ముచ్చట్లు Unexpected Discussion 1

ముచ్చట్లు

ముచ్చట్లు
ముచ్చట్లు

 

రజనీ ఏం చేస్తున్నావ్ అని అడిగింది అప్పుడే ఇంట్లోకి వచ్చిన మానస ఏముందే పిల్లల తో కష్టంగా ఉంది అంది రజనీ అవునా ఏం చేస్తున్నారే. పిల్లలు పాపం వాళ్ళకు ఏం తెలుసు అంది మానస అవును తెలియదు కానీ చూస్తున్నావు కదా ఇప్పుడు సైలెంట్ గా పడుకుంటారు రాత్రి కాగానే లేచి ఆడుతూ ఉంటారు.

నాకేమో నిద్ర సరిపోవడం లేదు అంటూ నిట్టూర్చింది రజనీ అవునే నీ డెలివరీ ఎప్పుడు అయ్యింది అంటే ప్రొద్దుననా, మధ్యాహ్నం, రాత్రి అంటే రాత్రి ఎనిమిది గంటలకు పుట్టారు అంది రజనీ.

అవునా అయితే నీ పని అయినట్టే రాత్రి పుడితే ప్రొద్దంత పడుకుని రాత్రుళ్ళు మెలకువ ఉంటారు అంట పిల్లలు మా నాయనమ్మ చెప్పేదీ అంది మానస.

అవునా సరే ఏం చేస్తాం ఖర్మ అంది .అబ్బా అంది రజనీ ఏమయ్యిందో అడిగింది మానస ఏం లేదే నాకు సేజెరియన్ అయ్యింది.

కదా అక్కడ కుట్ల దగ్గర నొప్పిగా ఉంది అంది రజనీ అవునా ఎందుకే నొప్పి ఏమైనా బరువులు ఎత్తడం ఏమైనా చేసావా అంది మానస.

లేదే తల్లి నా కు ఏ పని చెప్పడం లేదు మా అత్తగారు కానీ కానీ ఏమిటే అంటూ అరలు తీసింది మానస. అది అది అంటూ నసిగింది రజనీ అది అదేంటో చెప్పు ముందు అంది మానస .

అదేం లేదే మా ఆయన  బరువు గా ఉంటాడు కదా అంది రజని ఎంటేంటి మీ ఆయన బరువా అంటే అంది అనుమానంగా చూస్తూ , అదేనే తల్లి మూడు నెలలు అయ్యిందికదా.

అందుకే మా ఆయన ఊరుకోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంది రజనీ అవునా అదేంటే డాక్టర్ మీకేం చెప్పలేదా అంది అనుమానంగా మానస.

ఒక నెల వరకు కలవద్దు అని అంది డాక్టరమ్మ అయినా మూడు నెలలు అయిపోయింది కదా అందుకే మా ఆయన ఆగకుండా నన్ను ఇలా చేస్తున్నారు అంది రజనీ.

ఒసేయి పిచ్చి మొహమా వాళ్ళు అలాగే ఆగకుండా ఇబ్బంది పెడుతున్నారు అని నువ్వు కూడా సరే అన్నావా , నీ కక్కుర్తి చల్లగుండా వాళ్ళు అలాగే అంటారు కానీ నీకొక విషయం చెప్తా జాగ్రత్తగా విను.

ఇవ్వన్ని మన అమ్మమ్మల కాలం లో చేసేవారు కానీ ఇప్పుడు ఎవరూ చేయడం లేదు . డాక్టర్స్ అలాగే చెప్తారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి లేదంటే నీకు ఎన్నో సమస్యలు వస్తాయి అంది మానస.

ముచ్చట్లు

ముచ్చట్లు
ముచ్చట్లు

అవునా ఏంటే అవి నాకు మా అమ్మలేదు అత్తమ్మ అత్తమ్మనే కదా చెప్పవే నేను పాటిస్తాను అంది రజనీ.

నువ్వు ఈ సమయం లో బాగా తినాలి అది కూడా చల్లవి కాకుండా వేడి గా ఉన్నప్పుడే తినాలి, అలాగే నీళ్ళు బాగా తాగాలి, పీచు ఎక్కువగా ఉన్న బీరకాయలు వంటివి అలాగే ఆకుకూరలు కూడా తినాలి.

పాలు, పండ్లు తింటూ నీ పిల్లలకు పాలు వచ్చేలా చేసుకోవాలి అలాగే నువ్వు ఒకేసారి తినకుండా రోజులో నాలుగు నుండి ఆరుసార్లు కొంచం కొంచం గా తినాలి, పొట్టకు బట్ట గట్టిగా కట్టుకోవాలి అలాగే నీళ్ళలో చల్లగా తిరగాకుడదు. ఎండాకాలం అని చన్నీళ్ళు చేయకూడదు, చెవుల్లోకి గాలి పోకుండా బట్ట కట్టుకోవాలి.

చల్లని గాలి లో ఉండకుడదు ఫ్యాన్ వేసుకున్నా తక్కువ వేసుకోవాలి, నువ్వు పిల్లలు శుబ్రంగా ఉండాలి అలాగే బాలింత అని లేట్ గా లేవకుండా తొందరగా లేవాలి, దాదాపు ఆరుగంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

పిల్లలు రాత్రంతా నిద్రపోరని నువ్వు మెలకువగా ఉండకుండా కొంచం సేపే అయినా నువ్వు నిద్రపోవాలి.

ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆరు నెలల వరకు కలవకుండా ఉండాలి. కలవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు, కుట్లు విడిపోయి చీము పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక బయట నుండి మనుషులు రాగానే స్నానం చేసే పిల్లల దగ్గరికి నీ దగ్గరికి రావాలి.

మీరిద్దరూ కలవడమ్ వల్ల ఆయనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది అందుకే పూర్వకాలం లో బాలింత ను ఆరునెలల వరకు అత్తింటికి పంపేవారు కాదు కానీ ఇప్పుడు అత్తలు, అమ్మలు లేరు కాబట్టి ఇవ్వన్ని చెప్పేవారు లేరు కానీ డాక్టర్స్ ఏం కాదనీ మాములుగా ఉండమని చాలా చెప్తారు.

కానీ ఇవ్వన్ని పాత కాలం లో చేసేవారు. ఇప్పుడు ఇవ్వన్ని చెప్తే ముసలమ్మా ముచ్చట్లు అంటారు కానీ అవే మంచివి. అంటూ చెప్పింది మానస.

అవునా ఇవ్వన్ని తెలియక నేను మాములుగా ఉంటున్నా కలుస్తున్నా కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఇప్పటినుండి అన్ని పాటిస్తాను అంది రజనీ.

అవును నేను చెప్పినట్టుగా కలవకుండా ఉండేలా మీ ఆయనకు కూడా నేను చెప్పినవి అన్ని చెప్పు అలాగే ఇప్పుడు ఆయనకు కోపం అని, గొడవ అని నువ్వు ఉరుకుంటే రేపు నీకేమైనా సమస్యలు వస్తే బాధ పడేది నువ్వే కానీ అతను కాదు గా సరేనా ఒక చెల్లిలాగా, ఒక స్నేహితురాలిగా ఇవ్వన్ని నీకు చెప్పాను మరీ తర్వాత నీ ఇష్టం అన్ధుఇ మానస నిట్టురుస్తూ..

అయ్యో అదేం మాట నే నువ్వు చెప్పినవి నా మంచి కోసమే కదా తప్పకుండా అన్ని పాటిస్తాను అంది స్నేహితురాలిని కౌగిలించుకుంటూ రజనీ. .

మీరు కూడా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. పాత కాలం మాటలు అని నిర్లక్ష్యం చేయకండి. అలాగే మీ వారి తో కూడా చదివించండి.. సెలవ్

Related Posts