మోహం

మోహం

మోహం
మోహం

 

మా ఇంటి ఎదురుగ రాజు అనే ఒక అబ్బాయి ఉండే వాడు.అతన్ని నేను ఎక్కువ పట్టించుకునే దాన్ని కాదు.కానీ అతను నన్నే చూస్తూ ఉండేవాడు.మరి నాకు ఎలా తెల్సు అంటారా ,అదేంటో మగడు ఎంత దూరం నుండి చుసిన ఆడవాళ్లకు అలా తెలిసిపోతూ ఉంటాయి.

అలా అతను చూసేది నాకు తెలిసి పోతు ఉండేది.అతను అలా నన్ను చూడడం నాకు కొంచం బాగానే అనిపించేది,అలా చూస్తూ ఉండగా ఒక రోజు అతను మా ఇంట్లోకి వచ్చేసాడు నిజం చెప్పొద్దూ నాకు చాలా భయం వేసింది. ఎందుకు వచ్చాడో అని,బయట వాకిట్లో నిలబడి మేడం మేడం అని పిలిచాడు.

నేను అతను రావడం కిటికీ లో నుండి చూస్తూనే ఉన్నా, మళ్ళి ఏమి తెలియని దానిలా ఎవరూ అంటూ బయటకి వెళ్లాను,అతను మేడం తల నొప్పిగా ఉంది, పాలేమో అయిపోయాయి, కొంచం పాలు చేబదలు గా ఇస్తే, నేను తెచ్చినప్పుడు మీకు మళ్ళి ఇస్తాను అని అన్నాడు రాజు..

పాపం తల నొప్పి అంట అని తెలియగానే అయ్యో అవునా ఎప్పటినుండి, రండి, కూర్చోండి అని నేను ఆహ్వానించాను ఇంట్లోకి, అయ్యో పర్లేదు అన్నాడు రాజు. మీరు కూర్చోండి, నేను టీ తీసుకొస్తాను అని లోపలికి వచ్చాను.

ఇక తప్పదు అన్నట్టుగా కూర్చున్నాడు రాజు, నేను అది చూసి నవ్వుకున్నా అతని భయానికి, టీ బాగా చేసి, ఒక కప్పులో పోసి, తీసుకుని వెళ్ళి ఇదిగోండి అని అంటూ అతనికి అందించాను. కప్పు ఇస్తున్నప్పుడు అతని వేళ్ళకి నా వేళ్ళు తగిలి నాకు షాక్ కొట్టినట్టుగా అనిపించింది. అది అతను గమనించినట్టు ఉన్నాడు. కళ్ళతో నవ్వినట్టుగా అనిపించింది.

ఇన్ని రోజులు అతన్ని దూరం నుండి చూడ్డమే,దగ్గర నుండి ఇదే మొదటి సారి చూద్దాం,ఎంత బాగున్నాడో,పెద్ద కళ్ళు,నొక్కుల జుట్టు,వెడల్పాటి ఛాతి, ఆరడుగుల పొడవు, మంచి కండలు తిరిగిన శరీరం, షార్ట్ లోంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయ్యిందా అని అన్నాడు రాజు. నేను ఏంటి అని అడిగాను గాబరాగా, అదే చూడడం అన్నాడు. రాజు కొంటెగా నవ్వుతూ నేనా నేనేమి చూడలేదే అన్నాను ఉలికి పడుతూ, హ సరే లెండి, మరి నేను వెళ్ళి రానా అని అన్నాడు. కప్పు చేతికి ఇస్తూ మళ్ళి అతని వేళ్ళు నాకు తగిలాయి. నాకు కొంచం బెదురు పోయినట్టుగా అనిపించింది.

సరే నేను వెళ్తున్నా అని అన్నాడు ఎంతో పరిచయం ఉన్నట్టుగా, నేను తలూపాను, అతను వెళ్తుంటే నాలో సగ భాగం ఎక్కడికో పోతున్నట్టు అనిపించింది. నిన్నా, మొన్న అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు అతను ఇంకొంత సేపు ఉంటె బాగుండు, ఇంకా అతనితో ఉంటె బాగుండు అని అనిపిస్తుంది ఎందుకో, ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అతని ఆలోచనలతో…

మేము ఎప్పుడు ఎదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళం. మాకు మాట్లాడుకోవడానికి ప్రపంచం లోని అన్ని విషయాలు ఉండేవి, మరి మేము మాట్లాడుకునేటప్పుడు ఎవరూ చూడలేదా అంటే ఎవరూ చూడలేదు అనే చెప్పవచ్చు.

వాళ్ళ చూడకుండా మాట్లాడుకున్నమో, మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు లేరో కానీ ఏవేవో మాట్లాడుకునే వాళ్ళం, అందులో ఉపయోగమైనవి ఏవి లేకపోయేవి, అయినా మాటలు ముఖ్యం కాదు. అతనితో గడపడం ముఖ్యం నాకు, అతని సమక్షంలో నాకు ప్రశాంతంగా అనిపించేది నాకు.

ఆ సమయం లో నాకు ఎవరైనా మంచి మాటలు చెప్పినా, అతనితో మాట్లాడవద్దు అని అన్నా నేను వారిని చంపడానికి కూడా వెనకాడని దాన్ని కావచ్చు, అంతటి ప్రేమలో పడ్డాను నేను అతని తో, రాజే నా లోకమా, రాజే నా ప్రాణం, రాజే నా సర్వస్వం, అతను ఒక్క రోజు కనిపించక పోయినా నా ప్రాణం విలవిల లాడేది.

ఇదేనేమో ప్రేమంటే అని బలంగా నమ్మిన నేను,అతని కోసమే రెడీ అయ్యేదాన్ని, అతని కోసమే నా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచుసేదాన్ని, అలా అతని ప్రేమలో మునిగిన నేను అతనికి లొంగి పోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.

అతని సాంగత్యం నాకు ఏంటో ప్రశాంతంగా అనిపించింది.నేను అతను ఎన్నో,ఎన్నెన్నో స్వర ద్వారాలు తెరచుకుని,వాటిలోని మధువునతా జుర్రుకున్నాము,ఎన్నో విధాలుగా ఆనందాన్ని చవి చూసాము.

ఆ ఆనందం లో, అతని ప్రేమలో నేను అన్ని మర్చిపోయాను, ఆఖరికి నా కూతుర్ని కూడా మర్చిపోయేలా చేసాడు అతను, అవును మీరు నిజమే వింటున్నారు. నేనొక విధవరాలిని. ఒక బిడ్డకు తల్లిని,పెళ్లి అయిన నాలుగేళ్ళకే, బిడ్డ పుట్టగానే నా భర్త ఒక యాక్సిడెంటు లో చనిపోవడం, నేను పుట్టింటికి చేరడం జరిగిపోయింది.

పాపని చూసుకుంటూ, నా భర్త జ్ఞాపకాలతో బతుకుతున్న నాకు రాజు పరిచయం వేసవిలో మంచుపూల జల్లు లా జరిగింది, నేను పుట్టిన పుట్టుకకు మోక్షం లభించింది అని అనుకున్నా, రాజు కూడా నన్ను బాగా అర్ధం చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను అని కూడా ఒట్టు వేసాడు మా ప్రేమ సాక్షిగా, అలా సంవత్సరం గడిచింది.

నాకు నెల తప్పింది, భయం వేసి రాజుకు చెప్పాను.

మోహం

మోహం
మోహం

అతను భయపడకు అని చెప్పి, అదే రోజు సాయంత్రం ఒక రెండు గోలీలు తెచ్చి , ఇచ్చి వేసుకో అన్నాడు. లేదు నేను వేసుకొను అని అన్నాను. ఎందుకు వేసుకోవు, మళ్ళి మీ వాళ్ళకు తెలిస్తే నీ పరువు పోతుంది, నీకు ని బిడ్డకు నీడ లేకుండా పోతుంది. నాకు ఎదో ఒక ఉద్యోగం దొరికే దాకా నువ్వు ఇక్కడ ఉండడం తప్పదు అని అన్నాడు ప్రేమగా నా కళ్ళలోకి చూస్తూ, అతని కళ్ళలో ఎదో మత్తు ఉంది.

దాంతో అతని చేతిలోని గోలీలు తీసుకుని వేసుకున్నా నేను, అంతే నా కడుపులో పిండం కరిగిపోయింది. అలా నాలుగేళ్ళు నాలుగు నిమిషాల్లా గడిచిపోయాయి. అలా అతను చేసాడు, అతని మత్తులో నేనేమి చేస్తున్నానో కూడా మర్చిపోయా..

నాలుగేళ్ళు గడిచాయి. ఇంట్లో కూడా నన్ను పట్టించుకోవడం మానేసారు. అయినా ఎవరూ పట్టించుకుంటారు, తల్లిదండ్రులు లేరు. అన్నా, వదిన దగ్గర ఉండడమే, ఇంట్లో పనంతా నా మిద వేసి, మా వదీన హయిగా కూర్చుంటుంది, లేదా అమ్మలక్కలతో మాట్లాడుతుంది. అంత పని చేస్తూ, వారికీ అన్ని సమయానికి అమర్చి పెడుతున్నా, నువ్వు తిన్నావా అని కూడా అడగరు ఎవరూ, అలాంటి విషాద సమయంలో నాకు రాజు పరిచయం ఒక వరం లా అనిపించింది.

నేను పని చేసి అలసిపోతే నన్ను ఓదార్చడానికి, ఆ అలసట నుండి ఉపశమనం పొందడానికి నాకు రాజే లోకం అయ్యాడు. కానీ, ఇలా ఎన్నేళ్ళు అనే ఆలోచన నాలో కలిగింది, నాకు ఒక కుటుంబం కావాలని ఉంటుంది కదా, అదే మాట నేను రాజునూ అడిగాను.

రాజు మనం ఎంత తొందరగా అయితే అంత తొరగా పెళ్లి చేసుకుందాం అని, ఎందుకంటే రాజు ఇన్నేళ్ళుగా చెప్తున్నా ఉద్యోగం కూడా వచ్చింది కాబట్టి,ఇక నాకు ఎదురు చెప్పడు అనే భావం తో అడిగా..

దానికి రాజు నవ్వుతూ ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది, మనం పెళ్లి చేసుకోవడం ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అని అన్నాడు. ఒక్క నిమిషం ఆ మాటలకూ తెల్ల బొయిన నేను జోక్ చెయ్యకు రాజు, ఇన్నేళ్ళ మన ప్రేమను, పెళ్లితో సాకారం చేసుకుందాం అని అనుకున్నాం కదా, మళ్ళి ఇదేంటి అని అడిగాను నేను.

ప్రేమనా, ఎవరిప్రేమ, ఎవరూ ఎవర్ని ప్రేమించారు, ఎందుకు ప్రేమించారు, ఏమిటి నువ్వు అనేది, మనం పెళ్లి చేసుకుంటాం అని అంటే చూసే వాళ్ళు నవ్వుతారు, నీ వయస్సు ఏంటి, నా వయస్సు ఏంటి,పైగా నువ్వు మొగుడు చచ్చిన ఆడదానివి, బిడ్డ తల్లివి, నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు అదే మత్తు కళ్ళతో.

నాకు మతి పోయినట్టు గా అనిపించింది. నా రాజేనా ఇలా మాట్లాడేది, నన్ను ఎంతో ప్రేమించిన రాజేనా ఈ మాటలు అంటున్నది అని అనుకుని, మరి మనం ఒక్కటి అయ్యం కదా, అదేంటి మరి అని అన్నాను నేను.

చూడు లక్ష్మి నువ్వు మొగుడు పోయి, వయస్సులో, నేను యవ్వనం లో ఉన్నాను, నువ్వు నీ కోరికలు తీర్చుకోవడానికి నన్ను పట్టావు, నేను నా కోరికల కోసం నిన్ను పట్టాను అంతే, అంతకన్నా మన మధ్య ఏమైనా ఉందా, మనం ఎప్పుడూ శారిరకంగానే కలిసాము, కానీ ప్రేమ అని నేను నీకెప్పుడు చెప్పాలేదు కదా అన్నాడు. అవును నిజమే అతను నన్నెప్పుడు ప్రేమిస్తున్నా అని చెప్పలేదు.

అంటే, అంటే ఇది ప్రేమ అని నేను అనుకున్నానా అదే మాట రాజు ని అడిగాను, అవును లక్ష్మి నువ్వు దాన్ని ప్రేమ అనుకుంటే నా తప్పు కాదు కదా, అయినా బిడ్ద తల్లిని ఎలా చేసుకుంటా, ఒకవేళ చేసుకున్నా నీ దగ్గర ఏముందని చేసుకుంటా, అంతా అయిపోయిన దానివి, పైసా లేనిదానివి, నిన్ను చేసుకుంటే నాకేమి వస్తుంది.

బయట మా వాళ్ళు నా కోసం లక్షలు కట్నం వచ్చే సంబందo మాట్లాడారు అంట, అందుకే ఇల్లు ఖాళి చేసి వెళ్ళిపోతున్నా అని అన్నాడు బట్టలు సర్దుతూ… ఛి నీచుడా నిన్నేనా నేను ప్రేమించింది, నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అని అనలనుకున్నా నా నోరు బయట పడలేదు, కానీ అతనన్న ఒక్కో మాటలో ఏంతో నిజం ఉందని అనిపించింది.

నిజమే నేను పెళ్లి అయినదాన్ని, బిడ్డ తల్లిని, బాధలో ఉన్న నన్ను నాలుగు మంచి మాటలు మాట్లాడేసరికి వాడిని నమ్మడం నేను చేసిన తప్పు, పైగా ఒళ్ళు అప్పగించడం ఇంకో తప్పు, సుఖం కోసం అని వాడు అనుకున్నాడు, దాన్ని ప్రేమ అనుకోవడం ఇంకో తప్పు, వాడు నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటాడు.

అని అనుకోవడం ఇంకో తప్పు, కానీ వాడిని నేను నమ్మింది, ఒళ్ళు అప్పగించింది కూడా నేను వాడిని నిజంగానే ప్రేమించాను, మనసా, వాచా, కర్మాణ, నేను నిజంగా ప్రేమించాను తనని, కానీ అలా అంటే ఎవరూ నమ్ముతారు.

ఎవరూ నమ్మరు కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నావు అంటారు. మీరు కూడా అంటారు నిజమే కదా, వాడి మోహంలో పడి, ఇన్నేళ్ళు నేనేం కోల్పోయానో నాకు అర్ధం అయ్యింది. వాడిని ఒక్క చూపు చూసాను. నాకే గనక శక్తి ఉంటె నా చూపుకు వాడి బూడిద అయ్యేవాడు అనుకుంటా, వాడు ఆ చూపుకు తత్తర పడి, బ్యాగు తీసుకుని, బయటకు నడిచాడు. అదే నేను వాడిని చివరి సారి చూడడం.

వాడిని మర్చిపోవడాని కి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో పనులు చేసి, చివరికి ఉపిరిసలపని పనిలో నన్ను ఉంచమని మా అన్నయ్యతో అని, నాకూ వచ్చిన టైలర్ పనితో ఒక నాలుగు మిషిన్లు కొని, షాప్ పెట్టి, దాన్ని విస్తరించి, నాలుగు వందల పనివాళ్ళు అయ్యేలా, దాన్ని వృద్ది చేయడంలో విజయం సాధించాను.

అది దేశం లోనే నెంబర్ వన్ సంస్థగా అయ్యింది, ఎన్నో అవార్డులు, రివార్డులు నాకు వస్తున్నా, పది మంది గుంపుగా కనిపిస్తే వాడు అందులో ఉండి నన్ను గమనిస్తున్నాడేమో, నన్ను కోల్పోయినందుకు బాధ పడుతూ ఉంటాడు అనే చిన్న ఆశ నాకు, అయినా రాజు నన్ను నిజంగా చేసుకుని ఉంటె, ఈ విజయం నాకు దక్కేదా? కాదు నేను అలాగే అతనికి వండి పెడుతూ ఉండే దాన్ని.

అతనికి పిల్లలని కని పెడుతూ ఉండేదాన్ని, దీనితో నాకు ఒకటి అర్ధం అయ్యింది. అదేంటి అంటే “ మగాడి విజయం వెనక ఆడది ఉండడం కాదు,”.ఆడది ఏదైనా విజయం సాధించింది అంటే దాని వెనక ఖచ్చితంగా మొగవాడి మోసం ఉంటుంది.”అని….

చూసారా నేను సామెతని కూడా మార్చేసాను, చరిత్రని తిరగ రాసాను. మోక్షాన్ని సాధించాను.

 

Related Posts