పెద్ద కథ మార్పు అవసరమే

అయితే ఏమంటావ్ ఇప్పుడు నువ్వు నాకు ఉన్నదంతా ఇచ్చి చేసాను, ఇప్పుడు ఇంకా కావాలి అంటే ఎక్కడినుంచి తేవాలి వేదనగా అన్నాడు రామ్మూర్తి ఏమో నాన్న ఆయనకు ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన కొత్త బైక్ కావాలట ఎలాగైనా తెమ్మని నన్నుపంపారు అందిక్రాంతి అలా అడగడం బాధగా ఉన్న అడగక తప్పడం లేదు అలా అడగకపోతే తండ్రి ఇవ్వడు ఇవ్వకపోతే తనకి అత్తతో మొట్టికాయలు తప్పవు,అందుకే బాధ గా ఉన్న కూడా తండ్రి పరిస్థితి తెలిసినా అడగక తప్పడంలేదు పైగా తన తర్వాత చెల్లికి కూడా పెళ్లి చేయాల్సి ఉంది. ఇవ్వన్నీ తెలిసినా తన అత్త మాటలు గుర్తుకొచ్చి పట్టుదలతో తండ్రిని విసిగించి మరి డబ్బులు తీసుకుని వెళ్ళింది క్రాంతి అత్తారింటికి క్రాంతిఒక అందమైన అమ్మాయి తండ్రి గారాలపట్టి తల్లికి బుజ్జమ్మ అన్నయ్య ముద్దుల చెల్లి చెల్లికి మంచిఅక్క ఇదంతా పెళ్లికిముందు బి.ఈ .డి తర్వాతచూసి చూసి మరి మధ్యవర్తి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అయిన మల్లిక్ కి ఇచ్చి పెళ్లి జరిపించారు వాళ్ళుఅడిగిన కట్నం బంగారం వంట సామాను అన్ని ఇచ్చారు పెళ్ళిలో అలిగిన అల్లుడికి ఒప్పుకోకపోయినా బంగారు ఉంగరాన్ని కూడా పెట్టారు అదొక ఖర్చు అయ్యింది. ఇంతా చేసి పెళ్లి చేసి పంపిస్తే పంపిన నెల రోజులకే మళ్ళీ డబ్బు అంటూ వచ్చింది క్రాంతి.అలా ఇప్పటి వరకు పెళ్లి అయిన ఈ ఒక్క సంవత్సరం లొనే పదిసార్లు వచ్చి తండ్రిని అన్నను అడిగి మల్లిక్ అడిగిన డబ్బు పట్టుకువెళ్ళింది. తల్లికి ఒక అనుమానం కూడా వచ్చింది ఇది కావాలనే మా దగ్గర డబ్బు పట్టుకువెళ్తుందా? అతను నిజముగా అడిగాడా? లేదా? అని …అయినా ఆడపిల్ల కాబట్టి అక్కడ ఎం అంటున్నారో అని గట్టిగా అడగలేకపోయింది తల్లి.

క్రాంతి రావడం చూసిన లక్ష్మి రమ్మా కోడలు పిల్లా వచ్చావా రావేమో అనిఅనుకున్నా అంటూ కోడలు చేతిలో ఉన్న పర్స్ తీసుకొని కాదు గుంజుకొని పర్స్ లో ఉన్న డబ్బులు తీసి లెక్క పెట్టుకుంటూ ఆఆ వేళ్ళు వెళ్లి అంట్లు తొమి మాకు ఇంత వండిపెట్టు అని గదిమింది. క్రాంతి తలవంచుకుని గబగబా లోనికి వెళ్ళింది తన పని చేసుకోవడానికి,పెళ్లి అయిన రెండో రోజు నుండే క్ర్న్తికి పని చెప్పడం మొదలు పెట్టి మెల్లిగా పనిమనిషిని కూడా మానిపించి,చివరికి బాత్రూం లు కూడా కడిగించడం మొదలు పెట్టింది.పెళ్లికి ముందు తమ ఇంట్లో పనిమనిషి ఉన్నది అని చెప్పిన అత్తగారు పెళ్లి అయ్యి తను వెళ్ళాక ఇక అన్నిపనులు అప్పచెప్పింది మల్లిక్ తో అంటే అమ్మచెప్పింది చేయిక్రాంతి అని ఒక్కముక్కలో చెప్పి వెళ్ళిపోయాడు ప్రొద్దున్నేలేవడం ఇల్లు,వాకిలి శుభ్రంచేసి స్నానం చేసి అత్తకు టీ పెట్టి ఇవ్వాలి ఆవిడకు వంట చేసి బాక్స్ కట్టాలి ఆతర్వాత భర్తకు కావాల్సినవి చూసి అతనికి కూడా బాక్స్ కట్టి ఇవ్వాలి అత్త ఏ రోజు కావాల్సిన వంటసామగ్రి పప్పు పోపువస్తువులు ఆ రోజే ఇస్తుంది.కాస్త కూడా ఎక్కువ ఇవ్వదు ఆమె ఇచ్చిన బియ్యం తో అన్నం వండి ఇద్దరికీ బాక్స్ లు పెట్టాక అందులో మిగిలింది మధ్యాహ్నం తాను తినాలి అంతే ఇక ప్రొద్దున వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయాలి చపాతీ పూరీ బియ్యంరొట్టి, జొన్నరొట్టె కాని వాళ్ళకి పెట్టాలి అది కూడా అప్పటికి అప్పుడే వేడిగా ఎన్ని కావాలో అన్నే చేయాలి ఎక్కువ చేయకూడదు తాను తినకూడదు నీకెందుకు టిఫిన్ హాయిగా మేము వెళ్ళాక ఉన్నది తిని పడుకొక అని అంటుంది లక్ష్మి. మొదట్లో క్రాంతికి చపాతీలు జొన్నరొట్టెలు చేయడం రాదు అసలు తన పుట్టింట్లో జొన్నరొట్టె తినరు ఎప్పుడైనా చపాతీ అంతేతప్ప ఇవ్వేవి చేయడం రాదు రాదు అని అనగానే తన ఆడపడుచుల ముందుమొట్టికాయలు వేస్తూ నీతల్లి నీకు పని నేర్పలేదా?అని అంటూ బండబూతులు తిడుతూ ఉంటే తనకి బిక్కచచ్చినట్టు అయిపోయింది తనపరిస్థితి ఆడపడుచులు నవ్వుతూ వెక్కిరించారు.కనీసం తోటి ఆడపిల్ల అని తనకి సపోర్ట్ కూడా ఇవ్వకుండా అక్కలతో పాటు నవ్వుతున్న మల్లిక్ నీ చూసి అస్యహించుకుంది.నువ్వు నేను అడిగినప్పుడల్లా డబ్బు తేకపోతే నిన్నూ నీ భర్తను ఎప్పటికీ ఒకటి చేయదు మా అమ్మ కాబట్టి నువ్వు డబ్బు ఖచ్ఛితంగా తేవాలి అని చెప్పిన మల్లిక్ నీ ఇంకా అస్యహించుకున్న క్రాంతి ఏం చేస్తుంది పాపం.మొదట్లో ఒక రెండునెలలు భరించింది వెళ్లిపోవడం మంచిది అనుకుంది తాను వెళ్లిపోతే తండ్రి గుండెల మీద కుంపటి అవుతుంది అయినా తన తండ్రి పరిస్థితి తెలిసి వెళ్లిపోతే తండ్రి పరువూ పోతుంది చెల్లికి పెళ్లి కాదు అన్నయ్య మొఖం ఎత్తుకుని తిరగలేక పోతాడు అందుకే తన సమస్యను తానే పరిష్కా రించుకోవాలని అనుకుంది కానీ తను అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు ఒకరాత్రి అత్త ఇంట్లో లేని సమయంలో మల్లిక్ తనని బలవంతంగ అనుభవించాడు అత్త వచ్చాక అతని తప్పేమీ లేదన్నట్టు తానే మీద పడినట్లు చెప్పినమ్మించాడు దానికి కూడా అత్త తననే తిట్టిందిఎలాగూ జరిగింది కాబట్టీ ఇక ప్రతిరోజూ తనకి ఇంకో నరకం మొదలు అయ్యింది ప్రొద్దునపనితో అత్తవేసే మొట్టికాయలుతింటూపెట్టిన అన్నంతిని పనిమనిషికన్న హీనంగాచూడబడుతూ రాత్రి అవ్వగానే మల్లిక్ చేసే అకృత్యాలు భరిస్తూoది ఓరోజు బట్టలు విప్పమని అంటాడు.ఇంకోరోజు తనఅక్కలా అలకరించుకోమంటాడు ఇంకో రోజు తన ఆఫీసు లో పని చేసే స్వీపర్ లా ఉండమంటాడు ఓ రోజు సిగరెట్ తో కాలుస్తాడు ఇంకో రోజు ఆగరుబత్తితో సురుకులు పెడతాడు ఇంకో రోజు తొడల మధ్య క్యాండిల్ పెట్టి, క్యాటు వాక్ చేస్తూ రమ్మంటాడు.

ఇలా బాధలు భరిస్తూ జీవితం గడుపుతూఉండగా రెండో సంవత్సరం చివర్లో తనకోక శుభవార్త తెలిసింది. అది తాను తల్లి కాబోతుంది అని ఈ విషయం తెలిస్తే అయినా భర్త అత్త మారతారని అనుకోని చెప్పింది వాళ్ళు చాలా సంతోషించారు అపురూపంగా చూసుకున్నారు అదిచూసిన క్రాంతి ఆనoదించింది ఇలాగైనా వాళ్ళు మారారు అదిచాలు అని సంతోషపడింది.నెలలు గడిచాయి పురుడువచ్చింది పుట్టిన పాపని చూసుకొని మురిసిపోయింది విషయం తెల్సిన లక్ష్మి ఆసుపత్రికి వచ్చి ఆంటీఅంటనట్టు ముట్టి ముట్టనట్లు ముక్తసరిగా మాట్లాడి వెళ్ళిపోయింది.ఇక భర్త కి ఫోన్ చేస్తే ఆఫీస్ లో వర్క్ ఉండడం వల్ల రాలేకపోతున్న అని చెప్పాడు బారసాల కూడా అలాగే జరిగింది భర్త క్యాంప్ అని వెళ్ళాడు అత్త వచ్చిబట్టలు పెట్టించి వెళ్ళిపోయింది రెండ్రోజుల తర్వాత రమ్మనిచెప్పి రాగానే వెళ్ళిపోయింది ఆమె ప్రవర్తనకు బాధ పడిన తండ్రి తల్లికి ఎదో సర్దిచెప్పి రెండ్రోజుల తర్వాత తిరిగి ఆ నరకం లోకి ప్రవేశించింది క్రాంతి మరల ఒక్క రెండురోజులు బానేఉన్న భర్త అత్త పనులు చేయమని అనడంతో కనీసం బాలింత అని కూడా చూడకుండా అత్త పని చేయకపోతే తిండి ఎలా వస్తుంది ఇక్కడ నీ అబ్బా సంపాదించింది ఎం లేదు నేను వాడు ప్రొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం ఇన్ని రోజులు చేసుకున్నాం ఇక నువ్వుచేయాలి నేను ముసలిదాన్ని అవుతున్నా నాకు చేతకాదు అనడంతో ఇక విధిలేక లేచి అన్ని పనులు చేయసాగింది,కనీసం పాపని కూడా చూడదు అక్కడే ఉన్నా పాప ఏడుస్తున్నా పట్టించుకోదు అత్త భర్త కూడా కనీసం ఎత్తుకొడు ఎక్కడో వంటింట్లో ఉన్న తనకి పాప ఏడుపు విపిపించి వెళ్తే ఇది ఇప్పుడే ఎడవాలా అంటుంది పాపని ఎత్తుకొని పని చేయి మేము చేసుకోలేదా అత్తగారింట్లో మాకూతుర్లు చేసుకోవడం లేదా పిల్లలని మేముకన్నాం పెంచాం, అనిఅంటూ తలమీద మొట్టికాయలు వేస్తుంది పచ్చిబాలింత అని కూడా చూడకుండా ఇంట్లో మిగిలిన అన్నం కూరలు పాడైపోయినవి తెల్లారి పెడుతుంది రాత్రికి చపాతీలు పెడుతుంది అవి కూడా రెండే పాలుతాగే తల్లికి కావలిసిన బలమైన ఆహరం పెట్టదు అది కూడా తినపోతే పాపకు పాలు రావని ఎలాగో మింగుతుంది క్రాంతి….

ఒకరోజు ఎప్పట్లాపని చేసుకుంటుంది క్రాంతి మెల్లిగా వెనక నుంచి వచ్చిన మల్లిక్ గట్టిగా కౌగిలించుకుని ఎక్కడెక్కడో తడమసాగాడు వచ్చి మూడునెలలు అయినా ఒక్కసారి కూడా పలకరించని భర్త కౌగిలించుకుంటే తనకి కోపం వచ్చి తోసేసింది నన్నేతోస్తావా అనిఅంటూ చెంపమీద కొట్టాడు మల్లిక్ అది చూసిన అత్త దీనికి ఈమధ్య పొగరు ఎక్కువయ్యింది రా అంటూ కొడుకు తో పాటు తాను కూడా నాలుగు దెబ్బలు వేసింది.ఇక ఆ రాత్రి తిండి లేదునీరసం తో ఉన్న క్రాంతిని ఓ రాత్రి అతను మళ్ళీ బలవంతంగా ఆక్రమించుకున్నాడు పాప ఏడుస్తున్న పట్టించుకోలేదు అయిదు నిమిషాలు అయ్యాక తన కోరిక తీర్చుకుని వెళ్లిపోతూ జేబులో నుండి రెండు ఆపిల్స్ తీసి ఇచ్చితిను జాగ్రత అని చెప్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు క్రాంతి గబగబా అవితిని తన పాప కి పాలు పడుతూ తన భర్త చేసిన పనికి నవ్వాలో ఏడవాలో తనకి ఈ పరిస్థితి ఇచ్చిన దేవుడిని నిందించాలో అర్థం కాకుండా విరక్తిగా నవ్వుకుంది..

తెల్లరినా లేవని కోడల్ని కట్టేతో కొడ్తూ లే లే ఇంత సేపు పడుకోడానికి ఏదేమైనా నీ బాబుగాడి ఇల్లు అనుకున్నవా అంటూ లేపుతున్న అత్తను చూసి భయపడి గబగబా లేచి పనులు చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది క్రాంతి,అత్త , భర్త వెళ్ళాక తనకి ఉంచిన అన్నం తింటూ ఆలోచిస్తుంది క్రాంతి రాత్రి భర్త చేసిన పని తో తనకి అర్థం అయ్యింది ఒక్కటే తల్లికి భయపడి తనని దూరం పెడ్తున్నాడు తన మాటలవల్లే తనని భాద పెడ్తున్నాడు తప్ప తాను అంటే అతనికి ఇష్టం అని అర్థం అయ్యింది. అయినా తల్లికి భయపడేవాడు తల్లి మాటలువిని తనని భాదపెట్టె వాడు ఒకమనిషేనా అని అనుకుంది ఇంతలో పాప ఏడవడంతో ఈ లోకం లోకి వచ్చి గబగబాతిని పాపని ఎత్తుకుని మళ్ళీ బట్టలు ఉతకడానికి వెళ్ళింది క్రాంతి ఇలా రోజు అత్త మొట్టికాయలు రాత్రుళ్ళు భర్త శారీరకసుఖాన్ని అందిస్తూ అతని భరిస్తూ ఉండగా…

దాని ఫలితంగా మళ్ళీ గర్భవతి అని తెలిసి అత్త ఈసారి ఖచ్చితంగా కొడుకునే కనాలి అని వార్నింగ్ ఇచ్చింది.పురుడు తమకు ఆచారం లేదని మీరే చేయాలని క్రాంతి తల్లిదండ్రులని పిలిచి వాళ్ళకి అప్పగించింది అత్త క్రాంతిని రెండో సారి మీరే చేసుకోండి వదినగారు అన్న క్రాంతితండ్రిని తన చూపులతో ఆపింది మాకు చేసే వాళ్ళు ఎవరులేరు మేమిద్దరం ఆఫీసుకి వెళ్లకపోతే ఎలా అని దీర్ఘాలు తీస్తూ మాట్లాడేసరికి ఇక తప్పక క్రాంతిని తిరిగి తెచ్చుకున్నారు.

క్రాంతి చెల్లి పెళ్లి కుదిరేలా ఉన్న టైం లో ఈ ఆపద వచ్చింది అని అనుకున్నారు దానికి క్రాంతి చెల్లి అమ్మ ఎందుకు అలా మాట్లాడతారు మన అక్క మనకి బరువా అని అనగానే అవునమ్మ మన చెల్లి మనకి బరువా పెళ్లి ఎప్పుడైనా చేయొచ్చు వాళ్ళకి ఎలాగో సర్ది చెబుదాం అని అన్నఅనడంతో సరే బావ మాకెమి అభ్యoతరం లేదు అన్న మాటలు వినగానే అతని చూసి చెల్లి లోనికి వెళ్ళింది ఎవరు అన్నట్లుగా చూసింది క్రాంతి సారధి అమ్మ మన వల్లికి కాబోయే భర్త అని చెప్పగానే సారధి ఓహో వదినగారా నమస్కారం మీపేరు వినడమే తప్ప మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నాడు వాళ్ళ మాటలతో కొంత సేదదీరింది క్రాంతి నిజమే తన చెల్లి నిశ్చితార్ధం ఉన్నా తనని పంపించలేదు ఇక ఎలా తెలుస్తుంది అని అనుకుంది. తమ కూతురు పురుడుకు వచ్చిందని ఇంకో ముహూర్తం పెట్టుకుందామని చెప్పారు సారధి అమ్మానాన్నలకు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు పురుడు వచ్చింది మళ్ళీ అమ్మాయే పుట్టింది ఈ సంగతి తెలిసిన అత్త భర్త రాలేదు ఈ సారి కూడా ఇక వాళ్ళు మారరని తెలీసి సారి బారసాల వద్దు అన్నది క్రాంతి ఆ పాప ఎం పాపం చేసిందే అని చెల్లి మరి గొడవపడి బారసాల చేయించింది పట్టుబట్టి మరి సరేనని చేయించాము. ఈసారి కూడా ఆయన రాలేదు కానీ ఫోన్ చేసి డబ్బు ఈసారి ఇంకా ఎక్కువ తెమ్మని చెప్పారు అప్పటికి సరేనన్న క్రాంతి ఆ తర్వాత కొన్నిరోజులు తల్లి గారింట్లోఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ అత్తగారి ఇంటికి బయలుదేరి వెళ్ళింది ఇద్దరు ఆడపిల్లలని తీసుకొని వచ్చిన కోడలిని చూసి లక్మి మూతి విరిచింది. ఆ తర్వాత ఇంకా క్రాంతి కి చాలా ఆoక్షలు విధించింది వంట ఇంట్లోకిరాకూడదు తన అనుమతిలేకుండా వంట చేయకూడదు తనకు తెలీకుండా భర్తతో మాట్లాడకూడదు కనీసం పిల్లలకి అన్నంకూడా పెట్టుకోకూడదు ఫస్ట్ అమ్మాయికి అయిదు సంవత్సరాలు నిండాయి చిన్నపాప ఇంకా పాలు తాగుతూoది.

ఒక రోజు క్రాంతి అత్తగారి తో అత్తయ్య పాపకి ఐదు ఏళ్ళు నిండాయి స్కూల్ లో జాయిన్ చేయాలి మంచిరోజు చూసి జాయిన్ చేద్దామా అని అడిగింది హఅదొక్కటీ తక్కువ ఇప్పుడు దాని చదువుకు వచ్చిన ఢోకా ఏమి లేదు పర్లేదు నీకు వచ్చింది చెప్పుకో అయినా రేపు నా మనుమరాలు వస్తుంది దానికి ఒకరూమ్ కావాలి అది ఇక ఇక్కడే ఉండి చదువుకుంటుంది వేళ్ళు వెళ్లి రూమ్ సర్దు అని కసిరింది కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆడపడుచు కూతురు వస్తుంటే కనీసం తనకిచెప్పారా కనీసం ఈఇంట్లో ఉండే యజమాని భార్య అని కూడా వాళ్ళకి తెలీదా? పోనీ కాకున్నా కనీసం పనిమనిషికైనా వంట చేసే మనిషికైనా ఒకరు ఎక్కువగా వస్తున్నారు వంట ఎక్కువ చేయాలి అని చెప్పారా అని అనుకుంది మనసులో కానీ పెదవి దాటి ఒక్క మాట కూడా బయటకు రానివ్వలేదు తెల్లారింది ఆడపడుచు కూతురు వచ్చింది ఇంట్లో పనితో పాటు ఆమె బట్టలు తిండి మిగతా పనులన్నీ చేయాలి ఆ అమ్మాయి కి ఏజ్ వచ్చింది కానీ పీరియడ్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు అలా ఆ అమ్మాయికి ఏదీ అయినా చెప్పబోతే ఆ పిల్ల అమ్మమ్మ అంటూ ఏడుపు మొదలు పెట్టడం, అది చూసిన అత్తగారూ కోడల్ని రాచిరంపాన పెట్టడం అలవాటు గా మారింది.ఇవ్వన్నీ చూస్తూ ఉండగానే ఆ పాపది పదవతరగతి అయిపోయింది కానీ తన కూ తుర్లని మాత్రం స్కూల్ లో వేయలేకపోయింది క్రాంతి, ఆ అమ్మాయి సెలవుల్లో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లిపోయింది.

సెలవులు కాబట్టి మీ అమ్మ వాళ్ళింటికి వెళ్ళి పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేయాలిఅని డబ్బు పట్టుకుని రా అంటూ అత్త కొట్టి తరిమేసింది భర్త ఏమి మాట్లాడలేదు దాంతో క్రాంతి తిరిగి పుట్టింటికి వచ్చింది,పుట్టింటికి వచ్చిన క్రాంతి తల్లిదండ్రులకి ఏమి చెప్పలేదు కానీ చెల్లి వల్లితో వెళ్లి కొన్ని స్కూల్స్ తిరిగి చివరికి ఇక స్కూల్ లు స్టార్ట్ అవుతాయి అనగా ఒక స్కూల్లో జాబు వచ్చేలా చేసుకుంది. ప్రతిరోజు వల్లితో పాటు తానుకూడా రెడిఅయ్యి స్కూల్కి వెళ్ళసాగింది తల్లి తండ్రికి చెప్పింది తనకు జాబ్ వచ్చిన సంగతి అది తెలియగానే తల్లి తండ్రి నువ్వు ఇక్కడ జాబ్ చేస్తుంటే ఎలా నీ భర్త వచ్చి తీసుకు వెళ్తా అంటే వెళ్ళావా అని అడిగారు.

ఇక్కడ క్రాంతి అత్తగారి గురించి కొంచం చెప్పుకోవాలి, లక్ష్మీ ఒక మాములు మధ్యతరగతికి చెందినది ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్త చనిపోయారు కాదు చంపింది అని ఊర్లో టాక్ దాదాపు ఇరవైసంవత్సరాల క్రితమే అది జరిగింది.ఆమె భర్త ఎదో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవాడు కానీ అతనికి తాగుడు వేరే ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు ఉండేవి అతను తాగి వచ్చి ఆమెని పిల్లల్ని కొట్టేవాడు ఆమె కూడా అన్ని బాధలు అనుభవించింది కానీ ఇక భరించలేక అతను తాగే మందులో ఎదో పురుగుల మందు కలిపి అతన్ని చంపింది ఆ విషయం బయటకి రాకుండా ఊరివాళ్లను తన అందంతో ఆకట్టుకొని ఎలాగో కేస్ అవ్వకుండా చేసుకుంది ఊరి వాళ్ళుకూడా ముగ్గురు పిల్లలు ఉన్నారని పాపం అని వదిలేశారు ఇక అప్పటి నుంచీ, ఊర్లో ఉన్న పొలాలని కౌలుకు ఇచ్చి పట్టణం లాంటి ఊర్లో ఉండి తన భర్త జాబ్ తనకు వచ్చేలా అందరి కాళ్ళు పట్టుకుంది కానీ ఆమె చదువుకున్న చదువుకు నీకు జాబ్ రాదని చెప్రాసి గా వస్తుంది అని కొంతమంది ఆమెకు జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి ఆమెని శారీరకంగా వాడుకొని చివరికి చెప్రసిగా జాబ్ వచ్చింది అయినా కూడా ఆమె అదే జాబ్ చేస్తూ ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉంటూ పిల్లలని స్కూల్లో వేసి బ్రతకసాగింది….

కానీ కొందరు ఆమెని వాడుకోవాలని చూడడంతో ఎవరైనా ఒక మగతోడు అవసరం అని తెలుసుకొని ఒక బట్టల షాప్ ఓనర్ని ఉంచుకుంది ఆ సంగతి అందరికి తెలిసేలా చేసుకుంది అతన్ని ఇంటికిపిలిచి మందు తెప్పించడం అతనికి ఇష్టం అయిన పదార్థాలు వండి పెట్టడం చేసేది. పిల్లలకి ఏమి తెలీకుండా జాగ్రత్త పడేది అలా అలా అందరితో కలివిడిగా ఉంటూ చివరికి పహానిలురాయడం నేర్చుకుని చదువుకొని చివరికి జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ తన ఇద్దరుఆడపిల్లలకి సంబంధాలు చూసి పెళ్లి చేసింది.వాళ్ళ పెళ్లిళ్లు అయ్యాక ఇక బంధువుల ముందు గొప్పలు చెప్పుకోవడం తన పిల్లలు తానుగీసిన గీతదాటరు అని అంటూ బంధువుల పిల్లలని గేలి చేస్తూ ఉండేది పిల్లల ని కూడా అదుపులో పెట్టుకుంది.

వాళ్లేమి చేయాలన్న ఆమె అంగీకారం కావాల్సిందే తల్లి ఏం చేసినా అడగకూడదు ఇలా పిల్లలని భయపెట్టి వాళ్ళకు పెళ్లిళ్లు చేసి పంపింది కానీ పెద్దకూతురు మాత్రం తాను ప్రేమించిన ఆంధ్ర బ్రాహ్మణ అతన్ని పెళ్లి చేసుకుంది అయినా తన మాటే విన్నారు అది నేను చూసిన సంబంధమే అని అంటూ బంధువులకు గొప్పగా చెప్పుకుంది బంధువుల పిల్లలని బంధువులని ఎగతాళి చేస్తూ ఉండేది ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు అయ్యాక కొడుకు పెళ్లి చేసింది తానూ పడ్డ బాధలు కోడలు కూడా పడాలని అనుకోని కోడలిని కొట్టేది వాళ్ళు కలవకుండా కొడుకుని దగ్గర పడుకోబెట్టుకునేది లక్ష్మి కి భర్త పెన్షన్ మరియు తాను జాబ్ చేసే జీతం కూడా వచ్చేది ఇవి కాకుండా ఆఫీస్ కు వచ్చిన వాళ్లదగ్గర కూడా డబ్బులు అడిగేది ఇలా బాగా సంపాదించి చివరికి హైదరాబాద్ లో ఒకప్లాట్ కూడాకొన్నది కొడుక్కి తన పరపతి ఉపయోగించి సెంట్రల్ లో జాబ్ కూడా ఇప్పించింది…ఇది లక్ష్మి గతం ఇక ప్రస్తుతం చదవండి….

లేదు నాన్న నేను ఇక అత్తగారింట్లో ఉండలేను అని అనగానే అదేంటే నువ్వు ఇక్కడ ఉండి చేసేది ఏముంది మంచి అత్త భర్త నిన్ను బాగానే చూసుకుంటున్నారుకదా ఇక ఇబ్బంది ఏముంది? ఎందుకు వెళ్ళను అంటున్నావు? ఏం జరింగింది చెప్తే కదా తెలిసేది అని మండిపడింది తల్లి. ఇక దాచడం అనవసరం అని అనుకోని క్రాంతి తండ్రిని తల్లిని అమ్మ మీరు ప్రశాంతంగా కూర్చోండి మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నది ఏంటమ్మా అది అని తండ్రి అడిగాడు ముందు మీరు కూర్చొoడి నాన్న అని చెప్పి పిల్లలని ఆడుకోడానికి పంపింది ఆ తర్వాత గది తలుపులు మూసి తానూ కూడా కూర్చొoది అమ్మ నాన్న మీకు ఇన్నిరోజులు ఒకవిషయం చెప్పకుండా దాచాను మీరు అనుకున్నట్టు నేను సంతోషంగా లేను నా భర్త అత్త నన్ను ఆఇంట్లో ఒక పనిమనిషిలా చూస్తున్నారు. నాకు సర్రిగ్గా తిండి కూడా పెట్టడం లేదుఇక ఇద్దరు ఆడపిల్లలు అని చులకనగా చూస్తూ వాళ్ళకి కనీసం పాలు కూడా ఇవ్వనియకుండా చేస్తున్నారు నానుంచి డబ్బు తప్ప వాళ్ళకి ఏమి అవసరంలేదు ఆడపిల్లలు పుట్టారు అని ఇంకా ఎక్కువ తెమ్మన్నారు ఈసారి అది కూడా మీకు చెప్పలేదు నేను ఎదురు తిరిగితే నన్ను ఇంట్లోంచి పోమన్నారు మా ఆడబడుచు కూతురిని ఇంట్లో పెట్టుకొని చదివిస్తున్నారు నా పిల్లలని స్కూల్ లో వేయమని అడిగితే, ఆడ ముండలకి చదువు ఎందుకు? అని ఎగతాళి చేస్తున్నారు. ఇక నా భర్త విషయనికి వస్తే ఆయనొక శాడిస్ట్ అతనికి లేని అలవాటు లేదు. తాగడం, వ్యభిచారం, జూదం, మట్కా ఆడడం, వీటి వల్ల అప్పులు చాలా అయ్యాయి. అందుకే నన్ను డబ్బు కోసం పీడిస్తున్నారు. మీరు పెళ్లిలో పెట్టిన బంగారం వస్తువులు అన్ని అమ్ముకున్నారు. అతను నన్ను శారీరకంగా మానసికంగా, హింసిస్తున్నాడు. ఇక మా అత్త అయితే నన్ను కొట్టని రోజులేదు తాను కొట్టిందే కాక తనకొడుక్కి ఉన్నవి లేనివి కల్పించిచెప్పి అతనితో కూడా కొట్టిస్తుంది.ఇక మా ఆడపడుచులు మా పరిస్థితి చూసి నవ్వుతారు తప్ప తల్లిని తమ్ముడిని ఆపే ప్రయత్నం చేయరు పెళ్లి అయినా సంవత్సరానికి కూడా మాకు శోభనం జరిపించలేదు అతను నన్ను దాదాపు రేప్ చేసాడు అది చూసి మా అత్త నన్నే తిట్టింది ఆతర్వాత కూడా అతను నన్నొకబొమ్మలా తనకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు.అసలు నన్నొక మనిషిలా చూడడం లేదు అని జరిగిన విషయాలు చెప్పిoది ఏడుస్తూ …

అదంతా వింటున్న తల్లి, తండ్రి, కొయ్యబారిపోయారు వాళ్ళిద్దరికి గొంతులోంచి మాటలు రావడం లేదు ఇన్నాళ్లు తమ కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉందన్న భ్రమలో ఉన్నారు.డబ్బు అడుగుతుంటే తమ కూతురే అడుగుతుంది అని అనుకున్నారు ఇప్పుడు కూతురు చెప్పింది విని అమ్మా నువ్వు ఇన్ని భాదలు పడ్తూ కూడా మాకెందుకు చెప్పలేదు అని అన్నారు తల్లి తండ్రి మీకు చెప్పాలనే ఉన్నా చెప్పలేకపోయాను అంత ఖర్చు పెట్టి మంచివాడని పెళ్లి చేశారు ఈ విషయాలన్నీ చెప్తే మీరు బాధ పడతారని ఇంకా నా తర్వాత చెల్లి కూడా పెళ్లికి ఉందని గుర్తొచ్చి ఇన్నాళ్లు వాళ్ళు ఎన్ని బాధలు పెట్టిన మౌనంగా భరించాను.ఇక ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అవుతుంది కాబట్టి మీకు చెప్పవలసి వస్తుంది భార్యను ఎలా చూసుకోవాలో తెలియని భర్త కోడలంటే పనిమనిషిలా చూసే అత్త వారసున్ని కనాలని హింసించే వాళ్ళు నాకు అవసరం లేదు ఇన్నాళ్లు ఎలాగోలా భరించాను ఇప్పుడు ఉన్న విషయం మీకు చెప్పాను దీనికీ మీరు పరిష్కారం చెప్పగలరా నాన్న?తండ్రి మౌనంగా ఉండడం చూసి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు చదువుంది స్కూల్ లో జాబ్ వచ్చింది నా కాళ్ళ మీద నేను నిలబడి నా పిల్లలని చదివించుకుంటాను మీకు నేనేమి భారం కాను ఒకవేళ మీరీఇంట్లో ఉండొద్దు అంటే నేను వేరే ఇల్లు తీసుకొని ఉంటాను కానీ ఇక ఆనరకంలోకి వేళ్ళను అని గట్టిగా ఊపిరి పీల్చింది క్రాంతి ఇంతలో డోర్ చప్పుడైంది వెళ్ళి తలుపు తీసింది క్రాంతి వచ్చింది వాళ్ళ చెల్లి వల్లి ఆమె భర్త సారధి బాగున్నారా వదిన అని క్రాంతిని పలకరించాడు సారధి ఆ బాగానే ఉన్నా అని లోనికి వెళ్ళింది క్రాంతి తల్లిని తండ్రిని అత్తయ్యను మామయ్యను పలకరించారు వల్లి సారథులు పిచ్చాపాటి కబుర్లు ఆడుతూ మగాళ్లు ఇద్దరు కూర్చున్నారు సోఫాలో తల్లి వల్లిని తీసుకొని లోనికివెళ్ళింది లోపల అక్కవిషయమoతా వల్లికి చెప్పగానే అయ్యో అవునా అంటూ ఆశ్చర్యపోయింది వల్లి అక్క నాగురించి ఆలోచిస్తూ తన జీవితాన్ని నరకప్రాయం చేసుకుంది ఇప్పుడు ఎంచేద్దాం అని అనుకుంటున్నారు అమ్మ అని అడిగింది వల్లి అది ఇక వెళ్ళను అని అంటుంది ఈ విషయం మీ ఆయనకి అత్తగారికి తెలిస్తే వాళ్ళు ఎలాపీల్ అవుతారో మళ్ళీ నిన్ను ఏమంటారో అని భయపడింది తల్లి ఇక ముందు గదిలో సారధికి విషయమంతా చెప్పాడు రామ్మూర్తి గారు అంతా చెప్పి బాబు ఈ విషయం అంత తెలిస్తే మీ అమ్మ వాళ్ళు ఏమంటారో అర్థంకావడం లేదు అని అనగానే దానికి సారది మామయ్య గారు మావాళ్ళు విశాల భావాలు కలవారు ఏమి అనుకోరు మీరేమి బాధపడకండి ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో కూర్చొని ఆలోచిద్దాం ముందు వికాస్ ను రానివ్వండి అని అన్నాడు ముందు మీరేమైనా తినండి అని అంటూ క్రాంతి రెండు ప్లేటు లో అటుకులు తెచ్చి తండ్రికి సారధి కి తల్లికి చెల్లి కి ఇచ్చి తానూ ఒక ప్లేట్ తీసుకుంది అవ్వయ్యాక టీ పెట్టుకునివచ్చింది అందరూ టీతాగి కూర్చున్నారు ఇంతలో వికాస్ వచ్చాడు రాగానే అందరూ ఒకదగ్గర కూర్చున్నారు ఇంట్లో ఎదో తేడాగా అనిపించి వికాస్ కలవర పడ్డాడు ఏంటి నాన్న విషయం అని అడిగాడు ఆదుర్దగా తన ఇద్దరు కూతుర్లని పిలిచాడు.అందరికి మళ్ళీ ఒకసారి విషయమంతా చెప్పిన క్రాంతి ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం ఏమిటో అని…..

క్రాంతి చెప్పిందంతా విన్న వాళ్ళు మౌనంగా ఉండిపోయారు క్రాంతి వాళ్ళేం చెప్తారా అని వాళ్ల మొఖాల వంక చూస్తూ కూర్చుంది. మొదట గా గొంతు విప్పింది వల్లి అక్క ఇన్ని రోజులు మాకెవ్వరికి ఈ విషయాలు చెప్పలేదు ఎందుకు నీకు కష్టం వస్తే మేము ఉన్నామని మర్చిపోయావా అని అడిగి తండ్రి వైపు తిరిగి నాన్న ఇన్ని రోజులు తాను భరించింది చాలు ఇక నైనా తనని మనశాంతి గా ఉండేలా చూడాలి అని అంటూ ఏమండీ నేను చెప్పిన దాంట్లో తప్పు ఏమైనా ఉందా అని సారధి నీ అడిగింది వల్లి లేదు వల్లి నువ్వు చెప్పింది చాలాకరెక్ట్ గా ఉంది అయినా వదినగారు మీరు చదువుకొని కూడా ఇలాబాధలు పడ్తూన్నారు అంటే అది మీ గొప్పతనం మీరు కుటుంబానికి ఇచ్చిన విలువ మెచ్చుకోదగింది కాబట్టి ఇక మీరేమి ఆలోచించకుండా తదుపరి ఏమిచేయాలని అనుకుంటున్నారూ చెప్తే దానికి తగట్టు మేము కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాం అని అన్నాడు సారధి. తమ్ముడు తల్లి తండ్రి కూడా దానికి సమ్మతించి తమ అభిప్రాయం చెప్పారు ఇప్పుడు నువ్వేమి చేయాలని అనుకుంటున్నావు అన్నట్టుగా చూసారు అందరూ క్రాంతి వైపు..

అందరిని చూస్తూ క్రాంతి గొంతు పేగుల్చుకుని మీరంత నన్ను సమర్ధించడం నాకు సంతోషంగా ఉంది అయితే నేను ప్రస్తుతం జాబ్ లో జాయిన్ అయ్యేక నేనేమి చేయాలో నిర్ణయించుకుంటాను అనిఅంది.సరేనమ్మ నువ్వు బాగా ఆలోచించుకుని ఒక అభిప్రాయంకి వస్తే తదుపరి ఎంచేయాలో అలోచిద్దాం అనిచెప్పి ఎవరిగదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంతలో తల్లిదండ్రులు మళ్ళీతిరిగి వచ్చి అమ్మ క్రాంతి నీకు ఇక్కడ ఏ సమస్య ఉండదు ఇది నీఇల్లు నీకు నచ్చిన విధంగా ఉండు మనసులో ఏమి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పి వెళ్లిపోయారు క్రాంతి ఆలోచించసాగింది ఏం చేస్తే బాగుంటుంది.విడాకులకి అప్లై చేయాలా లేదా మళ్ళీ ఎప్పటిలా వెళ్లి తనతో కాపురం చేయాలా తనకి మళ్ళీ వెళ్ళి కాపురం చేసే ఓపిక లేదు అయిన ఇన్ని రోజులు సహానం ఓపిక తో భరించింది వాళ్ళు మారరు అని తెలుసాక కూడా వెళ్తే మళ్ళీ బొందలో పడినట్టే అవుతుంది,తన పిల్లలకోసం వెళ్ళినా పిల్లల మిద కూడా వారికీ ప్రేమలేదు వారి దగ్గర ఉంటె చావడం ఖాయం అదేదో ఇక్కడ ఉండి తన బతుకు తను బతుకుతూ ప్రశాంతంగా ఉండొచ్చు,ఇక పిల్లల పెళ్ళిళ్ళ వరకు ఆలోచిద్దాం ఇప్పుడు బయట పడిందే ముఖ్యం తన పరిస్థితి ఇంకానయం తనని అమ్మావాళ్ళు అర్ధం చేసుకున్నారు వాళ్ళు కాదు వేళ్ళు అని అంటే నాపరిస్థితి ఎంటో అని ఆలోచించి ముందు జాబ్ లో కుదురుకున్నాక ఏదయినా అలోచిద్దాం కానీ ఎట్టి పరిస్థితి లోను వాళ్ళని మన:శాంతిగా ఉండనివ్వను అని అనుకోని అదే ఆలోచనలతో నిద్ర పోయింది…….

ఒక నెలరోజులు గడిచాయి క్రాంతి జాబ్ లో జాయిన్ అయ్యింది శాలరీ కొంత అడ్వాన్స్ తీసుకుని తనకి పిల్లలకి మంచి బట్టలు కొనుక్కుంది నెల రోజులు మంచి తిండితినడం వల్ల కొంచం రంగు వచ్చిమంచిగా అయ్యారు టైం కి తిండి మంచి నిద్ర ఏ ఆలోచనలు లేకుండా ఉండడంతో క్రాంతికూడా రంగు తేలి బుగ్గలు నిండి చూడడానికి అందంగా కనిపించసాగింది.భార్యవెళ్లి నెలరోజులు అయినా రాకపోవడంతో మల్లిక్ కి పిచ్చెక్కినట్టు అయ్యింది టైం కి తిండి తాగుడు లేకపోవడం టార్చర్ పెట్టడానికి కూడా ఎవరులేకపోవడంతో తల్లి మీద అరవడం మొదలు పెట్టాడు లక్ష్మి కొడుక్కి వండి పెట్టలేక ఆఫీస్ కి వెళ్లి పని చేసుకోలేక సతమతం అవ్వసాగింది ఇంకా ఇంట్లో కూతురి కూతురికి చేయడం ఆమెకి ఇబ్బందిగా మారింది ఇన్ని రోజులు కోడలు చేసి పెడుతుంటే తింటూ వాటికి వంకలు పెడ్తూ ఉండే ఆవిడ నెలరోజులు వండి,వార్చేసరికి తాతలు కనిపించారు దానికి తోడు మనుమరాలు అవి చేసి పెట్టు ఇవి చేసి పెట్టు అని సతాయించడం తో విసుగు వచ్చి కూతుర్ని వచ్చి నీ కూతుర్ని తీసుకు వేళ్ళు అని ఫోన్ చేసింది అయ్యో నా కూతురికి చేయు అంటే నీకు చేతులు రావడం లేదా అని కూతురు నిష్ఠురపు మాటలు అంటూనే కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయింది.మరో నెల గడిచింది క్రాంతి లాయర్ సహాయంతో కోర్ట్ లో కేస్ వేసింది మల్లిక్ ఆఫీస్ కి సమన్లు వచ్చాయి అవి చూసి మల్లిక్ కోపం తో ఇంటికి వచ్చితల్లికి విషయంచెప్పి నువ్వు దాన్ని కొట్టావు కాబట్టే అది వెళ్ళిపోయింది ఇప్పుడు కేస్ పెట్టింది నా పరువు అంతా పోయింది అని అంటూ తల్లి మీద చేయి చేసుకున్నాడు.

అయ్యో నేను కావాలని చేసానా నువ్వు చేసిన అప్పులు తీర్చడానీకె కదరా అడిగింది అంటూ ఆవిడ కూడా కొడుకు మీదకి అరిచేసరికి ఇద్దరూ గొడవలుపడి, కొట్టుకున్నారు తల్లి మీద తనప్రతాపాన్ని చూపించేసరికి ముసలి ప్రాణం తట్టుకోలేక సృహతప్పింది దాంతో భయపడి అక్కలకు ఫోన్ చేసాడు వాళ్ళు వచ్చి ఆమెని హాస్పిటల్ లో చేర్చారు ఆమె కాస్త కొలుకున్నాక ఇంటికి తీసుకువచ్చి అసలు ఎం జరిగింది అని అడిగారు దానికి తల్లి ఉన్న విషయo అంతా చెప్పి ఇక్కడే ఉంటే వీడు నన్ను చంపుతాడే మీతో పాటు నన్ను తీసుకు వెళ్ళండి అని అంటూ ఏడ్చిది.హ మేము ఎలా తీసుకువెళ్తాము మా అత్తగారింట్లో ఒప్పుకోరు నువ్వు ఇక్కడే ఉండు మీరు మీరు ఏమైనా చేసుకోండి అయినా పని చేసే కోడలిని మీరే కావాలని బాధలు పెట్టి ఇదంతా చేసుకున్నారు మీ బాధలు ఏవో మీరే పడండి అని వీళ్ళని తిట్టి చేతికి దొరికినసామాను నగలు తీసుకొని వెళ్లిపోయారు ఇన్నిరోజులు తాను ఎవరినైతేనమ్మిందోవాళ్ళే తనని కాదని వెళ్లిపోయే సరికి లక్ష్మిబాధపడింది కొడుకువచ్చి దగ్గర కూర్చునే సరికి మళ్ళీ కొడతాడేమో అని భయపడి కొట్టకురా నేను నిన్ను కన్నతల్లిని నిన్ను కష్టపడి పెంచుకున్నరా అని చేతులు ఎత్తి దండం పెట్టబోయింది వద్దుఅమ్మ నిన్నుకొట్టను నేను యిలాకావడానికి కారణం నువ్వు నాకు పెళ్లి చేసి నా భార్యతో నేను ఎలా ఉండాలో నేర్పించలేదు దాంతో అది వెళ్ళిపోయింది ఇప్పుడు ఆఫీస్ లో నాపరువు కూడా పోయింది ఆఫీస్ కి వెళ్తే భార్యవదిలేసింది అని చులకనగా మాట్లాడుతున్నారు ఇక నేను ఆఫీస్ కి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు నువ్వే నన్ను పోషించాలి కదా లే లేచి రెడి అయ్యి ఆఫీస్ కి వెళ్లి సంపాదించి నాకు పెట్టు అని అంటూ చెయ్యెత్తాడు వద్దు వెళ్తా అని అంటూ గగబగబ లేచి రెడి అయ్యి వెళ్ళిపోయింది మల్లిక్ మందు తెచ్చుకుని తాగుతూ కూర్చున్నాడు…

ఇక్కడ క్రాంతి జాబ్ లో జాయిన్అయ్యి సంవత్సరం అయ్యింది కోర్ట్ కి ప్రతిసారి వెళ్తుంది కానీ వాళ్ళుమాత్రం రావడం లేదు దాంతో తానుమళ్ళీ మెయిన్టేనేన్స్ కేస్ వేసింది వాళ్ళు రావాలని దాదాపు తాను తిరగడానికి తినడానికి తన జీతం సరిపోతుంది కానీ ఇతర అవసరాలకు డబ్బుసరిపోవడం లేదు అందువల్ల కేస్ వేయడంతో వాళ్ళు రాకతప్పలేదు కోర్ట్ లో ఇద్దరు నిలబడ్డారు లాయర్ ఇద్దరి వాదనలు విన్నాక జడ్జ్ గారు మీకు విడాకులు ఇష్టమేనా అని అడిగారు మల్లిక్ ని లేదుసర్ నా భార్య నాకు కావాలి అని అన్నాడు మల్లిక్ ఎమ్మా మీ భర్త మిమ్మల్ని కావాలని అనుకుంటున్నాడు మరి మీ అభిప్రాయం ఏమిటి అని అడగడం తో సర్ నాకు అతనితో కాపురం చేయడం ఇష్టం లేదు ఆయనొక శాడిస్ట్ నన్ను తాగివచ్చికొట్టడం ఇంకా శారీరకంగా మానసికంగా హింసించాడు దానికి సాక్షాలు ఉన్నాయి అంటూ డాక్టర్ ఇచ్చిన కాగితాలు చూపించింది,అంతా విన్నాక జడ్జి గారు మీకు కౌన్సెలింగ్ అవసరం అని చెప్పి పంపించారు కౌన్సెలింగ్ తర్వాత ఒక ఆరునెలలు కలిసి ఉండమని చెప్పారు దానితో ఇకతప్పక అతనితో కలిసి ఉంది అయినా అతని ప్రవర్తనలో మార్పు లేదు ఇంతా జరిగిన అత్త కూడా మారకుండా కేసులు పెడతావా అని అంటూ ఇద్దరు కలిసి కొట్టారు దాంతో సహనం కోల్పోయిన క్రాంతి ఈసారి డైరెక్ట్ గా కొట్టినదెబ్బలతో అలాగే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్లు ఆమె తిన్న దెబ్బలు చూసి చలించిపోయారు వెళ్లి అతన్ని తీసుకొచ్చి అడిగేసరికి ముందు తాను కొట్టలేదు అని బుకాయించాడు పోలీస్ లు తమ ప్రతాపం చూపించేసరికి నిజంఒప్పుకున్నాడు క్రాంతినీ ఆమె తల్లిదండ్రులను పిలిపించి ఆమెని పుట్టింటికి పంపించారు…

మళ్లీ కోర్టు లో కేసే వేసింది క్రాంతి ఈ సారి విడాకులు అని కాకుండా మామూలుగా మైంటెన్ ఇవ్వాలని వేసింది.తల్లి అక్కలు మల్లిక్ నీ తిట్టిన తిట్టు తిట్టకండా తిట్టి నీకు కావాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు దానికి విడాకులు ఇవ్వు అని అంటూ నీతులు చెప్పేసరికి మల్లిక్ కి అదే మంచిది అనిపించింది సరే అని ఒప్పుకున్నాడు కానీ క్రాంతి మాత్రం కేవలం తాను తన పిల్లలు బ్రతకడానికి కావాల్సిన భరణం ఇవ్వాలని వేసింది మల్లిక్ నీ జడ్జి అడిగారు మీకు విడాకులు కావాలాఅని అవును అని అనగానే క్రాంతినీ అడిగారు విడాకులు కావాలా భరణం కావాలా అని సర్ నాకు విడాకులు అవసరం లేదు అలాగని నేను తనతో కలిసిఉండలేను కానీ అతనికి పుట్టిన పిల్లలు కాబట్టి నాకు వాళ్ళకి కలిపి మేము బ్రతకడానికి కావల్సిన భరణం ఇప్పించమని అడిగింది ఎందుకు నువ్వు అతని తో కలసి ఉండవు అని అడిగిన ప్రశ్నకి బదులుగా తన దెబ్బలని చూపించింది దాంతో జడ్జ్ ఏమిఅనలేక ఆమె చెప్పింది కరెక్ట్ గానే ఉంది అని తీర్పు చెప్పారు ఇద్దరు కలిసి ఉండలేరు కాబట్టి విడివిడిగా ఉంటూ పిల్లలకి కావలసిన తిండిబట్ట స్కూల్ ఫీజులుకట్టాలి వాళ్ళని చదివించాలి ఇకముందు ఆమెని ఇబ్బందిపెట్టకూడదు పిల్లలనిచూడలనిపిస్తే వారానికి ఒకసారి చూడడానికి అవకాశం ఇస్తూ తీర్పు చెప్పారు…

ఇక ప్రస్తుతం క్రాంతి బి.ఇ.డి చేసింది కాబట్టి తనకి ఇంకా మంచిజాబ్ వచ్చింది దాంతో తల్లిదండ్రులకి చెప్పి అదే వీధి లో వేరేఇల్లు తీసుకుని ఉండసాగింది.మల్లిక్ కి విడాకులు రాక వేరే పెళ్లి చేసుకోలేక ఆఫీస్కు వెళ్లలేక తల్లి తెచ్చిన జీతంతో తాగుతూ తల్లిని తిడుతూ ఇంట్లో ఉండసాగాడు ఇక లక్ష్మి ఉన్న ఇల్లుఅమ్మి హైదరాబాద్ కు వచ్చిచుట్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కోడలు వెళ్లిపోయిందని అంతాచులకనగా చూస్తారని ఎవరికి చెప్పుకోకుండా ఒక మారుమూల ప్రాంతంలో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటూ సంపాదించిన డబ్బుతో కొడుకుని పోషిస్తోంది ఒకప్పుడు చుట్టాలందరిని గడ గడ వణికించిన లక్ష్మి ఇప్పుడు ఏ చిన్నచప్పుడు అయినా ఉలికి ఉలికి పడుతోంది…

ఇది నిజంగాజరిగిన జరుగుతున్న కథ ఇందులోని పాత్రలు అన్నినిజమే కొన్నిమార్పులు చేసాను అంతే ప్రతి నెలలో రెండోమూడో ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొన్నిబయటకు తెలిస్తే కొన్ని తెలియడంలేదు అంతే తేడా ఆడవాళ్లు యుగయుగాలుగా నరకం అనుభవిస్తున్నారు ఇప్ప్పుడు ఈ కలికాలంలో మనిషి అంతరిక్షo లోకి వెళ్తున్న ఈయుగం లో కూడా క్రాంతిలాంటి వాళ్ళు ఇంకా మోసపోతూనే ఉన్నారు ఆడదానికి శత్రువు ఆడదే అంటే ఎవరు నమ్మరు కానీ అదేనిజం లక్ష్మిలాంటి ఆడవాళ్లు ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుందా? ఏమో కాలమే నిర్ణయించాలి….

-BHAVYA CHARU

Related Posts

2 Comments

  1. ఎవరు బలహినంగా ఉంటే వాళ్ళను బలమైన వాళ్ళు అణచడమే జరుగుతోంది భవ్యా

    1. ఇలాంటి సంఝటనలు ఎన్ని చూసినా సమాజంలో మార్పు రావటం లేదు.

Comments are closed.