మోసమే వ్యాపారం
ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాపార ప్రకటనలు వార్త పత్రికలో పెద్ద పెద్ద గా అందమైన అబద్ధాలగా మలిచి అచ్చువేసి ప్రచారం చేస్తున్నారు తీరా కంటికి కనిపించని చిన్న చిన్న అక్షరాలగా కండిషన్ అప్లై అన్ని వేశారు
ఇప్పుడు మరోరకం
ఇన్ స్టా గ్రామ్ లో కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే చాలు వాడే డాక్టర్ అయినట్లు యాక్టింగ్ చేసి చెప్పుతారు, ఫలనా సబ్బు వాడితే తెల్లగా అవుతారు,ఫలానా ఆయిల్ వాడితే నల్లని జుట్టు వస్తుంది అని కావాలంటే కామెంట్ చేయ్యండి అంటారు , గుడ్డిగా నమ్మి కామెంట్ల చేస్తారు, నల్లని వ్యక్తి తెల్లగా,ఎర్రగా చేసే షాపులు,సోపులు ఉంటే ఆఫ్రికా ఖండం లో ఉన్నా వాళ్ళు కూడా వాడితే తెల్లగా అవుతారా అని కనీసం జ్ఞానము లేదు ఇప్పుడు నేను గమనిస్తున్న విషయం ఏమిటంటే ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకోవాలంటే వాడినా వాళ్ళు ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోనే వాళ్ళుం , ఇప్పుడు అంతా రేటింగ్స్ చూసి నమ్ముతున్నారు
ఈ రేటింగ్స్ ఎలా ఇస్తారో నాకు బాగా తెలుసు… నా చేత కూడా ఇప్పించారు ఒక ఐవిఎఫ్ హాస్పిటల్ కు నాకు ఏమి తెలియదు నాకు పెళ్ళి కాలేదు మెడం అన్నా కూడా నా ఫోన్ లో వాళ్ళ రేటింగ్స్ ఎలా ఇవ్వాలో చూపించారు ఎంత పెద్ద మోసం కదా అని అడిగాను ఏమి కాదు అన్నారు…ఈ విషయం లో మాత్రమే కాదు సినిమా రివ్యూ విషయం లో కూడా అంతే , మొన్న దిల్ రాజు గారు చెప్పారు కదా మొదలు రోజు అంత డబ్బులు రాకపోయినా పబ్లిసిటీ కోసం పిచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మోసం చేయడమే ఒక కళ అంటున్నారు,కాని నమ్మించి మోసం చేయ్యడం అంటే తడిగుడ్డతో గొంతు కోయడమే కదా ప్రజలు కూడా గమనించాలి మోసపూరిత ప్రకటనలను ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతి లో గూగుల్ ఉంది కాని వాడరు, ఎవరో చెప్పినది గుడ్డిగా నమ్మేయడమేనా ఏ విషయాన్ని సరే ఒకటికీ నాలుగైదు సార్లు బాగా ఆలోచించాలి అప్పుడే మోసపోము
యోగా బాయ్