యాకూబ్ తెలుగు కవి, అధ్యాపకుడు, కవిసంగమం వ్యవస్థాపకుడు. తెలుగు కవిత్వంలో ‘బహుత్ ఖూబ్ యాకూబ్’’ అని చేకూరి రామారావు (చేరా) గారి ఆంధ్రజ్యోతి పత్రిక చేరాతలు శీర్షికలో కొనియాడ్డాడు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా నియమించబడ్డాడు.
రొట్టమాకురేవు కవితా పురస్కారం తన తండ్రి కీ.శే. షేక్ మహమ్మద్ మియా, గురువు కీ.శే. కె.యల్. నరసింహారావు, మామ కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి గార్ల స్మారక కవితా పురస్కారాన్ని ఏర్పాటుచేసి, యువ కవులకు అందజేస్తున్నాడు. 2024 మే 21న హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడిగా కవి యాకూబ్ ఎన్నికయ్యాడు.
ఆయనను 2025 జూన్ 30న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
యాకుబ్ 1962, మార్చి 2న ఖమ్మం జిల్లా కారేపల్లె మండలం రొట్టమాకు రేవు గ్రామంలో షేక్ మహమ్మద్ మియా, షేక్ హూరాంబీ దంపతులకు జన్మించాడు. ఐదుగురు అన్నదమ్ములు, ఒక చెల్లెలలో యాకూబ్ రెండవవారు.
ఈయన ఉన్నత పాఠశాల వరకూ కారేపల్లి సింగరేణి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కొత్తగూడెం లోని కె.వై.కె.ఆర్.వై అండ్ బి.యన్ గౌడ్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపిసి, ఖమ్మం లోని శీలం సిద్దారెడ్డి డిగ్రీ కళాశాలలో బికాం డిగ్రీ చదివాడు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.ఎ తెలుగు చేసి, మసాబ్ ట్యాంక్ లోని కాంప్రహెన్సివ్ కాలేజ్ లో తెలుగు పండిత శిక్షణ పొందాడు. 1990లో రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం నుండి తెలుగు సాహిత్య విమర్శ లో రారా మార్గం అనే అంశంలో యం.ఫిల్ పట్టా పొందాడు. 2007లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ‘తెలుగు సాహిత్య విమర్శ – ఆధునిక ధోరణులు’ పైలో పరిశోధన చేసి పి.హెచ్ డి డాక్టరేట్ పట్టా పొందాడు.
1991 మే 10న డాక్టర్ పి.లక్ష్మి (శిలాలోలిత) ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సందీప్, సాహిర్ భారతి.
ప్రస్తుతం హైదరాబాద్ లోని చైతన్యపురిలో స్వంత ఇంటిలో నివసిస్తున్నాడు. 1990 నుంచి 2018 వరకు హైదరాబాద్ లోని అన్వర్ ఉల్ ఉలూమ్ కళాశాల లో తెలుగు శాఖ అధ్యక్షునిగా విధినిర్వహణలో ఉన్నాడు.2018,2019,2020లలో గోల్కొండ డిగ్రీ కాలేజి, సిటీ కాలేజీలలో పనిచేసారు. 2008 లో ద్రవిడ యూనివర్శిటీ, కుప్పంలో డిప్యుటేషన్ పై కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా బాధ్యతలు నిర్వహించాడు. 2020 మార్చిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేసి, ప్రస్తుతం హైదరాబాదులోని ముంతాజ్ కాలేజీ ప్రిన్సిపాల్ పనిచేస్తున్నాడు.
అంతర్జాలంలో బహుళ ప్రాచుర్యం పొందుతున్న తెలుగు కవిత్వ వేదిక కవిసంగమంను ప్రారంభించి నిర్వహిస్తున్నాడు. దీనిద్వారా వందలాదిమంది కవుల కవిత్వాలను ఒక దగ్గర చేర్చుతున్నాడు. కవిసంగమం అనే ఫేస్బుక్ వేదికను 2012లో ప్రారంభించి గత పదేళ్లుగా కొత్తతరం కవుల వేదికగా మలిచి, సీనియర్ కవులతో కలిసేందుకు కవిత్వ సందర్భాలను, కవిసంగమం పొయట్రీఫెస్టివల్స్, జాతీయ కవులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ప్రతినెలా ‘మూడుతరాల కవిసంగమం’, ‘ఊరూరా కవిసంగమం’ నిర్వహిస్తున్నాడు.
రచించిన పుస్తకాలు
1991 – తెలుగు సాహిత్యంలో రారా మార్గం (పరిశోధనా వ్యాసం)
1992 – ప్రవహించే జ్ఞాపకం (కవితాసంపుటి), 1997 లో రెండవ ముద్రణ
2000 – Arc of Unrest (కవిత్వ ఆంగ్లానువాదాలు)
2002 – సరిహద్దురేఖ (కవితాసంపుటి)
2008 – తెలంగాణా సాహిత్య విమర్శ (సాహిత్య వ్యాసాలు)
సంపాదకత్వం వహించిన పుస్తకాలు
చలం శతజయంతి సంచిక (1995)
దేవి30-అభినందన సంచిక
దేవిప్రియ కవితల సంకలనం (2000)
గుజరాత్ గాయం (2002)
మనచేరా (2003)
2009లో ఎడతెగని ప్రయాణం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు కూడా లభించింది.
1989లో రంజని – కుందుర్తి పురస్కారం
1993లో ఎస్.వి.టి.దీక్షితులు పురస్కారం
1998లో అమిలినేని లక్ష్మీరమణ స్మారక ధర్మనిధి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం
2000లో కె.సి.గుప్తా సాహిత్య పురస్కారం
2003లో డా.సి.నా.రె.కవితా పురస్కారం.
కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారులు
తెలుగుకవిగా కేరళలోని తుంచన్ కవిత్వోత్సవంలో పాల్గొనడం.
తెలుగుకవిగా కేరళ యూత్ ప్రోగ్రాంలో కవిగా, మోటివేటర్ గా పాల్గొనడం .
తెలుగుకవిగా అలహాబాద్ జాతీయ కవిసమ్మేళనంలో పాల్గొనడం .
కేంద్ర సాహిత్య అకాడెమీ ఆహ్వానం మేరకు వారణాశి, గోవా, త్రివేండ్రం, విజయనగరం, గౌహతి, హైదరాబాద్, కవిత్వోత్సవాలలో తెలుగుకవిగా పాల్గొనడం.
మాధవి కాళ్ల
సేకరణ