నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు పాపం మా అమ్మ మా నలుగురు పిల్లలను తన రెక్కల కింద సాకింది. నేను పెద్ద దాన్ని. నా తర్వాత చెల్లె దాని తర్వాత ఇద్దరు చిన్న తమ్ముళ్ళు వీళ్ళందరినీ పెంచి పోషించడానికి మా యమ్మ చెయ్యని పని లేదు
పోనీ కూలి లేదుఅందరి ఇళ్ళలోనూ పనికి కూడా పోయిందిమా అమ్మా కష్టం చూస్తూ నేను తొందరగా పెద్ద అయ్యి మా అమ్మకు ఏ కష్టం కలగకుండా మంచిగా చూసుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నా నేను.
కొన్ని ఏళ్ళు గడిచాయి నాకు బుద్ది తెలిసిన తర్వాత మాయమ్మ నన్ను బడికి పంపింది. నేను బడికి పోయి వచ్చిన మొదటి రోజు మా అమ్మ చెప్పిన మాటలు నాకు ఇప్పటికి గుర్తు ఉన్నాయి
బిడ్డా మంచిగా సదువుకుంటే నీ జీవితం బాగుంటది ఇట్లా కూలి చేసుకునే అవసరం ఉండదు. ఎన్ని కష్టాలు ఎదురైనా బాగా చదువుకో అని చెప్పడంతో నేను అవే మాటలను స్పూర్తిగా తీసుకుని చదువే లోకంగా బతికాను.
అలా ఇంటర్ వరకు చదివి డిగ్రీ కాకుండా నర్సింగ్ కోర్సులో చేరాను అందులో తొందరగా ఉద్యోగం వస్తుందని తెల్సి నర్సింగ్ కోర్సు పూర్తి అయ్యి నేను ఒక హాస్పిటల్ లో ఉద్యోగంలో చేరిన నెల రోజులకు మా అమ్మకు ఉపిరితిత్తుల్లో నిమ్ము చేరి ఉపిరి ఆడక నిద్రలోనే చనిపోయింది
ఆమె చనిపోవడం నాకో పెద్ద షాక్. నేను మా అమ్మను బాగా చూసుకోవాలి అని అనుకున్నా కానీ ఆ అదృష్టం నాకు లేకుండానే నేను కష్ట పడడం మా అమ్మా చూడలేక అలా దేవుడి దగ్గరికి పోయింది అని నువ్వు దిగులు పడితే మీ చెల్లెలు తమ్ముళ్ళు భయపడతారు
ఇక అమ్మయినా అక్క అయినా నువ్వే వారిని చూసుకోవాలి అని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పి నన్ను ఓదార్చారు అవును నిజమే అ మాట మా యమ్మకు నేను డాక్టర్ మా చెల్లె ఇంజనీరు ఇద్దరు తమ్ముళ్ళను పోలీసులను చెయ్యాలని ఉండేది.
వాళ్ళని ఆ విధంగా నేను చదివిస్తే మా అమ్మ కోరిక తీరుతుంది. ఆమె ఆత్మ సంతోషిస్తుంది అని అనిపించింది నాకు. నేను అప్పుడే అనుకున్నా ఇక నా తమ్ముళ్ళను చెల్లెలి బాధ్యత నాదే అని ఇక అప్పటినుండి నా బాధను అంతా పక్కన పెట్టేసి నేను ఉద్యోగం చేస్తూ వాళ్ళని బాగా చదివించ సాగాను.
నేను అనుకున్నట్టుగా అందర్నీ చదివించాలి అంటే బాగా కష్టపడాలి అని అనుకుని సెలవుల్లో నేర్చుకున్న టైలరింగ్ ని కూడా వదిలి పెట్టకుండా జీతం డబ్బుల్లో కొంత డబ్బును దాచి మిషిన్ కొనుకున్నా ప్రొద్దున ఆసుపత్రిలో పని చెయ్యడం సాయంత్రం చుట్టుపక్కల వారి బట్టలు కుట్టడం ఇలా దాన్ని ఒక యజ్ఞంలా చేశాను
దాన్నొక ఛాలేoజ్ గా తీసుకుని వారిని నేను అనుకున్న రీతిలో చదివించడానికి ఎన్నో కష్టాలు పడ్డ్డాను చెల్లి కాలేజికి మంచి బట్టలు వేసుకుని వెళ్ళాలి అని నేను ఉన్న బట్టలతో సర్దుకుని మంచి బట్టలు దానికి కొనిచ్చే దాన్ని ఇక తమ్ముళ్ళు అడిగినప్పుడల్లా వారికీ డబ్బులు పంపుతూ వారిని వేరే ఊర్లో ఉంచి చదివించా
నా స్నేహితులు ఆసుపత్రిలోని వారందరూ నన్ను పిచ్చి దానిలా చూసినా ఎప్పుడు వారి గురించే ఆలోచిస్తావు నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని అంటున్నా నీ జీవితం గురించి కలలు కను నీ జీవితంలో స్థిరపడు పెళ్లి చేసుకో అని అంటున్నా డబ్బు దాచుకోమని పోరు పెడుతుంటే నాకు నా వాళ్ళే ముఖ్యం అని అనుకుని వారిని అనుకున్నట్టు చదివించడానికి నేనొక యంత్రంలా పని చేశాను..
వాళ్ళందరూ బాగా చదివి మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. అమ్మా కోరిక తీరింది అని నేను సంతోషించాను ఆమె అనుకునట్టుగానే అందర్నీ వారి ఉద్యోగాల్లో చేర్పించి వారికీ దగ్గర ఉండి పెళ్ళిళ్ళు చేశాను వారెంతో సంతోషంగా ఉన్నారు. అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోయారు...
అన్ని రోజులు ఏంతో సందడిగా ఏంతో గోలగా ఉన్న ఇల్లు అంతా ఒక్కసారిగా మూగబోయినట్లు అనిపించింది చిన్న ఇల్లే అయినా ఎందుకో పెద్ద భూతు బంగ్లాలా అనిపించింది నాకు ఇంత పెద్ద ఇంట్లో ఇన్ని రోజులు నేనేనా ఉన్నదీ అని అనుకున్నా అంత చిన్న ఇల్లు ఇప్పుడు నా ఒక్కదానికి పెద్దగా అనిపిస్తుందా
నాకు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి. నా ఇంటిని నేను ఇన్ని రోజులు సరిగ్గా చూడలేదు అది కూడా బీటలు వారుతుంది నేను ఉన్న మూడు గదులను చూస్తూ అద్దం ఉన్న గూటి దగ్గరికి వచ్చిన గూట్లో చిన్న అద్దం ముక్క కనిపించింది. దాన్ని తీసుకుని మొదటి సారీ నా మొఖాన్ని అందులో చూసుకున్నా
ఇంతకూ ముందు చూసుకోలేదని కాదు కానీ ఎదో బొట్టు పెట్టుకోవడానికో లేదా పాపిట తిసుకోవడానికో తప్ప దాని అవసరం నాకు అంతగా రాలేదు.అద్దంలో నన్ను నేను చూసుకున్నా నా మొఖం ఎంతగా ముడతలు పడి వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోయాయి
ఇన్ని రోజులు నేను పడ్డ మానసిక సంఘర్షణకు ప్రతి రూపంలా కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. రక్తం మొత్తం ఉడిగి పోయినట్టుగా నాలో ఆడదానికి ఉండే పొంకలు బింకాలు సడలిపోతున్నాయి. అందుకే అంటారేమో ఎ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులో జరగాలి అని నా స్నేహితులు చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎందుకు పెళ్లి చేసుకొమ్మని అన్నారో డబ్బుని దాచుకోమని అన్నారో నాకు అర్ధం అవ్వసగింది మెల్లిగా. ఇప్పుడు నాలో వయసు ఉడిగిపోతుంది పని చేసే ఓపిక కూడా తగ్గిపోవచ్చు అలాoటి సమయంలో నాకు తోడూ ఎవరూ ఉండకపోవచ్చు తోడూ లేక పోయినా కనీసం డబ్బు ఉంటె అయినా అయినవారో పక్క వారో నాకు ఇన్ని గంజి నీళ్ళు అయినా పోస్తారు అనే ఆ మాట చెప్పి ఉంటారు అని అనుకున్నా నేను.
అయినా నాకు బాధ లేదు. నా జీవితం మోడు అయ్యింది అనే దిగులు లేదు సంసారము కుటుంబం తోడూ పిల్లలు ఇవన్ని లేవు అనే ఆలోచన నాకు లేదు. అసలు వాటి గురించి నెనెప్పడు ఆలోచించలేదు. నేను నా తల్లి కష్టాన్ని చూడలేక ఆవిడని బాగా చూసుకోవాలి అని అనుకున్నా కానీ నా ఆ కోరిక తీరలేదు
కానీ అమ్మకు మేమేమి అవ్వాలన్న కోరిక ఉండేదో మేము అవి అవ్వడానికి కృషి చేసి మా కలని తిర్చుకున్నాము. అలా మా అమ్మని బాగా చూసుకోవాలి అనుకున్న నా కోరికని ఇలా తీర్చుకున్నా అమ్మా ఎక్కడ ఉన్నా మేము బాగుంటే చూసి సంతోషిస్తుంది. ఇక మీరంతా నన్ను మోడు గోడు మొండి అని ఏమనుకున్నా నాకేమి బాధ లేదు నేను చాలా తృప్తిగా ఉన్నా…..