి మాట ఐ లవ్ యూ ఎందుకు అన్నారు అని ఆలోచిస్తు వెళ్ళతాడు . అలా కార్ లో ఆలోచిస్తూ వెళ్ళుతున్న తనకి రోడ్డు పైనా ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది చూసి కారు ఆపి ఆరే రమ్య గారు….. కామ్ ఇన్ అంటూ స్మయిల్ చేస్తాడు .
రమ్య – హాయి రితేష్ , మీ వైఫ్ కి ఇప్పుడు ఎలా వుంది
రితేష్ – వైఫా ఆవిడెవరు
రమ్య – అదేంటండి నిన్న హాస్పటల్ లో మీ వైఫ్ కి బ్లడ్ కావాలంటు అంతా కంగారు పడ్డారుగా
రితేష్ – ఆవిడా శృతి నా వైఫ్ కాదు అని జరిగింది చెప్పుతాడు .
రమ్య – హో అవునా అయామ్ లక్కీ అయితే
రితేష్ – వాట్ ఏదో అన్నారు .
రమ్య – నాథింగ్ మనం ఫ్రెండ్స్ అవుదామా
రితేష్ – శృతికి చేసిన సహాయం గుర్తు వచ్చి మంచిదే అనుకుని ఓకే అంటూ షెక్ హండ్ ఇచ్చుకుంటారు .
రమ్య – ఓకే బాయ్ అంటూ ఫోన్ నెంబరు ఇచ్చి వెళ్ళుతుంది …
రమ్మ ఫ్రెండ్స్ ఎంటే ఇంతా లెటు రా సినిమాకి టైం అవుతుంది అంటూ లోపలికి తీసుకెళ్ళి ఈ హిరో ఎవరు వీడిని బక్రా చేస్తున్నావా అంటారు
రమ్య – లేకపోతే ఏంటే నా అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే నిన్ననేను హాస్పటల్ కి వెళ్ళా మా నాన్న గారి ఫ్రెండ్ ఒకరు హైల్త్ బాగాలేక అడ్మిట్ అయితే చూడడానికి వెళ్ళా అక్కడ కనిపించాడు గురుడు నాతో పాటే ఉన్న ఆ అంకుల్ కూతురు రక్తం ఇస్తే నేనే ఇచ్చా అనుకున్నాడు అది పోరాపాటున కాదు , కావాలనే నేను అందంగా వుంటాను గా పడిపోయాడు ఎలా మాట్టడాలో తెలిక ఇలా చేసాడు , నేను ఉరుకుంటనా చూడు పిచ్చోడిని చేసి వదిలిపెడతా వాడిని
రమ్య ఫ్రెండ్స్ – అబ్బా పాపం అమాయాకుడిలా ఉన్నాడే అంటూ నవ్వేస్తారు .
తరుచు ఫోన్లో రమ్య రితేష్ తో మాట్టుతుంటుంది . అలా వారి స్నేహాం పేరుగుతు వస్తుంది .
నెల రోజుల తరువాత
ఉన్నట్టు ఉండి శృతి రితేష్ ఆఫీస్ లో కనిపిస్తుంది , ఇవిడెంటి ఇక్కడ అంటూ కనబడకుండా తప్పించుకుంటాడు . ఇక్కడే శృతి జాబ్ లో జాయిన్ అయిందని తెలుసుకుంటాడు . రోజు కాబ్ లో వెళ్ళటప్పుడు వచ్చేటప్పుడు తప్పితే రితేష్ తనని చూసేవాడు కాదు . శృతి కూడా పక్కన వారితో అవసరానికి మించి మాట్లడేది కాదు . అసలు రితేష్ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నాడని తెలిదు తనకి ఒకరోజు ఉన్నట్లు వుండి ఆఫీస్ బయట రితేష్ ని చూస్తుంది శృతి రితేష్ దెగ్గరికి వెళ్ళి
శృతి – ఏంటీ శ్రీవారు ఇక్కడ వున్నారు నన్ను వెతుక్కుంటూ వచ్చారా అంతలా మిస్ అవుతున్నారా అంటూ ఆటాపట్టిస్తుంది .
రితేష్ – ఇదిగో అంతా లేదు నువ్వే నేనున్నా చోటుకి వచ్చావు , ఆయన చూడడానికి బాగానే ఉన్నావు , బుర్ర లో ఏమైనా పేను దూరిందా ఎవరైనా సృహాలోకి రాగానే మీరు ఎవరంటారు నువ్వెంటి ఐ లవ్ యు అన్నావు అంటాడు .
శృతి – ఏం అన్నాను
రితేష్ – ఐ లవ్ యు అని
శృతి – థాంక్యు మీటు అయామ్ ఇన్ లవ్ విత్ యూ అంటుంది .
రితేష్ – తింగరదానా నువ్వు అలా అన్నావని అంటున్న నేను అనాలేదు .
శృతి – అందుకేనా హాస్పటల్ లో వైఫ్ అన్నావు ఏ దొంగ నేనంటే మీకు ఇష్టమే కాని దాస్తున్నారు అంటుంది .
ఇంతలో రమ్య అక్కడికి చేరుకుని హాయ్ రితేష్ అంటుంది ,
రితేష్ – ఆ రోజు హాస్పటల్ లో నీకు బ్లడ్ ఇచ్చింది తనే అంటు శృతికి పరిచయం చేస్తాడు .
శృతి – హాయ్ అంటూ పలకరించి థాంక్స్ చెప్పుతుంది .
రమ్య – ఓకే కమ్ నీతో మాట్లడాలంటూ రితేష్ చేయ్యి పట్టుకుంటుంది .
రితేష్ – ఏక్కడికి
రమ్య – నీతో ఒక విషయం చెప్పాలి
రితేష్ – ఇక్కడే చెప్పు
రమ్య – ఏ అమ్మాయైనా ఇలా రోడ్డుపైనా తన లవ్ నీ ప్రపోస్ చేస్తాదా అంటూ సిగ్గుపడుతుంది .
శృతి – ఆ మాట విన్నా తన గుండే బరువు ఎక్కుతుంది , రితేష్ ఏం అంటండా అని తన వైపు చూస్తుంది .
రితేష్ – ( ఇది శ్రీవారు అని చావాదొబ్బుతుంది దీనిని తప్పించుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం అనుకుని ) వాట్ ఇస్ ఇట్ ట్రూ ఎప్పుడు చెప్పాలేదే ఐ లవ్ యూ టూ అంటాడు .
శృతి – యు గైస్ కారీ అన్ అంటూ తిరిగి వెళ్ళుతుంటుంది .
రితేష్ – హామయ్య థాంక్యు టైం కి వచ్చావు , లెకపోతే అది శ్రీవారు అంటూ చంపేసింది అండ్ సారీ ఇందకా తన ముందు అలా బల్డిప్ ఇచ్చా …..
రమ్య – అంటే నన్ను లవ్ చేయడం లేదా
రితేష్ – మీ అమ్మాయిలకేమైనా పిచ్చా అదేమో శ్రీవారు అంటాది , నువ్వేమో లవ్ అంటావ్ , నీ మీద మంచి అభిప్రాయం ఉంది అది పోగోట్టుకోకు అంటూ వర్న చేస్తాడు .
రమ్య – హై యూ ఏంటీ స్టెయిల్ కోడుతున్నావా ఇన్ని రోజులు నా చుట్టూ తిరిగి నన్ను తాకుతు ఎంజాయ్ చేసి ఇప్పుడు లవ్ కాదు అంటున్నావ్
రితేష్ – చీప్ గా మాట్టడాకు నేను నిన్ను తాకడం ఏంటి, ఫర్ యూవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తమరే నా నంబర్ తీసుకుని నా చుట్టూ తిరిగావు మీద మీద పడి మాట్లడావు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు .
రమ్య – వీడికింతా పోగరా చూస్తా అంటూ అందరు తననే చూస్తున్నారాని గమనించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది .
ఆ తరువాత ఏం జరిగింది శృతి రితేష్ మళ్ళీ కలిసారా లేదా….? కల్లు తెరిచక హాస్పటల్ లోనే కాకుండా రితేష్ కనబడ్డ ప్రతిసారి శృతి ఎందుకు రితేష్ కి ఐ లవ్ యూ అని చెప్పుతుంది? శ్రీవారు అని ఎందుకు పిలుస్తుంది? ఇవ్వని తెలియాలంటే నెక్ట్ప్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ………….
-KEERTHANA MUTHYALA