మాట మరిచే మనుషులు – బలహీనత

అంశం:⁠- మాట మరిచే మనుషులు

శీర్షిక:⁠- బలహీనత

                   తన స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారం తన కొడుకుని రామయ్యకు కూతురికి పెళ్లి చేయాలనుకున్నాడు.  ఆ విషయం తెలియని మూర్తి కొడుకు తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు.

ఇచ్చిన మాట తప్పినందుకు 50 కొరడా దెబ్బలు పంచాయతీ వాళ్ళు శిక్షగా వేశారు.
రామయ్య ఊరి పెద్ద ఇచ్చిన మాట తప్పకూడదు ఆ మాట ప్రాణంతో సమానం అని చెప్పాడు. ఊర్లో ఎవరైనా మాట తప్పితే మాత్రం వాళ్లే కఠినంగా శిక్షించేవాడు.

రామయ్య కి తగ్గట్టుగానే తన భార్య భారతి వీళ్లిద్దరి జంట చూస్తే అన్యోన్యత దాంపత్యంగా సీతారాముల్లాగా ఉంటారని చెప్పుకుంటారు.

వీళ్ళకి ఒక్కగానూ ఒక కూతురు శ్యామల.

నాన్నగారు..! మీరు కుదిరించిన పెళ్లి కొడుకు తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నాకు పెళ్లి చేస్తున్నారని పై చదువులు చదవద్దని అన్నారు. ఇప్పుడు నేను పై చదువులు చదువుకుందాం అనుకుంటున్నాను , మీరు ఒప్పుకుంటే” అని అడిగింది శ్యామల.

తన స్నేహితుడు మాట తప్పినందుకు పంచాయతీలో శిక్ష వేసిన తన కూతురు చదువు పెళ్లి కారణంగా ఆపినందుకు బాధపడ్డాడు.

“సరే చదువుకో…” అని ఒప్పుకున్నాడు రామయ్య.

కాలేజీలో జాయిన్ అయ్యి , మొదటి రోజు కాలేజీకి శ్యామల వెళ్ళింది. అందరూ తనకి స్నేహితులు అయ్యారు. 

అందరూ అమ్మాయిలకు యాష్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను బయటకు కనిపించే అంత మంచివాడు కాదు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాడు.  ఒకవేళ తెలిసిన కాలేజీ అందరికి చెప్పిన నమ్మరు. అంత గుడ్డిగా వాళ్ళలందరిని నమ్మించాడు.

అలాగే శ్యామల తో యాష్ స్నేహం అనే పేరుతో తనని లోంగదిసుకోవాలని కుట్ర  చేస్తున్నాడు.
ఒక యాష్ తన పుట్టిన రోజు అని చెప్పి సాయంత్రం శ్యామలను తనకి తీసుకొని వెళ్ళాడు.
యాష్ ని గుడ్డిగా నమ్మి వెళ్ళింది. అక్కడ యాష్ తన ఫ్రెండ్స్ బాగా తాగి శ్యామలను  లొంగదీసుకోవాలని అనుకున్నారు.  శ్యామల చాలా వాళ్లతో ఎంతో పోరాడిన ఫలితం లేకపోయింది. చివరికి తనని బలవంతంగా అనుభవించారు.

ఇంట్లో తన స్నేహితురాలు ఇంటికి వెళుతూ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది శ్యామల.

ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని అనుకుని నార్మల్ గానే ఇంటికి వెళ్ళింది.
“ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్లకు. మనకు దూరపు బంధువులయిన వాళ్ళు వస్తున్నారు” అని చెప్పాడు రామయ్య.

రామయ్య మాటకు ఎదురు చెప్పలేక ,
“అలాగే నాన్నగారు…” అని చెప్పింది శ్యామల.
ఒక గంట తర్వాత దూరపు బంధువులైన శ్యామలకు అత్త మామ బావ అవుతారు.
మురళికి తొలిచూపులోనే శ్యామల తనకి నచ్చింది.

“వాళ్లు కొన్ని రోజులు తన ఇంట్లోనే ఉంటారు” అని భారతికి చెప్పాడు రామయ్య.
ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నారు శ్యామల ,భారతిలు.
మురళి ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ. అమ్మయ్య వాళ్ళ కుటుంబానికి దూరపు బంధువులు.
రెండు రోజుల తర్వాత ,
“శ్యామల నాకు బాగా నచ్చింది , మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మా ఇద్దరికీ పెళ్లి చేయండి” అని అడిగాడు మురళి.

ఈ విషయం శ్యామలకు తప్ప ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కానీ మురళి మాత్రం ఈ విషయం ఇప్పుడల్లా చెప్పద్దు నేనే స్వయంగా చెప్తాను శ్యామల కి అని చెప్పాడు.
దానికి అందరూ అంగీకరించారు. ఒకరోజు అందరూ కలిసి గుడికి వెళ్లారు.

“శ్యామల నీతో కొంచెం మాట్లాడాలి” అని అడిగాడు మురళి.
“ఏంటో చెప్పండి?” అని దిగులుగా అడిగింది శ్యామల.
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంట్లో వాళ్లకి కూడా చెప్తే వాళ్లు ఒప్పుకున్నారు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేస్తారని” చెప్పాడు మురళి.

ఈ మాట విని ఆశ్చర్యానికి లోనయ్యి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్యామల.
మరుసటి రోజు కాలేజీలో ,
“యాష్… నువ్వు చేసిన పనికి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే లేదంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను” అని ఏడుస్తూ చెప్పింది శ్యామల.

“ఏంటే బెదిరిస్తున్నావా? చచ్చిపోతే చచ్చిపో నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను” అని పొగరుగా చెప్పాడు యష్.

“అది కాదు బలవంతంగా మీ అందరి నా మీద అత్యాచారం చేసిన ఇంట్లో వాళ్లకి చెప్పకపోవడానికి కారణం నిన్ను ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటానని నమ్మకంతోనే ఉన్న , కానీ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు” అని చెప్పింది శ్యామల.
“ఆ పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఉండు” అని నవ్వుతూ చెప్పాడు యాష్.
“అది కాదు… నా మాట విను” అని శ్యామల అడుగుతున్న కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు యాష్.

ఇంకొకసారి తన ప్రేమ విషయం చెప్పాలి అని కాలేజ్ కి వచ్చాడు మురళి.
యాష్ , శ్యామలలా మాట్లాడుకున్న మాటలు విని నా ప్రేమను కాదనడానికి ఇదా కారణం అని అనుకున్నాడు మురళి.

స్నేహమనే ముసుగు వేసుకొని నన్ను బలవంతం చేసే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి , ఇప్పుడు ఆ మాట మార్చాడు అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది శ్యామల.
నిశ్చితార్థం కారణంగా గతంలో ఒక పెళ్లి చెడిపోవడం వల్ల పెళ్లికే ముహూర్తాలు పెట్టారు.
నెల రోజుల్లో పెళ్లి అయిపోయింది.  శ్యామల మురళి తో అందరూ ఉన్నప్పుడు ఒకలా ఎవరూ లేకపోతే అసలు మాట్లాడేది కాదు.

యాష్ తన ఫ్రెండ్స్ యాక్సిడెంట్లు చనిపోయారని టీవీలో శ్యామల చూసి ఆశ్చర్యానికి లోనయింది.
అప్పుడు ఇంట్లో పెద్ద వాళ్ళు ఎవరూ లేరు శ్యామల మురళి మాత్రమే ఉన్నారు.
మురళి ఆ న్యూస్ చూసి నవ్వుతూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

‘ఎందుకు మురళి నవ్వుతూ వెళ్ళిపోయాడని’ తన వెనకాలే వెళ్ళింది శ్యామల.
“బావ… ఆ న్యూస్ లో చెప్పింది నిజమే కదా బావ ఎందుకు నవ్వుతూ వచ్చావ్?” అని అడిగింది శ్యామల.

“వాళ్లది యాక్సిడెంట్ కాదు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళని చంపేసి ఆ జీపులో వేసేసి ఆక్సిడెంట్ గా సృష్టించాను” అని నవ్వుతూ చెప్పాడు మురళి.
అంటే వాళ్ళని చంపింది నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది.

“అవును కానీ మా డిపార్ట్మెంట్ కి బయట వాళ్ళకి ఎవ్వరికీ సాక్షాదారాలు లేకుండా చంపాను” అని చెప్పాడు మురళి.
“ఎందుకు బావ ఇలా చేశావు?” అని అడిగింది శ్యామల.

నీ జీవితమే కాదు నీలాంటి ఎంతోమంది అమ్మాయిల జీవితం నాశనం చేశారు ఈ నీచులు. కానీ వాళ్ళు చేసిన తప్పుకు మాత్రం ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఒక్క అమ్మాయి కూడా ఇప్పుడు బ్రతికి లేదు , అందుకే నువ్వు ఒక్కదానివే బ్రతికున్న  నువ్వు అంత ధైర్యం చేయలేక , యాష్ ని పెళ్లి చేసుకోమని అడిగావు” అమాయకురాలాగా అని కోపంగా చెప్పాడు మురళి.
“ఈ విషయాలన్నీ ఎలా తెలుసు బావ నీకు?” అని అడిగింది శ్యామల.

“నేను ఒక రోజు కాలేజీకి నిన్ను కలవడానికి వచ్చాను. యష్ తో మాట్లాడటం చూశాను అప్పుడే ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను. ఆ విచారణలోనే నేను చాలా విషయాలు తెలుసుకున్నాను.
ఇప్పటికైనా దిగులుగా ఉండడం మానేసి సంతోషంగా ఉండు అత్తయ్య , మావయ్యలు  చూసి సంతోషంగా ఉంటారు” అని చెప్పాడు మురళి.

తన గతం తెలిసి కూడా తన మీద ప్రేమతో పెళ్లి చేసుకున్న మురళిని చూసి ప్రేమించడం మొదలుపెట్టింది శ్యామల.

మురళితో తన కొత్త జీవితం మొదలు పెట్టాలి అనుకుంది.
శ్యామలకి తన బలమయ్యాడు మురళి.

ఇలాగే కొందరు అమ్మాయిలు తప్పు చేస్తున్నారు వాళ్ళ సంకల్ప బలం ముందు ఏ బలం నిలవదు అది తెలుసుకొని ఉండండి. మీ గతం ఏదైనా సరే భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ముందుకు అడుగులు వేయండి.

మనిషికి బలం బలహీనతలు ఉంటాయి కానీ బలహీనత దగ్గర దొరికిపోయిన బలం మనల్ని విజయం వైపు అడుగులు వేయిస్తుంది. నీ బలహీనత ఎవరికీ చెప్పుకోకు అదే నీకు ప్రమాదం అవుతుంది.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *