ముసుగులో అమ్మాయి

ముసుగులో అమ్మాయి

 

సమయం రాత్రి రెండు గంటలు ,పక్క మీద నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు వికాస్.అతనికి ఎంతకూ నిద్ర పట్టడం లేదు.అతనికి నిద్ర పట్టక పోవడానికి కారణం ఒక అమ్మాయి కావడం విచిత్రం,అసలు ఆ అమ్మాయి ఎవరూ,తననే ఎందుకు ఫాలో చేస్తుంది.తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ,తన ఫోటోలు తీసి మరి తన ఫోన్ కె పంపుతుంది.

ఎవరామే అని తెలుసుకోవాలి అని ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే అది ప్రయివేటు నెంబర్ అని కనిపిస్తుంది.కానీ ఆ నెంబర్ ఎవరిదో మాత్రం కనుక్కోలేక పోతున్నాడు,చివరకు హాక్ చేద్దాం అని కూడా అనుకున్నాడు.కానీ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద నిర్ణయం ఎందుకు అని అనుకుని విరమించుకున్నారు,కానీ ఆ అమ్మాయికి అది కూడా ఎలా తెలిసిందో కానీ తాన ఆలోచనలను కనిపెట్టి తనను ఒక సారి హెచ్చరించింది కూడా గుర్తుకు వచ్చింది వికాస్ కి…,

కానీ గత వారం రోజులుగా కానీ గత వారం రోజులుగా ఆమె ఎవరు, తనని ఎందుకు ఫాల్లో చేస్తుంది అన్న ఆలోచనలతో రాత్రులు కూడా నిద్ర పోవడం లేదు వికాస్ టంగ్ అని ఫోన్ లో నోటిఫికేషన్ మెసేజ్ రావడం తో ఏంటా అని వాట్సప్ ఓపెన్ చేసి చూసాడు,మళ్ళీ ఆమె తానూ జుట్టు పీక్కొంటున్న ఆలోచిస్తున్న పిక్,ఎక్కువ ఆలోచించి,ఆరోగ్యం పాడుచేసుకోకండి అనే చిన్న సందేశం తో ఇక ఆలోచించింది చాలు వెళ్లి పడుకోండి అనే సందేశం చూసి చివరికి బాత్రూంలో కూడా కెమెరాలు పెడుతుందేమో అని భయం వేసి లైట్లు ఆర్పి టక్కున బెడ్ షీట్ కప్పుకొని పడుకుండి పోయాడు వికాస్ .
వికాస్ ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ మంచి వాడు అనే పేరు తెచ్చుకున్నాడు ఆఫీసులో స్వతహాగా భయస్తుడు కావడం అమ్మాయిలంటే ఉన్న బిడియం సిగ్గు మొహమాటం వల్ల అది హైటెక్ ఆఫీసు అయినా అమ్మాయిలు క్లోజ్ గా మూవ్ అవుతున్న ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూ చూడడు పన్నెత్తి మాట్లాడిన అవి వర్క్ గురించే తప్ప స్వీట్ థింగ్స్ అంటూ ఏం లేవు, పైగా గా బతిమాలి బామాలి అమ్మాయిలు తన రూమ్ లోకి రాకుండా లేకుండా చూసుకుంటూ ఉంటాడు మరి వికాస్ ఇలా చేయడం వల్ల అతని ఏమైనా తేడా నా శారీరకంగా ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే అవేవీ కాదు మనోడు మంచి ఫిజిక్ తో బాడీ బిల్డర్ లా ఉంటాడు ఎలాంటి లోపం లేకుండా రోజులో 12:00 జిమ్ లో ఉంటాడు అన్ని విషయాల్లోనూ హుషారుగా ఉంటాడు అతనికి చేరువ కావాలని చూసిన చాలా మంది అమ్మాయిలు నిరాశ పడి పోయి అతని లో లోపం ఉందని చెప్పారు తప్ప తమ ప్రయత్న లోపం అని చెప్పలేకపోయారు.

మరి వికాస్ ఇలా అమ్మాయిల విషయంలో ఇంత బిడియంగా ఉండడానికి కారణం అతని బామ్మ అన్నపూర్ణమ్మ గారు ఆమె చిన్నప్పటి నుంచి రామాయణ భాగవత కథలను పురాణాలను, ఇతిహాసాలను మనబడి నీ దగ్గర కూర్చోబెట్టుకొని మరి చెప్పేది, రామాయణ మహాభారతాలలో ఆడదాని వల్ల జరిగిన యుద్ధాల గురించి చెప్పడంతో అమ్మాయిల అంటే ఒక రకమైన బిడియం ఏర్పడింది వికాస్ కి వారితో మాట్లాడడం అన్న వారిని తేరిపార చూడడం అన్న తగని సిగ్గు దాంతో అతను అమ్మాయిలతో మాట్లాడటం వారు అంటేనే ఆమడ దూరం వెళ్లడంచేస్తున్నాడు మరి అలాంటి వికాస్ కి ఫోన్ లలో మెసేజీలు చేస్తూ అతని వెంబడిస్తున్న ఆ అమ్మాయి ఎవరు ఇందుకు ఆమె అతన్ని వెంబడిస్తుంది…..

ఒసేయ్ రాధా ఎక్కడున్నావ్ రా బాబు నిన్ను వెతకలేక చస్తున్నా అంటూ గట్టిగా అరుస్తూ బెడ్ మీద కూర్చుంది హసీనా కూర్చున్న ఒసేయ్ రాధ ఈ కాలంలో కూడా ఇంకా నీ అమ్మ మన కాలంలో లాగా రక్తం కలిసింది కాబట్టి వాడే నా మొగుడు అంటూ నువ్వు వాడి వెనుక పడడం కాక మమ్మల్ని కూడా చంపడం ఏంటి బాబు వాడి ఫోటోలు తీయలేక ఏం చేస్తున్నాం అందరం నిమిష నిమిషానికి ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ,ఏం చేస్తున్నాడో తెలియక వారి ఆఫీసులో ఉన్న వారికి లంచాలు ఇవ్వలేక వృధా చేస్తున్నాం ఎప్పుడో ఏదో జరిగిందని జీవితాంతం వాడే కావాలంటే ఎలా అదేదో ముఖాముఖి తెలుసుకోలేక ఎందుకే మాకు ఈ అవస్థ,ఏ నిమిషానికి నీ మనసు ఎలా మారుతుందో అని నీకు సహాయం చేయాలని ఉన్నా నీ విపరీత ధోరణి అర్థం కాక ఏదో స్నేహితురాలి వని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, నన్ను కని పెట్టుకుంటామని నిన్ను నీ స్నేహాన్ని వదులుకోవడానికి మనసు రాక నీకు మా సహకారాన్ని అందిస్తున్న కానీ విషయం అతనికి తెలిసింది అనుకో అని అంటున్న నా నోటిని మూసేసింది అప్పుడే బాత్రూంలోంచి చీర చుట్టుకుని వచ్చిన రాధ.

తడిచిన ఆమె శరీరాన్ని దానిమీద ఉన్న మంచి బిందువులాంటి నీటిని చూస్తూ అబ్బా ఎంత అందంగా ఉన్నావే నేనే మగాడు అయితే నా నిన్ను ఎత్తుకెళ్లి మరి పెళ్లి చేసుకునే దాన్ని కానీ ఏం లాభం నేను ఆడపిల్ల ని అయ్యాను అని గట్టిగా నిట్టూర్చింది హసీనా పేరుకు తగ్గట్టే ఎత్తులు ఒంపులు సొంపులు అన్ని సమపాళ్లలో ఉండి నిజంగానే కృష్ణుడు కోసం వెతుకుతున్న రాధ లా అనిపించింది , అసలే పొడగరి కావడం ఆమె కురులు కూడా వీపంతా పరుచుకుని లోపలి అందాలను ఎవరికీ కనిపించకుండా పోతున్నాయి ఆమె నా నోటి మీద నుండి తీసేసి తన స్నేహితురాలి చూస్తూ ఉండిపోయిన హసీనా అనే చూసి ఇక చూసింది చాల్లే కానీ ఏంటే నావి అప్పలమ్మ ఆలోచనల అయినా నీకు అలా ఎలా అ నా లనిపించింది అని నవ్వుతూ అడగింది రాధ, కళ్ళలోంచి ల లోకి వచ్చిన హసీనా తిరిగి మామూలు స్థితిలోకి వస్తూ అవును ఇది అసలే 21వ శతాబ్దం ప్రపంచం మొత్తం ఆన్లైన్లో అరచేతిలో చూపిస్తూ ఇంటర్నెట్ పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

ఈ కాలంలో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత హీరో హీరోయిన్ నీ ముట్టుకున్నా డని సెన్సార్ వాళ్ళు ఆపేసిన సినిమాల అతని రక్తం నీకు ఏదో యాక్సిడెం టు గా నీకు అంటుకుంటే దాన్ని నువ్వు జన్మజన్మల అనుబంధం గా ఊహించు కొని అతని వెంట పడడం ఏంటి అసలే నువ్వు డాక్టర్ వి, కిటికీ మూఢనమ్మకాలు ఏంటి అయినా నీ ప్రశ్నలతో పాటు లెక్చరర్ల బుర్ర తింటావు అంది హసీనా,డాక్టర్ అయితే ఏంటి నమ్మకాలు ఉంటాయి ఎవరి నమ్మకాలు వారివి మరి మీరు బురఖా ఎందుకు వేసుకుంటారు చెప్పు అడిగింది. హసీనా అది ఆచారం కాబట్టి అని చెప్పగానే మరి మా సాంప్రదాయం ప్రకారం కూడా ఏ ఇద్దరి రక్తం కలిసి పోతే వాళ్లు భార్య భర్తలు అని పెద్దలు చెప్తారు ఏంటో అని నీ నమ్మకాలు ఆచారాలు నీది నువ్వు ఈ జనరేషన్లో పుట్టాల్సిన దానివి కాదు కానీ వదిలేయ్ అంటే అది కాదు అతని బైక్ స్కూటీ రెండు అతని వైపు కాకుండా సరే పడిపోతున్న అతని లేపాలని నేను వెళ్తే, కాలు స్లిప్ అయి అతని మీద నేను పడడం ఏంటి మేమిద్దరం ఏడడుగులు వేసినట్లుగా ఏడు సార్లు అలా దొర్లడం ఏంటి కొట్టుకుపోయి కలవడం ఏంటి అని అంటున్న స్నేహితురాలిని పిచ్చిదానిలా చూసి ఒసేయ్ అలా అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఒకరు ఇంకొకరికి అంటుతుంది.

అలాగే బ్లడ్ ఎక్కించేటప్పుడు ఒకరు ఇంకొకరికి ఎక్కిస్తారు కదా అలాంటప్పుడు మరి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎలా భార్య భర్తలు అవుతారు నువ్వు అలా డిసైడ్ చేస్తే అందరూ ఇక మ్యాట్రిమోనీ వెంట లవ్ పార్కుల వెంట తిరగకుండా రోడ్డుమీద యాక్సిడెంట్ లు చేసి అమ్మాయిల బ్లడ్ తో అబ్బాయి ల బ్లడ్ ని కలిపేసి నువ్వే నా భార్య అంటూ వెంట పడతారు నీ మాటలు విన్నవాళ్లు అంటూ కిసుక్కున నవ్వింది హసీనా. ఇదిగో నువ్వు నన్ను ఏడిపించావు అంటే నీతో కటీఫ్ అంది రాధ. అమ్మ తల్లి అమ్మ నువ్వు ఏడవకు తల్లి నాకు తలనొప్పి పెంచకు కానీ నీకు నచ్చినట్టు చేస్తా అని అభయం ఇచ్చిన హసీనా తన స్నేహితులైన కొంతమంది అబ్బాయిలను వికాస్ ను వెంబడించమని చెప్పి, అతని ఫోటోలు తీయడం అవి రాధకు పంపడం రాధ వాటిని వికాస్ కి పంపుతూ అతన్ని తీసేయడం జరిగేది కానీ వికాస్ కి మాత్రం ఇది కోపం వచ్చేది కొన్ని రోజులు వచ్చిన మాట నిజమే కానీ ఆ తర్వాత తర్వాత అదొక వ్యసనంలా మారిపోయింది అతనికి. అయితే అంతకంతకు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలన్న తనలో మొదలైంది….

పెద్ద బోర్డు ముందు పెట్టుకుని తన గదిలో కూర్చుని ఆ బోర్డు మధ్యలో బెల్లం స్వీట్ ఏసి దాంట్లో తాను వెళ్ళే దారిలో వచ్చే దారిలో, ఆగే ప్లేసులు జూస్ సెంటర్లు పాన్ డబ్బా మొదలైనవి ఎక్కడెక్కడ ఉన్నాయో తాను అక్కడ ఎంతసేపు ఆగుతాడు ఫోటో తీయాలంటే ఎక్కడినుండి తీస్తే క్లారిటీగా కనిపిస్తాడో, అన్ని మార్పు చేసి పెట్టాడు అలాగే ఇంకో వైపు తాను ఉంటున్న ఏరియా గది కిటికీలు కూడా వేసి ఇక్కడ ఇలా ఫోటోలు తీస్తే బాగా వస్తాయి తను ఏం చేసేది ఇది ఎలా తెలుసుకుంటున్నారు. అని నీటుగా రాసి మొత్తం ఎక్సప్లైన్ చేస్తూ తనను ఎవరూ గమనించకుండా కిటికీలు కర్టెన్లు వేసి మరి, వీడియో తీసి తన చిన్నాన్న కొడుకు తన బెస్ట్ ఫ్రెండ్ పంపి తానున్న పరిస్థితిని వివరించి, ఆ ఆ ముసుగు వనిత ఎవరో తెలుసుకునే వరకు నిద్ర పోవద్దని చెప్పు అప్పటి వరకు తనని కలవకూడదని వివరించి చెప్పి వీడియో పంపి, అప్పుడు గట్టిగా ఊపిరి తీసుకొని ఆ బోర్డు అంతా సర్దేసిన వెంటనే ఫోన్ లో టిక్ టిక్ టిక్ అనే మెసేజ్ సౌండ్ వినిపించి ఓపెన్ చేసి చూశాడు అందులో పరదాల మాటున ఏం జరిగింది అనే క్యాప్షన్తో కర్టెన్ ఉన్న తన రూమ్ ఫోటోలు కనిపించి ముసిముసిగా నవ్వుకుంటూ బాత్రూం లోకి వెళ్లి వచ్చి, టీ పెట్టుకుని కప్పు తీసుకొని తాగుతూ కిటికీ కర్టెన్లను తీశాడు అప్పుడే పక్క బిల్డింగ్ దగ్గర ఏదో నీడ తప్పుకున్నట్లు అనిపించింది. హోమ్ ఇంకెన్ని రోజు లులే అనుకోని టీ తాగుతూ నిలబడ్డాడు.

ఈసారి మళ్లీ ఫోన్ సౌండ్ వినిపించింది వెళ్లి చూశాడు తాను టీ తాగుతున్న ఫోటోలు దాంతోపాటు కింద క్యాప్షన్ లేజీ బాయ్ అని అంత తొందరగా లేచావ్ అని కూడా ఉంది.చిన్నగా నవ్వి ఫోన్ పక్కన పెట్టేశాడు వెంటనే ఇంకో ఫోటో ఫోటో అబ్బా నీ నవ్వుకు దాసోహం అంటూ ఇంకో క్యాప్షన్ తో.ఇక్కడ ఇలాగే నిలబడితే ఇంకెన్ని పంపు తుందో అని భయం వేసి లోనికి వెళ్ళిపోయాడు ల్యాప్టాప్ తీసి ఫోన్ లో ని ఫోటోలు అన్నీ లాప్టాప్ లో సేవ్ చేసి పెట్టి నిద్ర వచ్చి మళ్లీ పడుకుండి పోయాడు వికాస్.

సాయంత్రం నాలుగు గంటలకి ఫోన్ అదే పనిగా మోగుతోంది ఫోన్ మోతకు మెలకువ వచ్చిన వికాస్ తిసి హలో అన్నాడు నేను రా అనే పిలుపు ఏంటి చెప్పు ఒరేయ్ నీ మీద పెద్ద కుట్ర ఏదో జరుగుతుంది రా నీ చుట్టూ ఒక పదిమంది కాపుకాసి ఉన్నారు ప్రతి నిమిషం చేస్తూ ఫోటోలు తీసి ఎవరెవరికో సెండ్ చేస్తున్నారు అని అన్నాడు అవతల్నుండి అబ్బా నీకు చెప్పింది నువ్వు పట్టుకొని ఉంటేనే నాకు ఫోన్ చెయ్ లేదంటే చెయ్యకు సరేనా అర్థమయిందా సరే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసాడు . తిరిగి తన డైలీ రొటీన్ లో పడిపోయాడు.రవి కి ఆ విషయం అప్పగించాడు కాబట్టి ఇక ఏ టెన్షన్ లేకుండా తన పనిలో నిమగ్నమైనా, అప్పుడప్పుడు రాధ పంపి ఫోటోలు చూస్తూ ఎంజాయ్ చేయ్యసాగాడు అయితే అతను తన గురించి పోవడం నిరుత్సాహం కలిగిన మాట వాస్తవమే దానికి కారణం ఊహించలేక వేరే ఎవరితోనైనా ప్రేమలో ఉన్నాడా లేదా పెళ్లి సంబంధం ఏమైనా కుదిరింది ఏమో అని టెన్షన్ పడడం ఇప్పుడు రాధ వంతు అయింది ఇంకా మీ స్నేహితులను దగ్గరగా వెళ్ళి గమనించని కోరడంతో వాళ్ళు ఆఫీసులోనూ ఇంటిదగ్గర చూస్తే ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్లుగా తేలింది అయితే ఆ కాల్ ఎవరితో మాత్రం వాళ్లు కనుక్కోలేకపోయారు. దాంతో రాధ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

వికాస్ ఎవరితోనూ ప్రేమలో పడ్డాడు అనే విషయం కన్ఫర్మ్ చేసుకుంది. తాను ఎన్ని రోజులు చేసుకున్న అంతా బెడిసికొట్టడంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుంది రాధ, రాధ అవస్థ చూసిన హసీనా నవ్వుతూ బాగా అయ్యిందే నీకు ,నీ తొక్కలో లాజిక్లు కనిపించకుండా ఉండడాలు ఇలా ఎవరైనా చేస్తారా,కనిపిస్తూ ఈ రోజుల్లో అన్నీ ఇచ్చేస్తున్న కూడా పెళ్లికి ముందే శరీరాన్ని అర్పిస్తున్న.అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఎవరో తెలియదు నిన్ను అతను పట్టించుకుంటాడు నిన్ను వెతుకుతాడు అని ఎలా అనుకున్నావ్ నువ్వేమైన పెద్ద అందగత్తె వా, అలా అతన్ని పరీక్షించడానికి నువ్వేమైనా యువరాణి వా ఇన్నిరోజులు తిడితే ఏడుస్తావ్ అని నిన్ను ఏమనకుండా కోరుకున్న కానీ మూర్ఖత్వంతో అతని దూరం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోలేక పోతున్న ఇదిగో ఇప్పుడే చెప్తున్నా ఈ రోజే చివరిగా అతన్ని ఫోటోలు తీసి ఎక్కడున్నాడో చెప్తాను నువ్వు వెళ్లి ఇన్నాళ్లు ఫోటోలు తీసింది నేనే అని నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అతనికి చెప్పాడు చెప్పు అని అంది హసీనా.ఆ అవసరం లేదు లేండి నేనేనా యువరాణి వెతుక్కుంటూ వచ్చాను అనే గొంతు వినబడింది.

ఆ మాటలు వినిపించిన వైపు చూశారు ఇద్దరు అక్కడ నవ్వుతూ నిలబడి ఉన్నాడు ఆశ్చర్యపోయారు. రాధ నూ హసీనా ని మార్చి మార్చి చూస్తూ అవును ఇందులో అంటే మీ ఇద్దరిలో ఎవరు అని ఎవరు ఇంతకు అని అన్నాడు చిలిపిగా కన్ను గీటుతు దానికి తత్తర పడిన ఇద్దరు ఎక్కడ వచ్చి కౌగిలించుకుంటారు అని భయపడిన హసీనా భలేవారే మీరు కృష్ణుని కోసం ఎదురుచూసే చకోరపక్షి ఎవరో మీరా మాత్రం కనిపెట్టలేరు ఏమిటి అని అంటూనే ఇక్కడే ఉంటే ఇద్దరూ కావాలంటాడు ఏమో నే రాధా అంటూ అతని ఇంటి చేసి బ్యాగు తీసుకుని బయటకు పరిగెత్తింది హసీనా. అవును అవును రాధాకృష్ణులు ఎప్పటికి కలవరు కదా మరి మనం కలవడం అవసరమా అని ప్రశ్నిస్తున్న వికాస్ ని కోపంగా చూస్తూ ఆ మాట అంటే చంపుతా ఈ రాత నీదే ఈ జన్మకి అని అంటూ వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది అయితే నా ముసుగు రాదని నువ్వేం అన్నమాట అంటూ తన కౌగిలిలో ఆమెని బిగిoచాడు వికాస్….

*అయిపోయింది*

Related Posts