అక్షర కొరకు
అంశం : చిత్రకవిత
శీర్షిక :రాఖీ,,,,,,రక్షాబంధన్,,,,!
అమ్మా నాన్నల
రక్తం పంచుకుపుట్టిన
రక్తబంధం,,,,ఒకే రక్తసంబంధం
ప్రేమైకరూపసులం,,,,,,,
అన్నాచెల్లెళ్ళం,,,,, అక్కాతమ్ముళ్ళం
కనుపాపల కలవరింతలు
పెదవులు పలికే మంగళకర పదం
సోదరునికి సోదరి కట్టే రక్షాబంధన్
వివాహాలతో దూరమైన బంధం
మూగమనస్సులో ప్రేమైక
పవిత్రబంధం ఊపిరిబంధం
అన్నాచెల్లీ అనురాగం
అక్కాతమ్ముళ్ళ జీవనరాగం
ఎన్నటికీ చేరిపేయలేని
బాల్యం ఆటపాటలు కేరింతలు
ఒకరి బువ్వ ఒకరు పంచుకుని తిన్న తీరు
అమ్మ చేతి గోరుముద్దలు
పోటీలు పడి తిన్న తీరు,,,,,
మనం జన్మసంబంధీకులం
నిరంతరం వెలిగే చిరు చిరు దివ్వెలం
రక్షాబంధన్ శుభాకాంక్షలు
అపరాజిత్
సూర్యాపేట