మామిడి పచ్చ రుచి.. పిట్ట కథ 3 Yummy Pickle Short Story

మామిడి పచ్చ రుచి.. పిట్ట కథ

మామిడి పచ్చ రుచి పిట్ట కథ
మామిడి పచ్చ రుచి.. పిట్ట కథ

వేసవి కాలం వచ్చేసింది కాబట్టి అందరూ మామిడి కాయలు పండ్లు తింటూ ఉంటారు కదా అయితే మా చిన్న తనం లో మామిడి కాయలని ఇంట్లో మాత్రం తినేవాళ్ళం కాదు మరి ఎక్కడ తినేవారు అని మీరు అంటారు కదా,

నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చదువుతున్న రోజులు అప్పుడు నేను మా అత్త లతో పాటు అందరి దోస్తులు ఇళ్లకు పోతుండే దాన్ని.

అప్పుడు మా దోస్తులు ఇళ్లలో నుండి మామిడి కాయలు తీసుకుని వచ్చి అందరం అందులో ఉప్పు కారం వేసుకుని తినేవాళ్ళం అయితే అలా దొంగతనంగా తినేవి చాలా రుచిగా ఉండేవి.

కానీ దొంగతనం ఎన్నో రోజులు దగదు కదా మేము దొంగతనంగా కాయలు తీసుకుని వెళ్లి తినడం మా దోస్తులు అవ్వలకు తెలిసి వాళ్లను పొట్టు పొట్టు కొట్టారు ఇక అప్పుడు మా దొంగతనం ఆగిపోయింది.

అయితే మేము ఉరుకుంటామా ఎంతైనా అలవాటు పడిన పానం కదా కాబట్టి మేము అప్పుడే మా నాయనమ్మ.

 మామిడి పచ్చ రుచి.. పిట్ట కథ

మామిడి పచ్చ రుచి.. పిట్ట కథ
మామిడి పచ్చ రుచి.. పిట్ట కథ

కాదు మా నాయనమ్మ పర్యవేక్షణలో మా అమ్మ పెట్టిన కొత్త ఆవ పిక్కలు వేయించుకుని అన్నం లో కలపకుండా నీళ్లలో కడిగి వాటిని జెబులోనో సంచిలో వేసుకుని బడికి వెళ్ళి అక్కడ అందరికీ తలా ఒక పిక్క ఇచ్చేదాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు కదా అందుకే నేను వాళ్ళకు ఇచ్చేదాన్ని.

ఇక ఆ ముక్కలను మేము కొద్ది కొద్దిగా కొరుకుతూ తింటూ ఉంటె అహ సూపర్ టేస్ట్ ఉండేది ఇదండీ మా మామిడి పచ్చ కథ …

మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటె మాకు చెప్పండి మరి ఉంటాను.. సెలవు

Related Posts

1 Comment

Comments are closed.