మోసపోకు యువత…
మూగబోయిన యువత
మాట్లాడటం మానేసింది
రోజంతా సోషల్ మీడియాలో గడపడం
చదువుని చిన్నచూపు చూడటం
ఉల్లాసం అనే సాకుతో
మద్యం సేవించడం
బద్ధకం ఎక్కువై బెట్టింగ్ లలో
డబ్బులు తగలేయడం
డ్రగ్స్ కి అలవాటవ్వడం
సినిమా హీరోలకి
బానిసత్వం చేయడం
మంచి మాటలని
గాలికి వదిలేయడం
తల్లిదండ్రులని ఎదురించడం
సమాజాన్ని పట్టించుకోకపోవడం
మూగబోయిన యువతరమా
మోసపోకు యువత…
P. అనిల్