మాటే మంత్రము పార్ట్ -4

రితేష్ డ్ర్రైవర్ గా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుందాం…..

ఎంబీఏ చదివిన రితేష్ డ్రైవర్ గా ఎందుకు మారాడు , ఒక రెండు సంవత్సరాల క్రితం హైవే పై వస్తుండంగా ఒక అక్పెడెంట్ చేసాను , నేను చేసిన పోరాపాటు వల్ల సర్ వాళ‌్ళ పాప కి ప్రాణహాని లేనప్పటికి కాళ్ళు చచ్చిబడిపోయాయి . ఆ రోజు వర్షం కారణంగా స్ర్టీట్ లైట్స పని చేయ్యలేదు అప్పుటికి నేను హారన్ వేస్తును వస్తున్నాను . కాని అనుకోకుండా సర్ వాళ్ళ పాప అడ్డు రావడంతో ఆ చీకట్లో కనిపించలేదు గుద్ది వెళ్ళిపోయాను . మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ ఎక్సెడెంట్ అయిందని వార్త టీవిలో చూసి ఆ సమయానికి అక్కడ నేను తప్పితే ఎవరు లేరు అని గుర్తొచ్చి వివరాలు తెలుసుకుని సార్ ని కలిసాను..

 ఆ పాప మళ్ళీ ఎప్పటి లా నడిచే వారకు నేను నా స్టేటాస్ ని , నా పేరు పక్కనే ఉన్న ఏంబీఏ ని మరిచిపోవాలనుకున్నఅందుకు నాకు తగ్గ శిక్ష పడాలనుకున్నా , ఒక మాములు మనిషిగా బత్రకాలనుకుని డిసైడ్ అయ్యాను. అప్పటి నుండి రోడ్డు మీదా ఎ అక్సిడెంట్ జరిగిన అది నా వల్ల అయిందో లేదో నాకు అనవసరం ప్రాణపయంలో ఎవరు ఉన్న రక్షించాలని తాపత్రయ పడుతాను , అలాగే నీ పరిచయం కూడా శృతి అని అన్నారు .

శృతి వాళ్ళ నాన్న ఆ సమయానికి నువ్వే వచ్చావని ఎంటీ నమ్మకం నీ కంటే ముందో తరువాతో ఎవరైనా వచ్చి గుద్ది పోవచ్చి ఉండోచ్చు గా నువ్వేనని ఎందుకు అనుకుంటున్నావ్ …

రితేష్ _ ఆ దారిన అప్పుడు వేరే వారు వచ్చే ఛాన్స్ లేదు , ఆ దారిని క్టోస్ చేసినప్పటికి వర్ఫం లో వేరే రూట్ వెళ్ళితే లేట్ అవుతుందని నేనే షార్ట్ కట్ తీసుకున్న…. సో అది నా పోరాపాటే

శృతి నాన్న _ నువ్వు అనుకున్నట్లే వర్షంలో రిస్క్ ఎందుకని , అదే షార్ట్ కర్ట్ కోసం ఆలోచించి ఎవరైనా ఆ ఎక్పిడెంట్ చేసి ఉండచ్చుగా..

రితేష్ _ ఏంటీ అంకుల్ మీరు అనేది, సరే నేను చేసానా , చేయ్యలేదా అన్నది పక్కన పెడితే , ఇన్ని రోజులు ఎంతో బాధ‌్యతగా సార్ పాప కోలుకోవాలి అనుకున్నానో , ఇప్పుడు అలాగే అనకుంటా , సార్ కి మొదట నేనే చేసిన పోరాపాటుని చెప్పినప్పుడు నన్ను పొలిసులకు పట్టించాలనుకున్నారు , కాని ఆ అమ్మాయే తప్పు మనది కూడా వుంది అని ఆపింది , అందుకోసమైనా నేను ఆ పాప కోలుకునేదాకా ఇలాగే కంటిన్యూ అవుతాను .

టంగ్ టంగ్ అని గడియారం బెల్ 12 అవుతుంది ఆలస్యం అయింది , ఈ రోజు ఇక్కడే పడుకోమని రితేష్ కు చెప్పి అంతా వేరు వేరు గదుల్లో పడుకుంటారు .

మరుసటి రోజు ఆదివారం , ఆఫీస్ లేకపోవడంతో అందరు కాస్త లెట్ గానే నిద్ర లేస్తారు, రాత్రి అందరు లెట్ గా పడుకునే సరికి ఉదయాన్నే ఎవరు లేవ్వరు . మధ్యాహ్నం ఒంటిగంట ఆ సమయంలో రితేష్ బాస్ నుండి ఫోన్ వెంటనే రమ్మని సండే రోజు రమ్మంటారు ఏంటాని బయలుదేరుతాడు . అక్కడికి చేరేసరికి శృతి తల్లిదండ్రులు అక్కడ వుంటారు , మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా బాస్ వచ్చి చెప్పుతాడు , ఆ ఎక్పిడెంటు చేసింది నువ్వు కాదు , ఈ పెద్దయైనా అనగానే రితేష్ షాక్ అవుతాడు ..

శృతి అమ్మ _ నిజం బాబు ఆ రోజు మేము అటుగానే వచ్చాం , చీకట్లో ఏమి కనబడకపోవడంతో డ్రైవర్ సీటలో ఉన్న అంకుల్ వల్లే ఆ పాపకు గాయాలయ్యాయి , అదే అక్పిడెంట్ లో మేము మా కోడుకు కోడలిని పోగోట్టుకున్నాం , అక్కడే వుంటే నా కోడుకు కోడలు దహాన కార్యక్రమాలు జరగవాని డ్యూటీ లో ఓ ఆఫీసర్ కి డబ్బులు ఇచ్చి తప్పించుకున్నాం , మేము చేసిన తప్పుకి కాబోలో హాస్పటల్ లో ట్రీట్మేంట్ తీసుకుంటున్న నా కోడుకు , కోడలు చనిపోయారు , ఈ విషయాలు ఏవి తెలిని మీ బాస్ నువ్వు వచ్చి చేసావ్ అనగానే నమ్మేసారు , అక్కడ ఇ:కా ఎవరు లేకపోవడంతో నువ్వే చేసావని నవ్వు అనుకున్నావ్ , ఆ అక్పిడెంట్ అయిన సమయానికి మీ బాస్ సృహాలో ఉండి వుంటే ఇదంతా సరిగేది కాదేమో మేము చేసిన తప్పుని ఎలా సరిద్దిద్దుకోవాలో తెలిక ఉన్న ఆస్తినంతా శృతి కి ఇచ్చాము తను అమ్మ ఆర్ఫేనేజ్ నడుపుతుంది ……

ఇదంతా తెలుసుకున్న బాస్ ఆ ముసలివాళ్ళని ఇంకేమి శిక్షిస్తాడు , కోడుకు కోడలిని పోగోట్టుకుని కుమిలిపోతున్న వారిని ఏమి అనలేక రితేష్ ని ఆ కంపనికి ఎండీ ని చేసారు , పాప నెమ్మదిగా కోలుకుంటుంది , శృతి అర్ఫ్హనైజ్ పనులతో బీజి అయిపోయింది .

                            ———-ముత్యాల కీర్తన

Related Posts