"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

మాట , నోటు , నీటు…..మాటకి లేని విలువ

అంశం:⁠- మాట , నోటు , నీటు
శీర్షిక:⁠- వ్యామోహం

   
మాటకి లేని విలువ
నోటుకి చాలా మంది విలువ ఇస్తున్నారు
నీటుగా రాజసాన్ని ఏలాలని
మాటలు నమ్మకుండా నోటు ఇచ్చిమరి అబద్ధాలు చెప్పించి
డబ్బు , అధికారం కోసం పాకులాడుతూ
మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటూ
ఓటుకు నోటు తీసుకొని దేశ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా
నోటు ఇచ్చిన వాళ్లకే ఓట్లు వేస్తూ
నీ భవిష్యత్తు దేశ భవిష్యత్తు నాశనం చేసుకుంటూ
నిజాయితీగా మాట్లాడే వాళ్ళ కంటే
నోటు తీసుకొని మాట్లాడే వాళ్లే ఎక్కువ…
అలాంటి వాళ్ళ మాటలే గుడ్డిగా నమ్ముతుంది ఈ ప్రపంచం…
ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేసేలా చేస్తుంది ఈ నోటు…
మన కళ్లకున్న తెరల్ని తీసి చూస్తే అసలైన నిజం తెలుస్తుంది…
పదవి కోసం ఎన్ని తప్పులు అయినా చేయడానికి సిద్ధపడుతూ
ప్రజల దగ్గర సింపతి సంపాదిస్తూ
నోటుతో నోరు ముయించి ఓట్లు వేయించుకుంటున్నారు…
ఈ ప్రపంచాన్ని డబ్బే నడిపిస్తుంది అనే నమ్మకంతో
అందరిని డబ్బుతో కొనాలని చూసే వాళ్లకి
ఆ డబ్బు లేని రోజు ఒక్కరు కూడా నిన్ను దగ్గరికి తీసుకోరు…
డబ్బు ఉందని అహంకారంతో నువ్వు చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది..
డబ్బు వ్యామోహంలో పడి మన వాళ్ళని మర్చిపోకూడదు…
అదే జీవితమని బతక్కూడదు…

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *