మాట మాటకు తప్పు బోడ నెత్తికి ముప్పు అని సామెత..

మాట మాటకు తప్పు బోడ నెత్తికి ముప్పు అని సామెత..
నిజంగానే మాట మాటలో తేడా ఉంటుంది ..
కొందరు మాట్లాడితే పుల్ల విరుపుగా కఠినంగా ఉంటది మరి కొందరు మాట్లాడితే తేనె కన్నా తియ్యగా ఉంటది..

తీపుల మాటలకు తీర్థం పోతే వాడు గుడిలో! వీడు చలిలో! అన్నట్టుగా! అంటే వాడు తియ్యగా మాట్లాడి యాత్రకు తీసుకు పోతాడు కానీ వాడి సుఖం వాడే చూసుకుంటాడు వీడిని పట్టించుకోడు..
తీయగా మాట్లాడుతూనే గోతులు తీస్తారన్నమాట..

మాటల్లో మాటలు ఎంత తేడా అండి..

ఏ జంతువులకు మాటలు రావు మనలాగ అసలు దేవుడు వాటికా అవకాశం ఇవ్వలేదు కానీ ఇప్పుడు దేవుడు కూడా మనుషుల మాటలు చూసి వాళ్లు చేసే గారడీలు ( అవేనండి మాటల గారడీలు చేసి బుట్టల వేసే పద్దతి ) చూసి వీళ్లకెందుకు మాటలు ఇచ్చానురా! దేవుడా? బాబోయ్! అనుకుంటున్నాడు..

అయ్యెా! దేవుడంటే నేనే కదా! అనుకుంటున్నాడట మళ్లీ!
ఇక నోటు సంగతంటారా? అమ్మెా చెప్పేదేముంది?
దాని మీదే నడుస్తుంది ప్రపంచమంతా!
దానికున్న విలువ అంతా ఇంతా కాదండోయ్!
మాటెవరు వింటారు? నోటుండగా!
సామాన్య మానవుని నుండి సెలబ్రిటీల వరకు కూడా అందరికీ నోట్లే అవసరం..
నోట్లు వాడుతూ నీటుగా బ్రతకడం నేర్చారు కొందరు..
కొందరేమెా కుట్రలు,కుతంత్రాలు ,మెాసాలు నేర్చారు..
ఎన్ని నేర్చినా పైకెళ్లాకైనా వారి మెాసాలకు శిక్ష అనుభవించాల్సిందే!!
ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు..
అదండి సంగతి..

 

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *