మోసం
ఏ విధంగానైనా మెాసంచేయడమే
వృత్తి అయింది ఈ రోజుల్లో
మార్కెటింగ్ మెాసాలు ఎక్కువై
పోయాయి ఇంకా ఈ టెక్నాలజీ
కారణంగా ఆన్ లైన్ మెాసాలు కూడా
అధిక మయ్యాయి…
ముందే డబ్బులు కట్టించు కోవడం
ఒక రకం బట్టలు చూపించి ఇంకో రకంవి
పంపడం చేస్తున్నారు..
ఒక సారైతే మా అమ్మాయి డ్రెస్ మెటీరియల్
పెడితే పీలికల బట్టలు పంపారు..
మళ్లీ వాపస్ కూడా తీసుకోరు అందుకే ఈ
ఆన్ లైన్లో తీసుకో కూడదు..ఇవే కాక షాపుల్లో
కూడా ఆఫర్లని పెట్టి చీప్ క్వాలిటీవి ఇస్తారు
మెాసం ఎన్నో రకాలు ప్రతి దాంట్లో కల్తీనే!
ఏ రంగం లో నైనా ఇదే మెాసం..
జాబ్ లని చెప్తూ డబ్బులు వేయమంటున్నారు ఒకసారి రెండు సార్లు మనం వేసిన డబ్బులకు
డబుల్ వేసి మూడోసారి పెద్ద మెుత్తంలో ముంచేస్తున్నారు ,మన ఫోన్ల ద్వారా వాల్లు డబ్బు
వేసి అకౌంట్ నంబరు తెలుసుకుని ఉన్న డబ్బులు కాజేస్తున్నారు!
చాలా తెలివిగా బ్రతకాలి ఈ కాలంలో!
మెాసాలకు గురి కాకుండా బ్రతకడమే గొప్ప
అవుతుంది! జర అందరూ జాగ్రత్తండీ!
ఉమాదేవి ఎర్రం