మౌన నివేదన,,,,,,!

నీకై నీవై
నీలో నీవై
మనస్సులో మంచుముద్దై
మంచుకొండల్లో సెలయేరులా
ప్రశాంత చిత్తంతో
భువిపై పొడిచిన మంచుకొండల్లో
చల్లని వాతావరణంలో
నీరెండ పన్నీటి జల్లుల్లా కురుస్తున్న వేళ
గగనం నిండా కారుమబ్బుల స్త్వైరవిహారం
కళ్ళు చెదిరే ప్రకృతి అందాలలో
అయినా కళ్ళుమూసుకుని ఏకాగ్రచిత్తంతో
బహుళ సుందర స్వప్నాల్లో మనస్సు గుభాలిస్తూ
క్రమేనా సృష్టి స్థితి లయల్లో గుప్తజ్ఞాన నిధిలోకి
నీకై నీవు మనస్సులో కట్టుకున్న గోడలన్నీ కూలిపోయి
జీవన్మరణ దుఃఖాలన్నీ అదృశ్యమై
ప్రాపంచిక సౌఖ్యాలన్నీ దూదిపింజలై తేలిపోతూ
నీ శరీరం దూదిపింజలా తేలికై
మనోతటాకంలో ఆత్మజ్యోతి దర్శనం అమోఘం
ఆ వెలుగుల్లో దేహమంతా ప్రకాశిస్తూ
ఆ సెలయేటి గలగలలు ఢమరుక ధ్వనులై
అజ్ఞాత వెలుగుపుంజం నీ ఆత్మలో పరంజ్యోతి లీనమవుతూ
కనుపాపల్లో కమలాలు పుష్పిస్తూ
నెమ్మది నెమ్మదిగా పూర్వస్థితిలోకి జారుకుంటూ
శరీరమంతా తేలికైన భావన
సృష్టికి మూలమైన ఆత్మజ్ఞానంతో
అపూర్వ అపురూప జిజ్ఞాస కాస్త విడిపోయి
నీకై నీవై
నీలో నీవై
నిత్యం సత్యం శివం సుందరం రూపసివి
ఆత్మ పరమాత్మ జ్ఞానివి
ఇహలోక బోధకివి మార్గదర్శివి

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *