అక్షర కొరకు
అంశం :- చిత్ర కవిత
తేది:- 09/04/2026
శీర్షిక: “మౌనంలో మండే ప్రేమ”
ఎరుపు చీరలో నీవు ఉదయ సూర్యునిలా వెలుగుతుంటే,
నా హృదయం నీ కాంతిలో కరిగిపోతుంది…🌹
నీ కనుచూపు ఒక్కసారిగా తాకితే,
నా లోకం అంతా నిశ్శబ్దంగా నిలిచిపోతుంది…🌺
అమావాస్యను సైతం మర్చిపోయే నీ నల్లటి కురులు,
నా కలల రాత్రులను మరింత గాఢంగా మార్చేస్తాయి…💏
గులాబీ చెక్కిళ్ళపై నా చూపు పడితే,
నా మనసే నీ దగ్గరికి పరుగెత్తాలని తపిస్తుంది…💅
స్పర్శించాలనిపించినా,
ఆ మృదుత్వం దెబ్బతింటుందేమో అన్న భయం నా చేతిని ఆపేస్తుంది…🤝
ప్రేమ అంటే కేవలం దగ్గర కావడం కాదు,
దూరంలో నుంచే హృదయాన్ని అర్పించడం అని నేర్పింది నువ్వే…👣
నీ అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు,
మాటలకంటే నా మౌనం ఎక్కువగా నిన్ను ప్రేమిస్తోంది…👥
వెన్నెల రాత్రుల్లో నీతో గడపాలని కలలు కంటున్నాను,
కానీ ఆ కలలే నా నిజ జీవితం అయిపోయాయి…🫀
నీ కౌగిలిలో బందీ కావాలని ఉంది,
కానీ నీ గౌరవం ముందు నా కోరికలు తలవంచుతున్నాయి…💢
నీ చూపులో జ్వాలలున్నా,
నా ప్రేమ మాత్రం పవిత్ర గంగలా ప్రవహిస్తోంది…💌
నిన్ను పొందాలనే ఆశ ఉంది,
కానీ నిన్ను ఆరాధించడమే నా నిజమైన జీవితం…🫂
ఎప్పుడు కలుస్తామో తెలియదు,
కానీ ప్రతి క్షణం నీకోసమే వేచి ఉంటాను…❤️
నువ్వు నా కల, నా శ్వాస, నా ఆరాధన,
నేను నీ ప్రేమలో మునిగిపోయిన మౌన గాథనే…💐
నీకు తెలియకపోయినా,
నా ప్రపంచం మొత్తం నువ్వే ప్రియతమా… 💫
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతం అని హామీ ఇస్తున్నాను..
-మేడవరం పవన్ కుమార్ శర్మ గద్వాల